వరమై రావాల్సిన వాన… శాపమై | ఫణీంద్ర కుప్పిలి

 

వరమై రావాల్సిన వాన… శాపమై | ఫణీంద్ర కుప్పిలి

కరుణించని వరుణ దేవుడు

అడక్కుండానే విరుచుకుపడి

కళ్ల ముందే కలలను కొట్టుకుపోతుంటే

నిస్సహాయంగా నిలబెట్టే ప్రళయం ఇది..


నిన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన నేల,

నేడు కన్నీటి సంద్రం..

చెమట చుక్కలతో పంట పండించిన రైతు గుండె,

నేడు ఊపిరాడని వరద..

మేఘాల రాక కోసం పరితపించిన మనసులు,

నేడు ఆ గర్జనకే వణికిపోతున్నాయి..

28.10.2026




పాప్యులర్ పోస్టు

మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి