Posts

యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి

  యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి అర్ధరాత్రి వేళ.. హాయిగా అమ్మ ఒడిలో  నిద్రిస్తున్న చిన్నారి తల హఠాత్తుగా తెగి పడి మొండెం మిగిలింది.. తన భవిష్యత్తు కోసం కలలు కంటూ పడుకున్న ఒక యువకుని రేపటి కల చెదిరింది.. మరో చిన్నారి తన కళ్ళముందే కన్న వాళ్ళని కోల్పోయి దిక్కులేనిదయింది.. తన అవశాన దశలో అక్కరకొస్తాడనుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండటం చూసి.. ఓ తల్లి మౌనంగా కుమిలిపోతోంది.. ఎటు చూసినా శవాల గుట్టలు.. తెగిపడిన శరీర అవయవాలు.. కూలిన భవనాలు.. వెక్కిరిస్తున్న మొండి గోడలు.. చెవులు చిల్లులు పడేలా మోగుతున్న ఫిరంగి గుళ్ళు.. బాంబుల వర్షం కురిపిస్తున్న శత్రు దేశ లోహ విహంగాలు. పరాయి దేశ రాబందులు రెక్కల చప్పుళ్ళు.. ఎటు చూసినా భీభత్సం.. ఎటు చూసినా భయానకం.. ఎటు చూసినా అంతులేని మారణ హోమం.. యుద్ధోన్మాదుల వికృత వికట్టహాసం.. పొరుగు దేశ దాష్టీకాలు.. అగ్ర నాయకుల అభిజాత్యాలు.. చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచ దేశాలు.. అమాయక ప్రజల రేపటి ఆశల పీక నులిమేస్తూ నూతన సహస్రాబ్దిలో మరో రక్త పద చిత్రం.. యుద్ధంలో విజేతలుండరు.. మానవత్వాన్ని మంటగలిపిన చరిత్ర హీనులు మాత్రమే ఉంటారు.. మరోమారు రక...

క 'రోనా' | ఫణీంద్ర కుప్పిలి

  క 'రోనా'  | ఫణీంద్ర కుప్పిలి కులం లేదు.. మతం లేదు.. భాషా ప్రాంతీయ భేదం లేదు.. కొంచెం ఏమరుపాటుగా ఉంటే చాలు.. నిర్దయగా ప్రతీ ఒక్కరినీ కబళిస్తోంది.. నిన్నటి వరకూ నాకేమి కాదంటూ.. కాలరెగరేసుకుని నిర్లక్ష్యంగా తిరిగినోళ్లు.. మాస్కుతో పోయేదాన్ని.. మరణశయ్య వరకు వెంట తెచ్చుకుని.. అయిన వారందరినీ శోకసంద్రంలో ముంచి.. హఠాత్తుగా మాయమయిపోతున్నారు.. పబ్బులూ.. క్లబ్బులూ.. పండగలూ..పబ్బాలూ.. విందులూ.. వినోదాలూ.. కరోనా రక్కసిని ఎర్రతివాచితో ఆహ్వానం పలుకుతుంటే.. నాలుగు కాలాలు పాటు నవ్వుతూ బతకాల్సిన వాళ్ళు.. నాలుగు రోజుల్లోనే అర్థాంతరంగా కాలం చేస్తున్నారు.. 10.05.2021

వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి

 వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి సినిమాలు లేవు.. షికార్లు లేవు.. కానుకలు లేవు.. కౌగిలింతలు లేవు.. కతలు లేవు.. కవిత్వాలు లేవు.. ఇద్దరి కళ్ళు మౌనంగా సంభాషించుకుంటున్నాయి.. రెండు మనసులు ఆత్రంగా పెనవేసుకున్నాయి.. సరదాలు..సరాగాలు.. విందులు..వినోదాలు.. ఉన్నా..లేకపోయినా.. కష్టాలు.. కన్నీళ్లు.. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా.. జీవిత చరమాంకం వరకు.. అంతులేని ప్రేమ అనునిత్యం గుభాళించాలని.. త్రికరణ శుద్దిగా ఆకాంక్షిస్తూ.. హ్యాపీ వ్యాలంటైన్స్  డే 'మహా..'

నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..

నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్.. | ఫణీంద్ర కుప్పిలి "మనకంటే రాజకీయ నాయకులే బెటరేమో🤣 అలవికాని హామీలను ఐదేళ్లకొక్కసారి గుప్పిస్తే. మనమేమో ప్రతీ సంవత్సరం అమలు చేయని రిజల్యూషన్స్ తో సంబరపడుతుంటాం"🤣🤣 సో..నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..  అని కొంచెం గట్టిగానే నిర్ణయించుకున్నా..  కానీ 'ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు..' మావాడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టిన గోళ్ళు  కొరుకుడు కార్యక్రమం.. నా పీకమీదకొచ్చింది😀..                          అదేంటో గానీ.. ఎన్నింటినో మార్చుకోగలిగిన నేను.. చినప్పటి నుండి.. ఎంతో శ్రద్ధగా సాధన చేసిన.. ఈ గోళ్ళు కొరుకుడు మహా వ్రతాన్ని.. నేను ఎంత వదిలించుకుందామన్న.. అది మాత్రం ఎంతో విశ్వాసంగా నన్నే అంటిపెట్టుకుని ఉంది😀..  ఏదో అవసరార్ధం.. మధ్య మధ్యలో చాలాసార్లు.. మానేసిన.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే ముగిసిపోయేది😀😀.. చివరికి కొరికి..కొరికి.. వేళ్ళు సైతం సగం అయిపోయాయి😁.. మనకు మందు..బీడీ..చుట్ట..సిగరెట్లు లాంటివి మంచి అలవాట్లు లేకపోయినప్పటికీ.. ఇది మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.. 'ఏ ...
కరోనా కొమ్ముల్ని వంచామని సంబరపడేలోగా.. మరో రూపంలో కోరలు చాస్తోంది ఈ మాయల మరాఠీ.. ఇక ఈసారి చప్పట్లతో పనయ్యేలా లేదు తప్పెట గుళ్ళు ఆడాల్సిందే..

తరాలు మారినా - తలరాతలు మారెనా?

తరాలు మారినా - తలరాతలు మారెనా? |ఫణీంద్ర కుప్పిలి తరాలు మారినా.. ఏపిపియస్సీ తీరు మారెనా?? అభ్యర్థుల తల రాతలు మారెనా?? ఒక సమున్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ఆ లక్ష్య సాధన కోసం అనుక్షణం పరితపిస్తూ కన్నవారిని కట్టుకున్న భార్యని చివరికి కన్న బిడ్డల్ని సైతం.. వారి సుఖ సంతోషాల్ని దూరం చేసినా మౌనంగా భరించారు, సహించారు ఎందుకంటే నేనేదో గొప్ప ఆఫీసర్నయి అందర్నీ ఉద్ధరిస్తానని... కోటి ఆశలతో లక్ష్యాన్నే శ్వాస గా రేయింబవల్ని ఏకం చేస్తూ పంచవర్ష ప్రణాళిక లా అడుగడుగునా అవాంతరాలను అనేకానేక వాయిదాల్ని దాటి చివరి అంకాన్ని పూర్తి చేస్కుని వెన్నెల కోసం ఎదురు చూసే చకోరం లా ఫలితాల కోసం ఎదురు చూసిన మాకు చివరికి నిరాశే మిగిలింది.. ఎవరో చేసిన పాపాపాలకు నిర్దాక్షిణ్యం గా బలిచేస్తూ మమ్మల్ని అథపాతాళం లోకి నెట్టేశారు నిర్దయగా.. లెక్కలేన్ని తప్పులు చేసినోళ్లు దర్జా వెలగబెడుతూంటే ఏ తప్పు లేని వారు బలి పశువులవుతున్నారు.. విలువైన ధనాన్ని, కాలాన్ని అన్నిటికీ మించి ఆత్మ గౌరవాన్ని కోల్పోయి జీవచ్చవాల్లా తిరుగుతున్నా పలుకరించే నాధుడే లేడు.. ఇది కేవలం మా వ్యధ మాత్రమే కాదు ఉద్యోగాల కోస...

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి తినటానికి నలుగురుండి.. ముగ్గురికి మాత్రమే సరిపోయేంత ఉన్నపుడు.. నాకు ఆకలిగా లేదని.. మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటుంది.. మనం లొట్టలేసుకుంటూ  తింటుంటే.. తన కడుపు నిండినట్లు సంతోష పడుతుంది.. మనందరం సెలవుల్ని ఆస్వాదిస్తుంటే.. తను మాత్రం ఓవర్ టైం చేస్తుంది.. తనకు సుస్తీ చేసిన పూట కూడా మనం ఎక్కడ పస్తులుంటామోనని.. తనకేమీ కాలేదని లేని శక్తిని కూడదీసుకుంటుంది.. గడియారంలో ముల్లులా నిరంతరం సమయంతో పోటీపడి పరుగుపెడుతుంది.. అయినా తన చేస్తున్న పనికి గుర్తింపులేదు.. ఆ మాటకొస్తే ఆశించదు కూడా.. మనకంటే తక్కువ చదువుకోవచ్చు.. మనకున్నంత లోకజ్ఞానం లేకపోవచ్చు.. మనకు తెలిసిన ఎన్నో విషయాలు తనకు తెలియకపోవచ్చు.. కానీ తనకు తెలిసిందల్లా ఒక్కటే.. మనం ద్వేషించినా కూడా.. తిరిగి అంతులేని ప్రేమని పంచడమే.. ఇపుడు కొత్తగా వైఫై లు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లు వచ్చాయి గానీ.. జీవి ఊపిరి పోసుకున్న నాటి నుండి. అమ్మ మనతో నిరంతరం కనెక్ట్ అయ్యే ఉంది.. మన చుట్టూ తన మమకారాన్ని.. అనుక్షణం వైఫై లా ప్రసరిస్తూనే ఉంది.. తన ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు త...