జీవితం | ఫణీంద్ర కుప్పిలి
మనం వృధా చేసే ప్రతీ అన్నపు మెతుకు
ఎందరికో ఆకలి మంట తీర్చే అమృతం..
మనం చిన్న చూపు చూసే ఉద్యోగం..
ఎందరికో జీవితకాల స్వప్నం..
మనకు ఉన్నది ఆనందం కలిగించదు..
మనకు లేనిది సంతోషంగా ఉండనివ్వదు..
అందరూ ఆనందంగా ఉన్నారనే భావం.
అందంగా కనిపించే చందమామ వంటిది..
తరచి చుడాలే గానీ
ఇంటికో కథ.. మనిషికో వ్యధ..
దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని
నిరంతరం సాగిపోవటమే జీవితం..
గడిచిన కాలాన్ని, చేజారిన అవకాశాన్ని
తలచుకుని ఆగిపోవటం మరణం..
27.11.2022