అనగనగా ఆదివారం..
అనగనగా ఆదివారం..
ఎపుడో అర్థ పుష్కర కాలం కిందట రావాల్సిన మా రిజల్ట్స్..అన్ని పురిటి నొప్పుల్ని దాటుకుని .. మా చేతికి పోస్టింగ్ ఆర్దర్లు వచ్చేసరికి..సగం మంది మగాళ్ళకి నూనె ఖర్చు తగ్గి..రంగు ఖర్చు పెరిగిపోయింది😂😂 మొత్తానికి బ్రహ్మచారులుగా ఉన్నపుడు పొందాల్సిన ట్రైనింగు..అంకుల్స్ (..ఆంటీ)😀😀గా మారాక మొదలైంది..
దాంతో బాధ్యతలు పెరిగి.. ఎపుడెపుడు ఇంటికి వెళదామా అని.. పేరోల్ కోసం ఎదురు చూసే జీవిత ఖైదీ లా..రెండో శనివారం కోసం ఎదురుచూడ సాగాం.. ఆదివారం నాడు మాంఛి నాటు కోడి పలావు ని సిద్ధం చేసుకుని.. భోజనానికి కూర్చునే సరికి.. ఉరుము లేని వర్షం లా వచ్చిన అతిథులు..ముక్క కూడా మిగల్చకుండా.. తినేసినట్లుగా.. మా రెండో శనివారం కాస్తా.. అస్సలు వినలేని క్లాసుతో కొట్టుకుపోయింది😢😢..దాంతో.. చేతిలోని లాలీపాప్ లాక్కుంటే.. చిన్న పిల్లోడికి కలిగిన ఫీలింగ్ తో ఉసురుమంటూ.. శనివారం గడిపాము..
ఆదివారం నాడు ఉదయం.. ఫ్యాక్టరీ సైరన్ లాంటి..మా వార్డెన్ వాయిస్ కి తుళ్ళిపడి లేచిన మేము..ఎలాగోలా తయారయి.. టిఫిన్ కోసం 'దోసకాయ క్యాంటీన్'🍐(.. మరేంటో అనుకునేరు.. ఇక్కడ రోజూ అదేదో సినిమాలో ములక్కాడ స్పెషల్స్ లాగా.. అన్నీ దోసకాయ స్పెషల్స్) లోకి నడిచాం.. ఈలోగా కొంతమంది మిత్రులు.. 'దండకం' చదువుతూ.. బయటికి వస్తున్నారు.. ఏంటి విషయం చూద్దామని క్యాంటీన్ లోకి వెళ్లే సరికి.. మిగిలిన పోయిన ముందురోజు చపాతీలని మాకోసం మళ్లీ.. బాటా చెప్పు దలసరితో తయారు చేసినట్లుగా ఉండటంతో😁😁..అపుడు అర్థమయింది.. ఎందుకు మావాళ్ళు దండకం చదివారా అని..
ఏదో మన ఖర్మ అనుకుని నీళ్లలో నానబెట్టి అయినా తినేస్తే సరిపోయేది.. కానీ కడుపు కంటే ముందు ఈగోని సేటిసిఫై చేయవలసి రావడంతో.. ఆస్థాన ఆటోవాలకి కాల్ చేయడం.. క్షణాల్లో ఆడు ఓ బుల్లి ఆటోతో మా ముందు ప్రత్యక్షం కావడం టక టక జరిగిపోయింది.. కానీ మేము అరడజను మందికి పైగా ఉండటంతో.. 'ఆతడు' సినిమాలో రెండు డజన్ల మంది ఒకే సుమోలో వెళ్లినట్లు..ఏదోలా ఒకరి మీద ఒకరు పడి టౌన్లోకి చేరుకుని.. ఓ నాలుగు దోశల్ని.. ఓ రెండు టీ చుక్కల్ని గొంతులో పోసుకున్నాం..

