ప్రేమికుల రోజు v2.0 || ఫణీంద్ర కుప్పిలి
ప్రేమికుల రోజు v2.0 || ఫణీంద్ర కుప్పిలి
ఈ ' వేలంటైన్స్ డే' ని జరుపుకోడం అనేది మన సంస్కృతికి విరుద్ధమా? కాదా? అనే సిధ్ధాంత రాద్ధాంతాలని పక్కన పెడితే.. ప్రేమికులు తమ ప్రేమని వ్యక్తపరచుకోడానికి ఒక రోజుని పండగలా జరుపుకోడంలో మన సంస్కృతికి భంగం కలిగేదేముంది? అయితే హృదయం నిండా ప్రేమని వాళ్ళకి ఈ ప్రత్యేక సంబరాలు అవసరమా?? అనే మెట్ట వేదాంతాలన్నింటినీ కాసేపు పక్కన పెడితే..
కొంతమందికి మాత్రం ఇదో గొప్ప పర్వదినం.. మరీ ముఖ్యంగా మా ' పెళ్ళి ' కాని ప్రసాదు లాంటోడికి.. అదేమి ఖర్మోగానీ.. ఉద్యోగం.. హోదా..అందం అన్నీ ఉన్న మావాడికి.. ఎన్ని సంబంధాలు వెతికినా.. శివారాఖరుకి ఏదోలా బెడిసికొట్టేస్తున్నాయి.. మా ప్రసాదుకి పెళ్ళి కాలేదన్న బాధ కన్నా.. ఎక్కడ ఏ శుభకార్యానికి వెళ్ళినా మనోడి పెళ్ళే..ఓ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది..
'..మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందా?లేదా?.. శాసన మండలి ఎప్పటిలోగా రద్దవుతుంది?.. లక్ష కోట్ల అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితిమవుతుందా??..' అంటూ క్షణం తీరిక లేకుండా మూడు రాజధానుల ముచ్చట్లతో అంటకాగుతున్న తెలుగు మీడియా గొట్టాల మాదిరి.. బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టేసిన సినిమా కెళ్లిన ప్రేక్షకులు.. ఆట మొదలైన ఐదు నిమిషాలకే పోలోమని బయటకెళ్లినట్లుగా.. ఒకవైపు పార్టీలోని పెద్ద తలకాయలన్నీ.. ఒక్కొక్కటి బయటపడుతుంటే..మరో వైపు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా..ఉన్నాడో లేడో తెలియని అయోమయంలో.. ఆమాసకి పున్నానికి పూనకం వచ్చినట్లు ఊగిపోయే దత్తపుత్రుడి ప్రసంగంలా..ఎపుడూ కుర్చీ గోలే గానీ..సామాన్యుడి గోడుపట్టని. ప్రతి(పచ్చ) నాయకుడి..ఎడతెరిపి లేని అమరావతి ఊకదంపుడు ఉపన్యాసంలా.. ఎక్కడకెళ్ళినా..మనోడి పెళ్ళి గురించిన చర్చలూ.. వాదోపవాదాలు.. సంక్రాంతి కోడి పందాలలో బెట్టింగులంత జోరుగా సాగిపోతున్నాయి..
ఇపుడీ సోదంతా...ఎందుకు చెప్తున్నాను అంటే.. ఈ ప్రేమికుల దినం నాడు.. ఏ అమ్మాయితోనైనా మాట్లాడుతూ ఏ పార్కులోనో కనబడితే..అదేదో..జబర్దస్త్ దళ్ అంట..కాణీ ఖర్చు లేకుండా..ఆళ్ళే..డవిరెక్టు గా తాళి కట్టించేస్తున్నారని.. విన్నప్పటినుండి.. మావాడుకి ఇదో పర్వదినమైపోయింది..ఇక అంతే..ఓ వారం రోజుల కిందటి నుండి..ఏ పార్కులో రద్దీ ఎక్కువగా ఉంటుంది?? ఎక్కడ ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తున్నారని?? ఆరా తీయడంతో పాటు... అవసరమైతే చేతులు తడపడానికి సైతం సిద్ధమైపోయాడు..
