ఆరని చితి


ఆరని చితి | ఫణీంద్ర కుప్పిలి

భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీరం..
నేడు భూతాల దుర్గంగా మారిన వేళ..

దాయాది దేశం దమన నీతితో..
పెట్రేగిపోతున్న ఉగ్రమూకలు..
ఉగ్రవాద బిగి కౌగిలిలో చిక్కుకుని
ఉన్మాదులుగా మారుతున్న యువకులు
ఒకవైవు..

భరతమాత రక్షణకై కడుపులో చిచ్చుని రగుల్చుకుంటున్న మాతృమూర్తులు.
దేశ సౌభాగ్యం కోసం తమ సౌభాగ్యాన్ని
పణంగా పెదడుతున్న స్త్రీ మూర్తులు..
మరోవైపు..

దశాబ్దాలుగా సలపరం పెడుతున్న సమస్య
ములాల్ని చిత్తశుద్ధితో పరికించకని..

సంతాప సభలు..కొవ్వొత్తుల ర్యాలీలు..
భావోద్వేగ ప్రకటనలు..ప్రతీకార చర్యలు..

మరోమారు కవితా వస్తువులుగా మిగిలిపోతాయి..
అమంగళం ప్రతిహతమగు గాక..

16.02.2019


పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం