చివరికి మిగిలేది

చివరికి మిగిలేది || ఫణీంద్ర కుప్పిలి

ఒంటరితనం అంటే..
చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు..
వంద మంది మధ్యలో ఉన్నా..
నా అనుకునే వాళ్ళు లేకపోవడం..
మన ఉనికిని గుర్తించే వారు కరువు అవడం..

మన జీవితాలలోకి వచ్చే అందరూ..
ప్రయాణంలో తోటి ప్రయాణికులు లాంటి వారే..
ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మజిలీలో విడిచి పోవాల్సిందే..

కొందరు మనలో సంతోషాన్ని నింపి వెళితే..
మరికొందరు బాధను మిగిల్చి వెళతారు..

చివరకు మిగిలేది మాత్రం..
అనంతమైన నిశ్శబ్ధం..
భరించ లేని ఏకాకితనమే..


పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..