చీకటి తర్వాత వెలుగు వస్తుంది..

కానీ కొన్ని జీవితాలు చీకట్లోనే ముగుస్తాయి..


ఓటమి గెలుపుకు మొదటి మెట్టు..

కానీ ఎన్నో జీవితాలు గెలుపు మెట్టు ఎక్కకుండనే అంతమవుతాయి..


ఏదో సాధించాలన్న తపన అవసరమే 

కానీ సాధించాక మాత్రమే జీవిస్తామనుకుంటే..


కాల చక్రం ఏ ఒక్కరి కోసం ఆగిపోదు..

చివరికి అంతులేని నిరాశా నిస్పృహలతో

కాలగర్భంలో కలిసిపోక తప్పదు..


అంతమవ్వని జ్ఞానమార్గాన్ని వదిలి..

సంతృప్తి ఇవ్వని ఐహిక సుఖాల కోసం

వెంపర్లాడటం..

దోసిళ్ల లోని నీటిని జార విడిచి

ఎండమావుల వెంట పరుగులు తీయడమే..


సాగిపోవుటే జీవితం..

ఆగిపోవుటే మరణం..


ఫణీంద్ర కుప్పిలి 

18.12.2022




పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం