Posts

Showing posts from November, 2022
జీవితం | ఫణీంద్ర కుప్పిలి మనం వృధా చేసే ప్రతీ అన్నపు మెతుకు ఎందరికో ఆకలి మంట తీర్చే అమృతం.. మనం చిన్న చూపు చూసే ఉద్యోగం.. ఎందరికో జీవితకాల స్వప్నం.. మనకు ఉన్నది ఆనందం కలిగించదు.. మనకు లేనిది సంతోషంగా ఉండనివ్వదు.. అందరూ ఆనందంగా ఉన్నారనే భావం. అందంగా కనిపించే చందమామ వంటిది.. తరచి చుడాలే గానీ ఇంటికో కథ.. మనిషికో వ్యధ.. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని  నిరంతరం సాగిపోవటమే జీవితం.. గడిచిన కాలాన్ని, చేజారిన అవకాశాన్ని  తలచుకుని ఆగిపోవటం మరణం.. 27.11.2022
సంతోషం నా దరి చేరనంటోంది.. బాధ నన్ను విడిచి పోనంటోంది.. నా సంతోషానికి ఆత్రమెక్కువ.. నా కష్టాలకు ఓపికెక్కువ.. నా జీవితంలో సంతోషం.. శ్రీవారి దర్శనంలా ఊరిస్తోంది.. ఆమడ దూరంలోనే ఉన్నా.. అనుభవైకవేద్యం కానంటోంది.. ఆశల ఎదురు చూపులతోనే ముడొంతుల కాలం కరిగిపోతోంది.. అను నిత్యం ఊభిలో దున్నలా మనసు పెనుగులాడతోంది.. అయినా మనోవాక్కాయకర్మల యందు  ఆధ్యాత్మిక చింతనతో తపిస్తునే ఉన్నా ఈశ్వరా..

యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి

 యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి తుపాకులతో, బాంబులతో..  అంతులేని హింసతో.. చేసేది మాత్రమే యుద్ధం కాదు.. అన్యాయాలను, అక్రమాలను.. మాసిపోని వివక్షతను ఎదిరించి నిలబడటం యుద్ధమే.. పెత్తనం దారుల దౌర్జన్యాలతో అభాగ్యుని గొంతుక పూడుకపోయినపుడు గళమెత్తి పోరాడటం యుద్ధమే.. యుద్ధం చేయటం నేరం కాదు, ఘోరం కాదు.. యుద్ధానికి యుద్ధానికి మధ్య  సంధి కాలమే శాంతి అయితే.. ఆ శాంతి కోసమే యుద్ధం చేద్దాం.. మనిషి పుట్టుక ఒక యుద్ధం.. మనిషి చావు ఒక యుధ్ధం.. అనుక్షణం పోరాటం.. మనిషి మనుగడకై ఆరాటం.. 06.11.2022