కష్టాలు అనేవి వాషింగ్ మెషిన్ లాంటివి.. అవి మనల్ని తిప్పుతాయి, మెలి పెడతాయి..బాధిస్తాయి.. కానీ చివరికి మనల్ని మునుపటి కంటే మరింత మెరుగ్గా, ప్రకాశవంతంగా మారుస్తాయి.. - ఫణీంద్ర కుప్పిలి
Posts
ఆజాదీ కీ అమృత మహోత్సవ వేళ | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
ఆజాదీ కీ అమృత మహోత్సవ వేళ | ఫణీంద్ర కుప్పిలి జాబిలిపై మువ్వన్నెల జెండా రెపరెప లాడే లోగానే మణిపూర్ పాశవిక దమనకాండ .. మన వేద భూమి విలువల వలువలు ఊడదీసి ట్విట్టర్ పిట్ట సాక్షిగా బట్టబయలు చేసింది .. ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పదవి అలంకరించిందని మనం జబ్బలు చరచు కునేలోగా .. మరో గిరిజన మహిళ నగ్న ఊరేగింపు సభ్య సమాజంలో మనల్ని నవ్వులపాలు చేసింది .. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ వేళ .. మణిపూర్ లో జరిగిన భారత మాత నగ్న ఊరేగింపు .. దేశం పై జరిగిన దాడినా ? దేహం పై జరిగిన దాడినా ? మణిపూర్ నడి వీధుల్లో నగ్నంగా నడిచింది దేహం ...
మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల
- Get link
- X
- Other Apps
మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల | ఫణీంద్ర కుప్పిలి మొన్న మా తమ్ముడు హరీష్ పెళ్ళిలో మా ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం కలిసింది .. మేము మాంచి ఎండలో వెళ్ళటం వలన కల్యాణ మండపం లోకి ఎంటరవ్వగానే కాస్తా చల్ల గాలి తగలటం లో ప్రాణం లేచి వచ్చినట్లయింది .. ఆ స్వింగ్ లో ఎవరిని పలకరించానో కూడా తెలియలేదు .. పైన ఫుడ్ కౌంటర్ కి వెళ్లి ఓ నాలుగు మెతుకులు కుక్కేసి మళ్ళీ కల్యాణ మండపం దగ్గరికి చేరుకున్న .. కాస్త ఆత్మరావుడు శాంతించడం తో మా వాళ్లతో మాటా మంతీ కలిపా .. ఎవరి గోల వాళ్ళదిలా నచ్చినోళ్ళు నచ్చినోళ్లతో మాట్లాడుకుంటుంటే ...