...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి
...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి
సాధారణంగా నేను ఎపుడూ మన ప్రగతి రథ చక్రాన్నే😳 నమ్ముకుంటాను..అదేనండీ మన ఎర్రబస్సుని🚌.. ఇపుడు బస్సు రంగుల్ని మార్చి.. మనకు రంగు పడేలా చేస్తున్నారు కదాండీ😠..ఆరోజు అనుకోకుండా ఒక తుఫాను🚐..( ఏ హుద్హుదో..తిత్లి యో అనుకునేరు..☺️) దూసుకుపోయె బండి.. మళ్లీ ఎక్కడకని.. అడక్కండేం🤣.. మా బుడ్డోడితో సహా ఎక్కాం.. అందులోనూ ముందు సీటు.. మావాడు హీరో రామ్ లాగా కాస్త అల్ట్రా హైపర్😷.. మావాడు ఆ రోజు కాస్తా నా మీద దయతలచి.. పడుకోడంతో.. ధైర్యం చేసి ముందు సీటులో ఎక్కే సాహసం చేశా..లేదంటే.. బండి గమ్యం స్ధానం చేరే లోపు.. ఏ గేర్ రాడ్డునో.. లేదా స్టీరింగ్ చక్రాన్నో తీసి జాగ్రత్తగా.. డ్రైవర్ చేతిలో పెట్టే రకం😂..
ఇక మా ఆవిడ.. ఏదన్నా వాహనం ఎక్కడం ఆలస్యం.. శివుని మెడలో పాములా.. మాంత్రికుని టోపిలాంటి👜(..అందులో దొరకని వస్తువు ఉండదు.. పిన్నీసు నుండి పిస్తా దాకా) హ్యాండ్ బ్యాగు నుండి.. ఇయర్ మిషన్లు(..అదే లెండి..ఇయర్ ఫోన్స్) తీసి తగిలించేస్తుంది.. ఇక అంతే.. మన లోకంతో సంబంధాలు కట్.. ఇయర్స్ బద్ధలయ్యేదాకా.. లేదా.. ఇయర్ ఫోన్స్ తెగేదాకా (..విచ్ ఎవర్ ఈజ్ ఆర్లియర్) వింటుంది.. దాంతో నేను చేసేది లేక.. కాసేపు రోడ్డుని చూస్తూ కూర్చున్నా.. సాధారణంగా ప్రయాణాల్లో మొబైల్ లో చాటింగులు అవీ చేయడం కంటే.. కోడికత్తి శ్రీను నుండి.. అమెరికా ఇవాంకా ట్రంప్ దాకా.. టాపిక్కు తో సంబంధం లేకుండా సాగిపోయే సంభాషణలు మౌనంగా వినడం అంటే చాలా ఇష్టం(..ఎందుకంటే ఇలాంటి రైటప్పులకి ముడి సరుకు దొరికేది అక్కడే🤓)..
దాంతో వెనకాల సీట్లో గట్టి గట్టిగా అరుసుకుంటున్న కేకలు (..ఎందుకంటే బండి సౌండ్ ని డామినేట్ చేసేశాయ్) వినబడటంతో వెనక్కి ఒక చెవి వేశా..కాసేపు ఆ గోలని..కేకల్ని శ్రద్ధగా(..మనకు ఇలాంటి పనికిమాలిన విషయాలంటే.. ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా తన్నుకొచ్చేస్తుంది😋) విన్నాక.. నాకు విషయం అర్ధం అయింది.. ఈసారి ఓ కన్నుని కూడా సరళ కోణం🕧 లో(..అదేనండీ వెనక్కి) తిప్పా.. మధ్య సీట్లో ఓ పాతికేళ్ల కుర్రాడు..బహుశా ఏ ఐదో పదో చదివి.. దేశం(..సాధారణంగా పల్లెటూరులో.. పక్క రాష్ట్రం ఎల్లినా.. దేశం ఎల్లాడు అని అనటం కామన్) వలసెల్లి పనిచేసుకుంటున్నాడు కాబోలు..చాలా గాట్టిగానే కౌంటర్లు వేస్తున్నాడు.. ఇంతకీ వాదన ఎవరితో చేస్తున్నాడా అని చూస్తే.. బండి వెనక సీటులో బాగా టకప్ పికప్👩⚖️ మీదున్న ఓ నడి వయస్సు ఆయన కనిపించాడు.. అతన్ని చూస్తే బాగా(?) సదుకున్నోడిలా ఉన్నాడు..
