మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి
మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్నాం.. డ్రోన్లతో సరకుల్ని చేరవేస్తున్నాం.. హృదయాంతరాళాల్ని శోధిస్తున్నాం.. డిజైనర్ బేబీల్నీ సృష్టిస్తున్నాం.. కానీ నేటికీ.. కుళ్ళిన కంపు కొట్టే చెత్తనీ.. ముట్టుకోవటానికే భయపడే వ్యర్ధాల్నీ.. తలచుకోడానికి కూడా అసహ్యించుకునే మానవ మాల మూత్రాల్నీ... మనలాగే.. రక్తమాంసాలతో.. కోటి ఆశలతో.. భావోద్వేగాలతో.. ఓ తల్లి కడుపున పుట్టిన.. మనతోటి సోదరులు.. తమ మాన ప్రాణాల్ని.. తమ భవిష్యత్తుని పణంగా పెట్టి.. మనకు గౌరవ మర్యాదల్ని.. ఆరోగ్యకరమైన జీవితాన్ని.. మన జీవితాల్లో వెలుగుల్ని నింపుతూ.. వాళ్ళు మాత్రం నాలుగు మెతుకులు కోసం.. చీకటి కూపాల్లో చిక్కుకుంటున్నారు.. * * * సిరియాలో కుర్దుల హక్కుల కోసం పోరాడతాం.. రోహింగ్యాల అణచివేతపై ఉద్యమిస్తాం.. తీవ్రవాదుల మరణాలపై సంతాపం తెలియజేస్తాం.. చివరికి రేపిస్టుల హక్కుల కోసం గళమెత్తుతామ్.. కానీ.. చట్టాలు చట్టు బండలై.. చేసిన బాసలు నీటిపై రాతలై.. మన అభివృద్ధిని.. మన నాగరికతను.. ప్...