రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి

రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి

ఆకలిగొన్న తోడేళ్ళ  వేటలో
ఖండ ఖండాలుగా చీల్చబడిన
శరీరాల మాంసపు ముద్దల్ని
గోతాల్లో కుక్కి ఈడ్చుకెల్తుంటే
బొట్లు బొట్లుగా కారిన
రక్తపు చుక్కలు ఏరులై పారి
తుంగభద్ర కాలువలో కలుస్తుంటే..

ఆ ప్రదేశమంతా..
పాప ప్రక్షాళనకై తన రక్తాన్ని
చిందించిన క్రీస్తు శిలువని
తలపిస్తోంది..
కారంచేడు కత్తి గాట్లు ఇంకా
పచ్చి పచ్చిగా సలపరమెడుతుంటే
ఇంతలోనే రక్తసిక్తమైన..
రక్తక్షేత్రం..

ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన
దళితోద్యమ జ్వాల
అనతికాలంలోనే..
నిట్టనిలువునా చీలిపోయింది...
పాతికేళ్ళుగా ఆరని...
చుండూరు చితిమంటలు..
మన ప్రజాస్వామ్యాన్ని
నిరంతరం మసిబారుస్తున్నాయి..

  07.08.2016

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం