Posts

అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి

అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి నిత్యం ఘోర కలి తాండవిస్తున్నా.. నీటి చుక్క కోసం నేల అర్రులు చాస్తున్నా.. అవినీతి పంకిలమైన వ్యవస్థని చూసి.. రాజకీయనాయకుల రాక్షస క్రీడల్ని చూసి.. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాల చేతకానితనాన్ని చూసి.. మైనంలా కరగాల్సిన మేఘుడి గుండె బండబారిపోయింది.. భూసారాన్ని పెంచాల్సిన ఎరువులు రైతుల సారాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే.. చీడపీడల్ని పారద్రోలాల్సిన పురుగుమందులు రైతన్నల ఉసురు తీస్తుంటే.. చినుకు పడితే విత్తువేసి మరోమారు.. ఆశల వలలో పడి చిత్తు కాకూడదని.. ఉరుములు మెరుపులతో ఘర్జించాల్సిన మేఘం మౌనవ్రతం దాల్చింది.. తరాలు మారినా.. రైతు తలరాత మారకపోవడం చూసి అన్నదాత ఆకలితో అలమటించడం చూసి.. అనాధ శవంగా మారుతున్న వైనాన్ని చూసి.. తన  పునరాగమనంతో.. నెర్రెలు వారిన పుడమితల్లిని పులకరింపజేయాల్సిన చినుకు.. అలిగి ఆకాశం వెనుక దాక్కుంది.. 19 జనవరి, 2017

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి గతంలో నేను టీచర్ గా పనిచేస్తున్న రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలొచ్చాయి.. ఈ ఎన్నికల డ్యూటీలు అనేవి కొందరికి మహా సరదా అయితే నాలాంటి మరికొందరికి కొంచెం బాధతో కూడుకున్నవి.. దానికి కారణం సాధారణంగా అప్పట్లో ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదు..దాంతో పాటు పట్టణాలలో అయితే భోజనానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ అదే పల్లెటూళ్లో అయితే చాలా ఇబ్బంది.. ఇంకా మన సహచరుల సహాయంలేకపోతే పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టే.. మనకు గతంలో ఇలాంటి స్వీ(హా)టు మెమోరీస్ చాలానే ఉన్నాయి😥 ఇక ఎన్నికల రోజు రానే వచ్చింది.. ఉదయాన్నే బయలుదేరి ఎన్నికల సామగ్రి అందించే ఆఫీసు వద్దకు చేరుకున్నాను..నేను కుంచెం సీనియర్ ని అయినందువల్ల.. నాకు ప్రిసైడింగ్ 'అధికారి' ( పేరు పెద్ద..ఊరు దిబ్బ లాగా..ఈ పదవులన్నీ తేడాలు రానంతవరకే 🤣)గా వేశారు.. భగవంతుడా..ఈసారైనా నాకు మంచోళ్ళు దొరికేలా చూడు స్వామి  అని అనుకుంటుండగా..'...ఒరేయ్ మామా.. ఇంతసేపు ఎక్కడున్నావ్ రా..' అనే (గావు)కేక విన్పించింది.. బాగా విన్న గొంతులా ఉందే అని వెనక్కి త...

మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి

మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్నాం.. డ్రోన్లతో సరకుల్ని చేరవేస్తున్నాం.. హృదయాంతరాళాల్ని శోధిస్తున్నాం.. డిజైనర్ బేబీల్నీ సృష్టిస్తున్నాం.. కానీ నేటికీ.. కుళ్ళిన కంపు కొట్టే చెత్తనీ.. ముట్టుకోవటానికే భయపడే వ్యర్ధాల్నీ.. తలచుకోడానికి కూడా అసహ్యించుకునే మానవ మాల మూత్రాల్నీ... మనలాగే.. రక్తమాంసాలతో.. కోటి ఆశలతో.. భావోద్వేగాలతో.. ఓ తల్లి కడుపున పుట్టిన.. మనతోటి సోదరులు.. తమ మాన ప్రాణాల్ని.. తమ భవిష్యత్తుని పణంగా పెట్టి.. మనకు గౌరవ మర్యాదల్ని.. ఆరోగ్యకరమైన జీవితాన్ని.. మన జీవితాల్లో వెలుగుల్ని నింపుతూ.. వాళ్ళు మాత్రం నాలుగు మెతుకులు కోసం.. చీకటి కూపాల్లో చిక్కుకుంటున్నారు..                 *      *      * సిరియాలో కుర్దుల హక్కుల కోసం పోరాడతాం.. రోహింగ్యాల అణచివేతపై ఉద్యమిస్తాం.. తీవ్రవాదుల మరణాలపై సంతాపం తెలియజేస్తాం.. చివరికి రేపిస్టుల హక్కుల కోసం గళమెత్తుతామ్.. కానీ.. చట్టాలు చట్టు బండలై.. చేసిన బాసలు నీటిపై రాతలై.. మన అభివృద్ధిని.. మన నాగరికతను.. ప్...
సకల సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణం.. విలువలు లోపించిన విద్యా వ్యవస్థ.. విలువలు నేర్పని కుటుంబ వ్యవస్థ.. సమస్య ములాల్ని స్పృశించకుండా.. కథలు..కవితలు.. కొవ్వొత్తుల ర్యాలీలకే పరిమితమైతే.. మరో 'రిప్' మెసేజ్ తో గోడల్ని పులమడానికి.. బాధాతప్త హృదయాలలో సిద్ధపడాల్సిందే..
మనసు లేని మనిషి , జీవన్మృతుడే..

చిన్నారుల దినోత్సవం | ఫణీంద్ర కుప్పిలి

చిన్నారుల దినోత్సవం |ఫణీంద్ర కుప్పిలి ఎత్తైన విగ్రహాలు.. ఘనమైన దినోత్సవాలు. జాతి భవిష్యత్తును తీర్చిదిద్దజాలవు.. ఏ రోజైతే పిడికెడు మెతుకులు కోసం.. నాలుగు అక్షరం ముక్కల కోసం.. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే చేతుల కోసం.. పెద్దరికం మాటున చిట్టి దేహాల్ని కబళించని ప్రేమకోసం.. ఆబగా ఈదేశ రేపటి పౌరులు.. అర్రులు చాచని రోజు.. అసలైన చిన్నారుల దినోత్సవం జరుపుకుందాం.. 14.11.2018

రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి

రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి ఆకలిగొన్న తోడేళ్ళ  వేటలో ఖండ ఖండాలుగా చీల్చబడిన శరీరాల మాంసపు ముద్దల్ని గోతాల్లో కుక్కి ఈడ్చుకెల్తుంటే బొట్లు బొట్లుగా కారిన రక్తపు చుక్కలు ఏరులై పారి తుంగభద్ర కాలువలో కలుస్తుంటే.. ఆ ప్రదేశమంతా.. పాప ప్రక్షాళనకై తన రక్తాన్ని చిందించిన క్రీస్తు శిలువని తలపిస్తోంది.. కారంచేడు కత్తి గాట్లు ఇంకా పచ్చి పచ్చిగా సలపరమెడుతుంటే ఇంతలోనే రక్తసిక్తమైన.. రక్తక్షేత్రం.. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన దళితోద్యమ జ్వాల అనతికాలంలోనే.. నిట్టనిలువునా చీలిపోయింది... పాతికేళ్ళుగా ఆరని... చుండూరు చితిమంటలు.. మన ప్రజాస్వామ్యాన్ని నిరంతరం మసిబారుస్తున్నాయి..   07.08.2016