మా ఆవిడ వైపు చూసా.. ఇప్పట్లో ఈ లోకంలోకి వచ్చేలా కన్పించలేదు.. సరే విషయం ఏంటో తెలుసుకుందామని..ఈసారి రెండు చెవుల్ని విసిరా.. విషయం ఏంటంటే.. '..ఈ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో.. జనాల డబ్బుని.. కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడుతోందనేది.. ఆ టకప్ ఆయన వాదన.. అక్కడక్కడా ఓ నాలుగు ఇంగిలీషు పదాలు..ఏవేవో అంకెలు(..రైటో.. రాంగో.. ఎవడికి తెలుసు👻) దంచేస్తున్నాడు.. ఈ కుర్రోడు కూడా ఏమాత్రం తగ్గకుండా.. పల్లె యాసలో కౌంటర్ల మీద కౌంటర్లు ఏసేస్తున్నాడు.. 'ఇవన్నీ వేస్టు.. అని అంటున్నారు కదా సారూ.. అప్పుడికీ ఇప్పుడికి బోల్డు మారిపోనాది కదా.. నేను ఐదో క్లాసుకి వచ్చేవరకు ఒక సిన్న లాగుతోనే తిరిగోడిని.. ఇప్పుడలాగే తిరుగాతానంటే.. అవుతాదా?..' ఇలాంటి అభివృద్ధి పనులన్నీ సెయ్యబట్టే కదా. నాలాటోడికి కూలి దొరికి.. ఓ నాలుగు డబ్బులు దొరుకుతున్నాయి..' అని సెడామడా వాయించేశాడు.. సాధారణంగా పల్లెటూరోళ్ళకి మాంచి.. సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది.. దానికి తోడు ఓ నాలుగు నాటు పదాల్ని కలిపి దంచితే.. ఆ కిక్కే వేరప్పా😁.. మొత్తానికి ఆయాసం వచ్చిన దాకా అరుసుకున్నాక.. ఎవడి సెల్లులో📱 ఆడు దూరిపోయాడు..
దాంతో.. నా కాలక్షేపానికి బ్రేకు పడింది.. నేను మళ్ళీ యధావిధిగా.. రోడ్డుపై జరుగుతున్న హైవే పనుల్ని చూసుకుంటున్నా.. ఈలోగా మన కుర్రోడు పక్కన కూర్చున్న మరొకతను(..కాస్తా వయసు మళ్లినోడు..) బయట జరుగుతున్న పనుల్ని చూసి..'ఒరేయ్ ఏటిరా.. ఎక్కడ పడితే..ఏవేవో కట్టేస్తున్నారు.. ఏటి పనిసేస్తున్నారేటి? 'అని అడిగాడు.. బహుశా చాలా నెలల తర్వాత దేశం నుండి వస్తున్నట్లున్నాడు.. దానికి మనోడు..' ఒరే మావా.. ట్రాఫిక్కు బాగా ఎక్కువైపోయిందని.. ఆరు రోడ్లు పని సేస్తున్నార్రా..' అని చెప్పాడు..దానికి అతను..' ఏటిరా ఆరు రోడ్డులు ఏత్తన్నారా?' అని కొంచెం గట్టిగా అన్నాడు.. దానికి మనోడు..' ఒరేయ్ మావా.. గట్టిగా అనకురా బాబు..మళ్లీ ఆ టకప్ ఆయన ఇన్నాడంటే..' 'ఆరేసి రోడ్లు.. ఎనిమిదేసి రోడ్లు ఎందుకు? అని ఓ రెండు రోడ్లు తీసేయమని సెప్పినా సెప్తాడు🤣🤣..' అని అనడంతో.. నేను నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశా..నాతో పాటు అందరూ కూడా గట్టిగా నవ్వేశారు.. దాంతో ఆ టకప్ ఆయన.. మమ్మల్ని అందరినీ..ఏమీ తెలీన పల్లెటూరోళ్ళు అన్నట్లుగా.. మావైపు ఓ లుక్కేసి... బలవంతంగా మొబైలో 📱బుర్రెట్టాడు.. బండిలో ఇంత జరిగినా కూడా నాకేమాత్రం సంబంధం లేదన్నట్లు మా ఆవిడ చెవిలో బిండలతో(..ఇయర్ ఫోన్స్..) ఊగిపోవడం కొసమెరుపు😷..
31.10.2018