Posts

...బతుకు బండి

                          ...బతుకు బండి | ఫణీంద్ర కుప్పిలి                        అది మంచి వేసవి మధ్యాహ్నం.. సూర్యుడు ప్రకోపానికి పిట్ట కూడా లేని రోడ్డు.. నల్లటి తాచుపాములా మెరుస్తోంది..అభివృద్ధి దెబ్బకు.. మహా వృక్షాలన్నీ నేలకొరిగాయి.. వాటి స్థానంలో కోట్లు ఖర్చు పెట్టి నాటిన క్రోటన్స్.. గుక్కెడు నీళ్ళకి నోచుకోక.. తడారిపోయి..బిక్క మొహం వేసాయి.. అలాంటి ఎడారిని తలపిస్తున్న రోడ్డు పై ఒక పాత టాటా మ్యాజిక్..కబేలాకి తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులా.. మెల్లగా సాగుతోంది.. ఆ బండిలో వెనకాల ఒక కుటుంబం కూర్చుంది..బహుశా ఎక్కడికో వలస వెళ్తున్నట్లుగా ఉన్నారు.. దేశంలోని పేదరికమంతా ఆ కుటుంబంలోని ఆడమనిషిలో కనిపిస్తోంది.. ఆమె ఒంటిపై కాణీ ఎత్తు బంగారం కాదు కదా..కనీసం గురివింద గింజంత  వెండి కూడా లేదు.. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి.. ఆ ఎండ వేడిని తట్టుకోలేక నెత్తిన కొంగు వేసుకుని..ఓ మూలగా కూర్చ...

ఫీల్డ్ ట్రిప్..

ఫీల్డ్ ట్రిప్..| ఫణీంద్ర కుప్పిలి                     రేపు పొద్దున్నే షార్ప్ గా🙄ఎనిమిదింటికి ఫీల్డ్ ట్రిప్ కి బయలుదేరాలని.. మా హైకమాండ్ ఆదేశించడంతో.. మేమంతా యాజ్ యూజువల్ గానే.. యకాయకిన తొమ్మిదిన్నరకు రెఢీ😂😀అయిపోయాం.. సమరసింహారెడ్డి సినిమాలోని టాటా సుమోల కాన్వాయ్ లా.. అదెక్కడ దొరికాయో గానీ.. బిచాణా ఎత్తేసిన చావర్లే కంపెనీ.. ట్రవేరాల కాన్వాయ్ లో పోలోమని బయలుదేరాం.. బళ్లు బయటకి చూడాటానికి బానే ఉన్నాయి గానీ.. ఒక్క డోర్స్ మాత్రం.. కాస్తా గాఠ్ఠిగా లాగితే.. ఊడొచ్చి డోర్ తో సహా క్రిందపడేలా ఉన్నాయి అంతే😀.. ఇక ఎప్పటిలానే.. మా గ్యాంగ్ లీడర్😂 ఆఙ్ఞ మేరకు.. మా బ్యాచ్ అంతా ఒకే బండిలో కూర్చున్నాం.. ముందు దగ్గర్లోని గుడికి తీసుకుని వెళతాం అని చెప్పడంతో.. కాసేపు భక్తి భావంతో ఉండాలనే మా ప్రయత్నానికి గండికొడుతూ.. డ్రైవర్ మాంచి మాస్ మసాలా సాంగ్ వేయడంతో😳..అదేదో సినీమాలో హీరో అన్నట్లు..బయటికి ఆఫీసర్లు లాగా టకప్ లేసి బిల్డప్ కాస్త గాఠ్ఠిగానే ఇచ్చినప్పటికీ.. లోపల మాత్రం ఒరిజినాలిటీ అలాగే ఉండటంతో.. ఎంతో సేపు ఆగలేకపోయాం.. ఇహ అంతే.. మా సింగర్ కం మ్...
భర్త :  ఏమేవ్.. నేనలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా.. భార్య : మీరు బ్యూటీ పార్లర్ కి ఎందుకండీ? భర్త : రేపు శ్రావణ శుక్రవారం కదా.. భార్య : అయితే.. మీరు ఏమన్నా పేరంటానికి వెళతారా?😲😲 భర్త : అదేం లేదే.. రేపు నువ్ కాళ్ళకి దణ్ణం పెట్టేటపుడు ఎలాగూ ఫోటో తీస్తావుగా.. నీ సెల్ఫీ లో కాళ్ళు బాగా పడొద్దూ.. 😀😂

నా స్వప్నం..

