గాయాల చిరునామా | ఫణీంద్ర కుప్పిలి

గాయాల చిరునామా |  ఫణీంద్ర కుప్పిలి

తీరం దాటేవరకే వారధి…

ఆపై అది జ్ఞాపకాల శిథిలం..


తీయని మాటల వెనుక

దాచిన గాయాల చిరునామాలు.

అవసరాల అంచున ఆప్యాయతల నాటకం…

తెరపడగానే మిగిలేది మౌనపు లోయ..


నమ్మిన గుండెకు

మోసం ఎప్పుడూ రక్తస్రావమే.

ప్రతి ద్రోహం

ముక్కలైన అద్దంలా మనల్ని వెక్కిరిస్తుంది.

పరాయివాడి బాణం కంటే…

మనవాడి విషపు స్పర్శే ఎక్కువ బాధ.

నిశ్శబ్దంగా…

ఊపిరిని చిదిమేస్తూ…!!

09.05 .2026

పాప్యులర్ పోస్టు

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి