అంతులేని వ్యధ-6
అంతులేని వ్యధ-6 || ఫణీంద్ర కుప్పిలి 'టక్ టక్ ' మని బూట్ల శబ్ధం వినపడటంతో ఒక్క ఉదుటున లేచి కూర్చున్నా..చుట్టూ కలియజూశా.. ఎపుడు నిద్రపోయానో గుర్తులేదు..అమ్మ నిద్రలో అటూ ఇటూ కదుల్తోంది..రూంలోకి వచ్చిన సిస్టర్స్..అమ్మకి సెలైన్ మార్చి వెళ్లిపోయారు.. లేచి మొబైల్ చూస్తే..ఇంకా తెల్లవారడానికి చాలా సమయముంది.. ' ఇంతకీ డాక్టరు గారు ఎందుకు జాయిన్ చేయమన్నారు? ఏదైన పెద్ద సమస్య ఉందా?? ఇంకా ఎన్నాళ్లు ఉండాలి?? డబ్బు ఎలాఎలా సర్దుబాటు చేసుకోవాలి?? ఇలా కందిరీగల్లా బుర్రలో తిరుగుతున్నాయి..కనీసం టీ అన్నా తాగుదామంటే..ఆ సమయం ఎక్కడా దొరికే అవకాశం లేదు..ఇక చేసేది లేక గదిలో మూలుగుతూ వెలుగుతోన్న ట్యూబ్ లైట్ ని చూస్తూ..అలాగే ఓ మూలగా కూలబడ్డా.. తెల్లవారిన తర్వాత మళ్ళీ షరా మామూలే.. ఎవరెవరో వస్తున్నారు..సిస్టర్సుని ఏవేవో అడుగుతున్నారు. కనీసం నాతో ఓ మాటకూడా మాట్లాడకుండానే హడావుడిగా వెళ్ళిపోతున్నారు..అలాగే సాయంత్రం వరకూ గడిచిపోయినా..మా డాక్టరు గారి జాడ మాత్రం కానరాలేదు..ఎన్ని సార్లు అడిగినా.. అరిగిపోయినా టేపు రికార్డులా ఒకటే సమాధానం..' సార్....