అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి
అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి
నిత్యం ఘోర కలి తాండవిస్తున్నా..
నీటి చుక్క కోసం నేల అర్రులు చాస్తున్నా..
అవినీతి పంకిలమైన వ్యవస్థని చూసి..
రాజకీయనాయకుల రాక్షస క్రీడల్ని చూసి..
చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాల
చేతకానితనాన్ని చూసి..
మైనంలా కరగాల్సిన మేఘుడి
గుండె బండబారిపోయింది..
భూసారాన్ని పెంచాల్సిన ఎరువులు
రైతుల సారాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే..
చీడపీడల్ని పారద్రోలాల్సిన పురుగుమందులు
రైతన్నల ఉసురు తీస్తుంటే..
చినుకు పడితే విత్తువేసి మరోమారు..
ఆశల వలలో పడి చిత్తు కాకూడదని..
ఉరుములు మెరుపులతో ఘర్జించాల్సిన
మేఘం మౌనవ్రతం దాల్చింది..
తరాలు మారినా..
రైతు తలరాత మారకపోవడం చూసి
అన్నదాత ఆకలితో అలమటించడం చూసి..
అనాధ శవంగా మారుతున్న వైనాన్ని చూసి..
తన పునరాగమనంతో..
నెర్రెలు వారిన పుడమితల్లిని పులకరింపజేయాల్సిన చినుకు..
అలిగి ఆకాశం వెనుక దాక్కుంది..
19 జనవరి, 2017
నిత్యం ఘోర కలి తాండవిస్తున్నా..
నీటి చుక్క కోసం నేల అర్రులు చాస్తున్నా..
అవినీతి పంకిలమైన వ్యవస్థని చూసి..
రాజకీయనాయకుల రాక్షస క్రీడల్ని చూసి..
చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాల
చేతకానితనాన్ని చూసి..
మైనంలా కరగాల్సిన మేఘుడి
గుండె బండబారిపోయింది..
భూసారాన్ని పెంచాల్సిన ఎరువులు
రైతుల సారాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే..
చీడపీడల్ని పారద్రోలాల్సిన పురుగుమందులు
రైతన్నల ఉసురు తీస్తుంటే..
చినుకు పడితే విత్తువేసి మరోమారు..
ఆశల వలలో పడి చిత్తు కాకూడదని..
ఉరుములు మెరుపులతో ఘర్జించాల్సిన
మేఘం మౌనవ్రతం దాల్చింది..
తరాలు మారినా..
రైతు తలరాత మారకపోవడం చూసి
అన్నదాత ఆకలితో అలమటించడం చూసి..
అనాధ శవంగా మారుతున్న వైనాన్ని చూసి..
తన పునరాగమనంతో..
నెర్రెలు వారిన పుడమితల్లిని పులకరింపజేయాల్సిన చినుకు..
అలిగి ఆకాశం వెనుక దాక్కుంది..
19 జనవరి, 2017