యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి
యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి
తుపాకులతో, బాంబులతో..
అంతులేని హింసతో..
చేసేది మాత్రమే యుద్ధం కాదు..
అన్యాయాలను, అక్రమాలను..
మాసిపోని వివక్షతను
ఎదిరించి నిలబడటం యుద్ధమే..
పెత్తనం దారుల దౌర్జన్యాలతో
అభాగ్యుని గొంతుక పూడుకపోయినపుడు
గళమెత్తి పోరాడటం యుద్ధమే..
యుద్ధం చేయటం నేరం కాదు, ఘోరం కాదు..
యుద్ధానికి యుద్ధానికి మధ్య
సంధి కాలమే శాంతి అయితే..
ఆ శాంతి కోసమే యుద్ధం చేద్దాం..
మనిషి పుట్టుక ఒక యుద్ధం..
మనిషి చావు ఒక యుధ్ధం..
అనుక్షణం పోరాటం..
మనిషి మనుగడకై ఆరాటం..
06.11.2022