మావాడి ప్రిపరేషన్లు ఒక వైపు ఇలా 'ఇస్రో' ప్రయోగంలా..యమస్పీడుగా సాగిపోతుండగా..మరో వైపు.. ముల్లోకాలలో సైతం.. పెద్ద కలకలం మొదలైంది.. అన్నిలోకాల్లోనూ..భార్యలు ' మొండి దేవున్ని ' ప్రసన్నం చేసుకోడం కోసం కఠినమైన నోములు..వ్రతాలు మొదలు పెట్టేశారంట.. ఇంతకీ విషయమేంటని ఆరా తీయగా..ఇలా భూలోకంలో.. అందునా మన భారతావనిలో.. ఈ జబర్దస్త్ దళ్ వారు " పార్కుల్లో పెళ్ళిళ్ళు " అనే కొత్త రియాలిటీ షో మొదలెట్టారని తెలిసి..మగ దేవతలంతా.. తత్కాల్.. ప్రీమియం తత్కాల్ లో బాదుడెక్కువైనా సరే..యమ అర్జెంట్ గా రిజర్వేషన్లు చేయించేసుకుని మరీ బయలుదేరేెశారంట.. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేక కొంతమంది...ఈ బాదుడిని తట్టుకోలేని చిన్న చితకా దేవతలు మరికొంతమంది.. ఏదోలా..ఓ ' హిందూ' పేపర్ ని కొనుక్కుని ' జనరల్ కంపార్టుమెంట్ ' ఎక్కేశారంట..
అసలే వరుస విదేశీ యానాలతో..ఏ పూట.. ఏ రంగు సూట్ వేసుకోవాలో తేల్చుకోలేక..యమా టెన్షన్ పడుతున్న 'మొండి దేవుడు' వారు.. అభిమానులు తాకిడికి ఉక్కిరిబిక్కిరయ్యే సినిమా హీరోలా..ఈ నోముల గోలకి బాగా డిస్టర్బ్ అయిపోయారంట.. సరే ఓపాలి ప్రత్యక్షమైపోతే పోలా.. మనకు పోయేదేముంది?? మహా అయితే 'ఓ చిటెకెడు మట్టీ..ఓ చెంబుడు నీరూ..' అనుకుంటూ.. మాంచి ఖరీదైన సూటులో..ఓ జంబో జెట్ ని వేసుకుని ముల్లోకాలనీ సుడిగాలిలా చుట్టేయటానికి బయల్దేరారంట..
ఒక్కసారిగా మన ధర్మ ప్రభువులు ప్రత్యక్షమయ్యే సరికి.. దశాబ్ధాలు గడుస్తున్నా..ఇంకా తప్పటడుగులేస్తున్న మహిళా బిల్లుకి రాజముద్ర లభించినంత ఆనందంగా.. అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా.. స్టేటస్ వద్దు..ప్యాకేజీయే ముద్దు..అని సరిపెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ' స్పెషల్ ప్యాకేజీ స్టేటస్' లభించినంతగా ఉబ్బితబ్బైపోయారు.. ఈ సంబరాలలో మునిగి..అసలు కోరికని కోరడం మరిచిపోయిన మన దేవతల భార్యల్ని...యెపుడూ.. యమా బిజీగా ఉండే మన మొండి దేవుడు..తమ బాధల్ని వెళ్ళగ్రక్కమని తొందరపెట్టసాగాడు..
అపుడు వాళ్ళంతా..ప్రతీయెటా ప్రేమికుల రోజునాడు..పార్కుల్లో, బీచుల్లో.. కనిపించే జంటలకి తాంబూలాలు ఇవ్వకుండానే తాళి కట్టించేస్తుండటంతో.. తమ భర్తలంతా.. దొరికినదెక్కి భూలోకానికి చెక్కేస్తున్న విషయాన్ని మొరపెట్టుకున్నారు.. అంతవరకూ దేవదేవుడిలా వెలిగిపోయిన మన మొండి దేవుడు వారు.. '..ఈసారైనా ఢిల్లీలో బోణీ కొట్టకపోతామా అని ఉవ్విళ్లూరితే.. కనీసం డిపాజిట్లు కూడా కాపాడుకోలేక.. ముఖం చాటేసిన కాంగ్రెస్ యువరాజు గారిలా మొఖంలా వేలాడిపోయింది..
ఈ ఊహించని పరిణామానికి...కరెంట్ షాక్ కొట్టిన కాకిలా..చిరాకుగా మొఖం పెడుతూ..అసలు ఈ తాలిబొట్టు స్కీము పెట్టిందే..తనలాంటి పెళ్లి (అయి)కాని బ్యాచ్ కోసం అని చెప్పడంతో..నోళ్ళెల్లబెట్టడం మన దేవీల వంతయింది..
P.S : ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా..క్షంతవ్యుణ్ణి..