నా స్వప్నం..
నా స్వప్నం | ఫణీంద్ర కుప్పిలి
నేనొక కలగంటున్నాను..
ఒక మాజీ మంత్రి
తనకి రావాల్సిన పింఛను డబ్బు కోసం
ఆఫీసు ముందు నిల్చున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక మంత్రి గారి కారు
రోడ్డు దాటుతున్న ఒక ముసలి అవ్వ కోసం
సిగ్నల్స్ వద్ద ఠక్కున ఆగినట్లు..
నేనొక కలగంటున్నాను..
తనకు పుట్టబోయే బిడ్డ సీటు కోసం
ఒక గవర్నమెంట్ బడి ముందర
బారుతీరిన లైన్లో నిల్చున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక సర్కారీ దవాఖానాలో
సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు
అర్ధరాత్రి దాటే వరకూ డ్యూటీ చేస్తున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ప్రభుత్వ కార్యాలయాల్లో
చేతులు తడపకుండానే
చకా చకా ఫైల్స్ కదులుతున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక సోదరి అర్థరాత్రి
నిర్భయంగా తన ఇంటికి చేరుకున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
దేశం లో రాజకీయపార్టీలు
నోట్లు పంచకుండానే
ఓట్లడిగి గెల్చినట్లు...
నేనొక కలగంటున్నాను..
కుల మత వర్గ భేదాలు లేని
భారతావని నా జీవిత కాలం లోనే
సాకారమయినట్లు...
నేనొక కలగంటున్నాను..
ఒక మాజీ మంత్రి
తనకి రావాల్సిన పింఛను డబ్బు కోసం
ఆఫీసు ముందు నిల్చున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక మంత్రి గారి కారు
రోడ్డు దాటుతున్న ఒక ముసలి అవ్వ కోసం
సిగ్నల్స్ వద్ద ఠక్కున ఆగినట్లు..
నేనొక కలగంటున్నాను..
తనకు పుట్టబోయే బిడ్డ సీటు కోసం
ఒక గవర్నమెంట్ బడి ముందర
బారుతీరిన లైన్లో నిల్చున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక సర్కారీ దవాఖానాలో
సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు
అర్ధరాత్రి దాటే వరకూ డ్యూటీ చేస్తున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ప్రభుత్వ కార్యాలయాల్లో
చేతులు తడపకుండానే
చకా చకా ఫైల్స్ కదులుతున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
ఒక సోదరి అర్థరాత్రి
నిర్భయంగా తన ఇంటికి చేరుకున్నట్లు..
నేనొక కలగంటున్నాను..
దేశం లో రాజకీయపార్టీలు
నోట్లు పంచకుండానే
ఓట్లడిగి గెల్చినట్లు...
నేనొక కలగంటున్నాను..
కుల మత వర్గ భేదాలు లేని
భారతావని నా జీవిత కాలం లోనే
సాకారమయినట్లు...