Posts

వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి

 వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి సినిమాలు లేవు.. షికార్లు లేవు.. కానుకలు లేవు.. కౌగిలింతలు లేవు.. కతలు లేవు.. కవిత్వాలు లేవు.. ఇద్దరి కళ్ళు మౌనంగా సంభాషించుకుంటున్నాయి.. రెండు మనసులు ఆత్రంగా పెనవేసుకున్నాయి.. సరదాలు..సరాగాలు.. విందులు..వినోదాలు.. ఉన్నా..లేకపోయినా.. కష్టాలు.. కన్నీళ్లు.. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా.. జీవిత చరమాంకం వరకు.. అంతులేని ప్రేమ అనునిత్యం గుభాళించాలని.. త్రికరణ శుద్దిగా ఆకాంక్షిస్తూ.. హ్యాపీ వ్యాలంటైన్స్  డే 'మహా..'

నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..

నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్.. | ఫణీంద్ర కుప్పిలి "మనకంటే రాజకీయ నాయకులే బెటరేమో🤣 అలవికాని హామీలను ఐదేళ్లకొక్కసారి గుప్పిస్తే. మనమేమో ప్రతీ సంవత్సరం అమలు చేయని రిజల్యూషన్స్ తో సంబరపడుతుంటాం"🤣🤣 సో..నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..  అని కొంచెం గట్టిగానే నిర్ణయించుకున్నా..  కానీ 'ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు..' మావాడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టిన గోళ్ళు  కొరుకుడు కార్యక్రమం.. నా పీకమీదకొచ్చింది😀..                          అదేంటో గానీ.. ఎన్నింటినో మార్చుకోగలిగిన నేను.. చినప్పటి నుండి.. ఎంతో శ్రద్ధగా సాధన చేసిన.. ఈ గోళ్ళు కొరుకుడు మహా వ్రతాన్ని.. నేను ఎంత వదిలించుకుందామన్న.. అది మాత్రం ఎంతో విశ్వాసంగా నన్నే అంటిపెట్టుకుని ఉంది😀..  ఏదో అవసరార్ధం.. మధ్య మధ్యలో చాలాసార్లు.. మానేసిన.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే ముగిసిపోయేది😀😀.. చివరికి కొరికి..కొరికి.. వేళ్ళు సైతం సగం అయిపోయాయి😁.. మనకు మందు..బీడీ..చుట్ట..సిగరెట్లు లాంటివి మంచి అలవాట్లు లేకపోయినప్పటికీ.. ఇది మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.. 'ఏ ...
కరోనా కొమ్ముల్ని వంచామని సంబరపడేలోగా.. మరో రూపంలో కోరలు చాస్తోంది ఈ మాయల మరాఠీ.. ఇక ఈసారి చప్పట్లతో పనయ్యేలా లేదు తప్పెట గుళ్ళు ఆడాల్సిందే..

తరాలు మారినా - తలరాతలు మారెనా?

తరాలు మారినా - తలరాతలు మారెనా? |ఫణీంద్ర కుప్పిలి తరాలు మారినా.. ఏపిపియస్సీ తీరు మారెనా?? అభ్యర్థుల తల రాతలు మారెనా?? ఒక సమున్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ఆ లక్ష్య సాధన కోసం అనుక్షణం పరితపిస్తూ కన్నవారిని కట్టుకున్న భార్యని చివరికి కన్న బిడ్డల్ని సైతం.. వారి సుఖ సంతోషాల్ని దూరం చేసినా మౌనంగా భరించారు, సహించారు ఎందుకంటే నేనేదో గొప్ప ఆఫీసర్నయి అందర్నీ ఉద్ధరిస్తానని... కోటి ఆశలతో లక్ష్యాన్నే శ్వాస గా రేయింబవల్ని ఏకం చేస్తూ పంచవర్ష ప్రణాళిక లా అడుగడుగునా అవాంతరాలను అనేకానేక వాయిదాల్ని దాటి చివరి అంకాన్ని పూర్తి చేస్కుని వెన్నెల కోసం ఎదురు చూసే చకోరం లా ఫలితాల కోసం ఎదురు చూసిన మాకు చివరికి నిరాశే మిగిలింది.. ఎవరో చేసిన పాపాపాలకు నిర్దాక్షిణ్యం గా బలిచేస్తూ మమ్మల్ని అథపాతాళం లోకి నెట్టేశారు నిర్దయగా.. లెక్కలేన్ని తప్పులు చేసినోళ్లు దర్జా వెలగబెడుతూంటే ఏ తప్పు లేని వారు బలి పశువులవుతున్నారు.. విలువైన ధనాన్ని, కాలాన్ని అన్నిటికీ మించి ఆత్మ గౌరవాన్ని కోల్పోయి జీవచ్చవాల్లా తిరుగుతున్నా పలుకరించే నాధుడే లేడు.. ఇది కేవలం మా వ్యధ మాత్రమే కాదు ఉద్యోగాల కోస...

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి తినటానికి నలుగురుండి.. ముగ్గురికి మాత్రమే సరిపోయేంత ఉన్నపుడు.. నాకు ఆకలిగా లేదని.. మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటుంది.. మనం లొట్టలేసుకుంటూ  తింటుంటే.. తన కడుపు నిండినట్లు సంతోష పడుతుంది.. మనందరం సెలవుల్ని ఆస్వాదిస్తుంటే.. తను మాత్రం ఓవర్ టైం చేస్తుంది.. తనకు సుస్తీ చేసిన పూట కూడా మనం ఎక్కడ పస్తులుంటామోనని.. తనకేమీ కాలేదని లేని శక్తిని కూడదీసుకుంటుంది.. గడియారంలో ముల్లులా నిరంతరం సమయంతో పోటీపడి పరుగుపెడుతుంది.. అయినా తన చేస్తున్న పనికి గుర్తింపులేదు.. ఆ మాటకొస్తే ఆశించదు కూడా.. మనకంటే తక్కువ చదువుకోవచ్చు.. మనకున్నంత లోకజ్ఞానం లేకపోవచ్చు.. మనకు తెలిసిన ఎన్నో విషయాలు తనకు తెలియకపోవచ్చు.. కానీ తనకు తెలిసిందల్లా ఒక్కటే.. మనం ద్వేషించినా కూడా.. తిరిగి అంతులేని ప్రేమని పంచడమే.. ఇపుడు కొత్తగా వైఫై లు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లు వచ్చాయి గానీ.. జీవి ఊపిరి పోసుకున్న నాటి నుండి. అమ్మ మనతో నిరంతరం కనెక్ట్ అయ్యే ఉంది.. మన చుట్టూ తన మమకారాన్ని.. అనుక్షణం వైఫై లా ప్రసరిస్తూనే ఉంది.. తన ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు త...

జీవిత పరమార్థం

జీవిత పరమార్థం | ఫణీంద్ర కుప్పిలి గతం చేసిన గాయాలకు.. పరిణితి అనే మలాము పూసి భౌతికవాద విజయాల మాటున అను నిత్యం కృత్రిమత్వాన్ని చిందిస్తూ.. నలుగురిలో.. గుండె లోతుల్లోని బాధల్ని మునిపంటితో బిగువబట్టి.. లేని చిరునవ్వుని ముఖాన్ని పులుముకుని.. ఏడ్వలేక నవ్వుతూ..నవ్విస్తూ.. ఏకాంతంలో.. గుండెలు అవిసేలా రోధిస్తూ.. మరింతగా కుచించుకుపోతూ.. ఆలోచనల్లో అంతర్ముఖంగా.. జీవిత పరమార్థాన్ని దర్శిస్తూ.. జీవన యానంలో భిన్న పార్శ్వాల మధ్య.. సమతా స్థితిని సాధించడం కోసం అనునిత్యం చేసే పోరాటం లోనే మానవ మనుగడ నిలిచి ఉంది.. 24, డిసెంబరు 2016

2050 లో... | ఫణీంద్ర కుప్పిలి

2050 లో... | ఫణీంద్ర కుప్పిలి.                నేను హడావుడిగా నా పాత టూవీలర్ ని తీయబోతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి పలకరించాడు. నేనసలే మతిమరుపు మనిషిని అవ్వడం వలన కొంత మొహమాటంగానే ఒక ప్లాస్టిక్ నవ్వు విసిరి పలకరించా గానీ లోలోపల ఎవరా అన తెగ గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా..               నా మతిమరుపు గురించి బాగా తెలిసిన మనిషి అవ్వడం వలన నా ఇబ్బంది ని గమనించి తనే మా మధ్య గల మిత్రత్వాన్ని గుర్తుచేశాడు..అప్పటికి నేను తేరుకుని  పూర్తిగా ఈలోకం లోకి వచ్చాను. సుమారు పాతిక ముప్పై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ లోని ఇషయాలన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ల ముందు కనపడసాగాయి.              మేము ఆ రోజుల్లో గ్రూప్స్ కోసం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్లం. అలాగే 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూ వరకూ వెళ్ళి కోర్ట్ గొడవల వలన రిజల్ట్స్ లేక తిరిగి పరీక్షలు లేక ఏళ్లు పూళ్లు గడిచిపోయాయి. ఇపుడు మళ్లీ ఒక మూడు దశాబ్ధాల తర్వాత మా మిత్రుడు కలవడం తో మేము వాట్సాప్ లూ, ఫేసు బుక్కులూ కొత్తగా వచ్చిన ఆ రోజుల్లో...