రుధిర ఘోష | ఫణీంద్ర కుప్పిలి




రుధిర ఘోష  | ఫణీంద్ర కుప్పిలి

ఇదేంటి?
ఇక్కడంతా నెత్తురు మడుగులా ఉంది?
అన్ని వైపులా పచ్చి నెత్తురు
కంపుకొడుతోంది??
రాత్రి చిమ్మ చీకట్లో
ఏ గజంపోతునన్నా బలేశారా??
మరిదేంటి?
మదమెక్కిన ఆబోతుల రంకెలు ఒకవైపు,
నేలకొరిగిన వీరుల హాహాకారాలు ఒకవైపు??
ఎవరు? ఎవర్ని బలేశారు??
మనిషి వధ నిషేధం కాదా మన దేశంలో..
అంటే...
ఇంకా దళితులు మనుషులుగా గుర్తింపు పొందలేదా
నా అధునిక భారతంలో??
మరి మనవతావాదులంతా ఏరి??
చీమ చిటుక్కుమన్నా
వచ్చివాలిపోయే మన ఖాకీచొక్కాలేరీ??
ఓట్లప్పుడు ఊరూ వాడా తిరిగే మన ఖద్దరుబాబులేరీ??
అయినదానికీ,కానిదానికీ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే మన కుహానా మేధావులేరీ??
ఓహో..
వీళ్ళు అగ్రకులాల హక్కులకి మాత్రమే
కాపలాదారులా??

మూడు దశాబ్దాలు గడిచినా
రగులుతోంది కారంచేడు చితిమంట..
నేటికీ నాజాతికి నిలువ నీడ లేదా అని
ప్రశ్నిస్తోంది 'రుధిర క్షేత్రం' సాక్షిగా..


పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం