సంతోషం నా దరి చేరనంటోంది..
బాధ నన్ను విడిచి పోనంటోంది..
నా సంతోషానికి ఆత్రమెక్కువ..
నా కష్టాలకు ఓపికెక్కువ..
నా జీవితంలో సంతోషం..
శ్రీవారి దర్శనంలా ఊరిస్తోంది..
ఆమడ దూరంలోనే ఉన్నా..
అనుభవైకవేద్యం కానంటోంది..
ఆశల ఎదురు చూపులతోనే
ముడొంతుల కాలం కరిగిపోతోంది..
అను నిత్యం ఊభిలో దున్నలా
మనసు పెనుగులాడతోంది..
అయినా మనోవాక్కాయకర్మల యందు
ఆధ్యాత్మిక చింతనతో తపిస్తునే ఉన్నా ఈశ్వరా..