అప్పటికే.. 'చారణా కోడికి.. బారణా మసాలా' (..అదే మా వైపు అయితే.. చల్దన్నం ఖర్చు కన్నా..ఊరగాయ ఖర్చు ఎక్కువైనట్లు..) అన్నట్లు.. టిఫిన్ ఖర్చు కన్నా.. ఆటో చార్జీ వాచిపోయింది.. అక్కడితో..మర్యాదగా అన్ని మూసుకుని.. హాస్టల్ కి వచ్చిపడుంటే..బావుండేది.. కానీ ఇంతలో మావాడొకడు.. ది పేమస్ 'సూర్యలంక బీచ్' కి వెళదామని ప్రపోజల్ పెట్టాడు.. మాలో కొంతమంది వెళదామని..మరికొందరు వద్దని అనడంతో.. మా నాయకుడు👳.. ఈ చిక్కుముడిని విప్పటానికి చేతులెత్తి సమ్మతిని తెలియజేయమన్నాడు.. తీర్మానం ఒక ఓటు ఆధిక్యంతో ఆమోదం పొందడంతో.. అప్పటికే చిన్న వర్షం మొదలైనప్పటికీ🌨️.. చేసేదిలేక ఆటోని మాట్లాడుకుని బీచ్ కి వెళ్లాం..
అయితే అక్కడ కలలో కూడా ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది.. అదేంటి అంటే.." ..బీచ్ కి తాళం వేయడం.." పార్కులకి సైతం తాళం వేయడం చూసాం.. గానీ అక్కడ బీచ్ కి తాళం వేసి ఉండటంతో.. షాక్ కి గురయ్యాము.. అసలు ఈ తాళం కాన్సెప్ట్ ఏంటా అని తెలుసుకోడం కోసం..చిన్న బజారులా ఉంటే.. దానిని దాటుకుని వెళితే.. సముద్రం కనిపించింది.. అక్కడ పోలీసు మామలు ఉండటంతో.. చేసేదిలేక.. "సముద్రంతో సెల్ఫీ" దిగి.. పనిలో పని మావాళ్ళు ఓ చేప🐟ముక్కనితిని.. ఉస్సురమంటూ.. మళ్లీ గోడకి కొట్టిన బంతిలా హాస్టల్ రూమ్ కి వచ్చి పడ్డాం..

ఇంత జరిగినాక కూడా..మేము ఏమాత్రం తగ్గకుండా సాయంత్రం మళ్లీ ఆటో బుక్ చేసుకుని టౌన్లోకి వెళ్లాం.. మా వాళ్ళు సినిమాకి వెళదామనటంతో.. ఏ సినిమాకి వెళ్ళాలి అనే దానిపై.. బాగా చర్చ జరిగింది.. మళ్లీ యాజ్ యూజువల్ గా 🙋మెజార్టీ అభిప్రాయంతో.. విశ్వరుపం2(..ఆల్రెడీ మొదటి పార్టు షాకిచ్చినప్పటికీ..)కి టికెట్ తీసుకుని వెళ్లాం.. మా ఖర్మకొద్దీ స్క్రీన్ కి దగ్గరగా సీట్ నంబర్స్ రావడంతో.. జీవితంలో మొట్ట మొదటి సారిగా..స్క్రీన్ ని అంత దగ్గరగా చూసే అ(దుర)దృష్టం కలిగింది.. దాంతో.. మాములు థియేటర్ లో చూసినా.. ఐమాక్స్ లో చూసిన ఫీలింగ్ కలిగింది..ఇక సినిమా విషయానికొస్తే.. మొదటి పార్టు లాగానే.. సీక్వెల్ లో కూడా విశ్వరూపాన్ని చూపించడంతో.. మాకు రంగుపండింది..
చివరికి వర్షంలో తడుచుకుంటూ.. కొంతదూరం నడిచాక.. ఓ ఆటో తగలడంతో..దాంట్లోవచ్చి డైరెక్టుగా మన "దోసకాయ్ మెస్"🍐 లో దూరాం.. యాజయూజువల్ గానే మెస్సోడు.. సగం కాలిన చపాతీలని మా మొహాన కొడితే.. పూర్తిగా మాడిపోయిన పేసులతో తిని.. బ్రతుకు జీవుడా అంటూ... రూమ్ కి వచ్చి పడ్డాం..