నిశ్శబ్ద విలయం | ఫణీంద్ర కుప్పిలి

నిశ్శబ్ద విలయం | ఫణీంద్ర కుప్పిలి 

​ఎటు చూసినా వికల రూపాలే..

అస్తిత్వపు అంచున తెగిపడి ఉన్న

మేధో తంతువుల శకలాలు..


హృదయం ఒక నిర్జన మరుభూమిగా పరివర్థితమై

తనలో తాను నిశ్శబ్దంగా దహించుకుపోతోంది..


​కాలం పేర్చిన నిశ్చితాభిప్రాయాలన్నీ

నిర్దయగా విసిరిన యధార్థపు రాళ్ళ దెబ్బకు

తునాతునకలై రాలిపోతున్నాయి..


అంతరంగపు పునాదులపై నిర్మించుకున్న 'ఇజాల' సౌధాలు

సత్యపు సుడిగాలిలో పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి..


​ఇక్కడ న్యాయమనేది సార్వత్రికం కాదు..

అది శక్తిమంతుని కరచాలనానికి లొంగిపోయే బానిస..


ధర్మం అనేది ఒక రక్షణ కవచం కాదు..

అది కేవలం బలవంతుని అడుగుజాడల్లో

నడిచి వెళ్ళే నీడ మాత్రమే..


30.03.2026


పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి