వలస పక్షులు

వలస పక్షులు || ఫణీంద్ర కుప్పిలి

కూటికోసం గూటినొదిలి
వలసపోయిన పక్షులన్నీ..
సొంత గూటిని చేరుకుంటే..
పోటెత్తిన పల్లెసీమలు..
బోసిపోయిన నగరాలు..

సంక్రాంతి ముగిసింది..
సంబరాలు ముగిసాయి..

మరోమారు మెతుకు వేటకై..
బతుకు బాటలో..
ఎగిరిపోతున్న వలస పక్షుల్ని చూసి..
పల్లె తల్లి పేగు కాలుతోంది..

17 జనవరి, 2019

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి