నిశ్శబ్ద విలాపం | ఫణీంద్ర కుప్పిలి

నిశ్శబ్ద విలాపం | ఫణీంద్ర కుప్పిలి 

కొన్నిసార్లు ఆవేశం ఆలోచనను మింగేస్తుంది..

భావోద్వేగాల తుఫాను వివేకపు దీపాన్ని ఆర్పేస్తుంది..

తాత్కాలికమైన ద్వేషాలు 

మనసుకు దగ్గరైన వారినే దూరం చేస్తాయి..


ఆవేశం చల్లారిన తర్వాత మిగిలేది

నిశ్శబ్దంగా మండే నేరభారం..


నోరు జారిన ఒక మాట..

చిరిగిపోయిన ఒక బంధం..

కన్నీటి చుక్కలతో తుడిచినా చెరగని జ్ఞాపకం..


అహంకారం కళ్లకు ముసుగు కడితే

ఆత్మీయుల ఆర్తి కనిపించదు..

గెలిచామనుకునేలోపే

మన హృదయమే ఓడిపోతుంది..


కాలం గడిచాక తెలుసుకుంటాం

కోల్పోయిన కాలం తిరిగి రాదు,

దూరమైన హృదయం మళ్లీ చేరదు..


మిగిలేది ఒక్కటే…

మనసును దహించే నిశ్శబ్ద విలాపం..

13.03.2026

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి