చిన్నారుల దినోత్సవం | ఫణీంద్ర కుప్పిలి
చిన్నారుల దినోత్సవం |ఫణీంద్ర కుప్పిలి
ఎత్తైన విగ్రహాలు..
ఘనమైన దినోత్సవాలు.
జాతి భవిష్యత్తును తీర్చిదిద్దజాలవు..
ఏ రోజైతే పిడికెడు మెతుకులు కోసం..
నాలుగు అక్షరం ముక్కల కోసం..
ఆప్యాయంగా అక్కున చేర్చుకునే చేతుల కోసం..
పెద్దరికం మాటున చిట్టి దేహాల్ని కబళించని ప్రేమకోసం..
ఆబగా ఈదేశ రేపటి పౌరులు..
అర్రులు చాచని రోజు..
అసలైన చిన్నారుల దినోత్సవం జరుపుకుందాం..
14.11.2018