జ్ఞాపకాల తీరంలో | ఫణీంద్ర కుప్పిలి
జ్ఞాపకాల తీరంలో | ఫణీంద్ర కుప్పిలి
ఆలోచనలు ఎడతెరిపి లేకుండా
సముద్రపు అలలు వలె
అనంతంగా సాగిపోతున్నాయి..
మారిపోయిన బంధాలు..
మరిచిపోయిన అనుబంధాలు..
నీటి పై వృత్తాల్లా చెదిరిపోతుంటే..
కాలం అనే ఇసుక తిన్నెపై
నిన్నటి అడుగులు చెరిగిపోతున్నాయి..
కనుపాపల వెనుక దాచుకున్న కలలు
కన్నీటి ధారల్లో కరిగిపోతున్నాయి..
ఎదురుచూపుల తీరంలో ఒంటరిగా..
మౌనమే భాషగా, శూన్యమే తోడుగా..
నిశ్శబ్దం వినిపిస్తున్న ఈ గుండె చప్పుడు
ఏ తీరాన్ని చేరుతుందో.. ఏ జ్ఞాపకంలో ఆగుతుందో!
02.05.2026