నా స్వప్నం | ఫణీంద్ర కుప్పిలి నేనొక కలగంటున్నాను.. ఒక మాజీ మంత్రి తనకి  రావాల్సిన పింఛను డబ్బు కోసం ఆఫీసు ముందు నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక మంత్రి గారి కారు రోడ్డు దాటుతున్న ఒక ముసలి అవ్వ కోసం సిగ్నల్స్ వద్ద ఠక్కున ఆగినట్లు.. నేనొక కలగంటున్నాను.. తనకు పుట్టబోయే బిడ్డ సీటు కోసం ఒక గవర్నమెంట్ బడి ముందర బారుతీరిన లైన్లో నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సర్కారీ దవాఖానాలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అర్ధరాత్రి దాటే వరకూ డ్యూటీ చేస్తున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపకుండానే చకా చకా ఫైల్స్ కదులుతున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సోదరి అర్థరాత్రి నిర్భయంగా తన ఇంటికి చేరుకున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. దేశం లో రాజకీయపార్టీలు నోట్లు పంచకుండానే ఓట్లడిగి గెల్చినట్లు... నేనొక కలగంటున్నాను.. కుల మత వర్గ భేదాలు లేని భారతావని నా జీవిత కాలం లోనే సాకారమయినట్లు...

అనగనగా ఆదివారం..

అనగనగా ఆదివారం..                         ఎపుడో అర్థ పుష్కర కాలం కిందట రావాల్సిన మా రిజల్ట్స్..అన్ని పురిటి నొప్పుల్ని దాటుకుని .. మా చేతికి పోస్టింగ్ ఆర్దర్లు వచ్చేసరికి..సగం మంది మగాళ్ళకి నూనె ఖర్చు తగ్గి..రంగు ఖర్చు పెరిగిపోయింది😂😂 మొత్తానికి బ్రహ్మచారులుగా ఉన్నపుడు పొందాల్సిన ట్రైనింగు..అంకుల్స్ (..ఆంటీ)😀😀గా మారాక మొదలైంది.. దాంతో బాధ్యతలు పెరిగి.. ఎపుడెపుడు ఇంటికి వెళదామా అని.. పేరోల్ కోసం ఎదురు చూసే జీవిత ఖైదీ లా..రెండో శనివారం కోసం ఎదురుచూడ సాగాం.. ఆదివారం నాడు మాంఛి నాటు కోడి పలావు ని సిద్ధం చేసుకుని.. భోజనానికి కూర్చునే సరికి.. ఉరుము లేని వర్షం లా వచ్చిన అతిథులు..ముక్క కూడా మిగల్చకుండా.. తినేసినట్లుగా.. మా రెండో శనివారం కాస్తా.. అస్సలు వినలేని క్లాసుతో కొట్టుకుపోయింది😢😢..దాంతో.. చేతిలోని లాలీపాప్ లాక్కుంటే.. చిన్న పిల్లోడికి కలిగిన ఫీలింగ్ తో ఉసురుమంటూ.. శనివారం గడిపాము.. ఆదివారం నాడు ఉదయం.. ఫ్యాక్టరీ సైరన్ లాంటి..మా వార్డెన్ వాయిస్ కి తుళ్ళిపడి ల...

ధనం మూలం ఇదం జగత్..

ధనం మూలం ఇదం జగత్.. | ఫణీంద్ర కుప్పిలి                          '..ఆ..డబ్బుదేముంది..'  '..మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం కానీ..డబ్బే ప్రధానం కాదు..' 'ఆ..డబ్బున్నోడు కూడా తినేది పిడికెడు మెతుకులే కదా..పోయేది ఆరడుగుల జాగాలోనే కదా ..' అంటూ దీర్ఘాలు పోయే వారిని చాలా మందిని రోజూ చూస్తుంటాం.. కానీ నిజ జీవితంలో మాత్రం మనలో చాలా మంది ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటాం.. కారణం ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా..ఎన్ని సుద్దులు చెప్పినా..   '..చేతిలో కాసు లేకపోతే..దమ్మిడీ కి కూడా కొరగాము..' అందుకే ఒక పెద్దాయన అన్నాడు...'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..డబ్బున్నోడి చుట్టూ తిరుగుతోంది..' అని.. అదేదో సినిమాలో హీరో గారు..అనామకుడి సమాధి ఆరడగుల మట్టి దిబ్బ అయితే.. ఒక పెద్దమ్మది అరవై ఎకరాల్లో ఉందని..గుక్క తిప్పుకోకుండా చెప్పినట్లు.. ఎన్ని అనుకున్నా..'పైసా మె పరమాత్మా హై..' రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అంటే.. అన్నదమ్ముల్ని విడదీయగలను..చివరికి కన్నవారిని సైతం మట్టుబెట్టగలను అనేది...రోజూ పత్రిక పతాక శీర్షికలే సాక్షి...

తలకో మొక్క..ఊరికో వనం

తలకో మొక్క..ఊరికో వనం | ఫణీంద్ర కుప్పిలి గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా .. “నిప్పులు కక్కుతున్న సూరీడు..భానుడి ప్రతాపానికి విలవిల లాడుతున్న జనాలు..” లాంటి మంచి టైమింగ్, రైమింగ్ ఉన్న క్యాప్షన్లతో జనాల్ని ఊదరగొదుతున్నారు.. అయినా ఎంతసేపూ..సూరన్నని ఆడిపోసుకునే బదులు..అసలు భానుడి ఈ ప్రతాపానికి కారణం ఎవరని? ఏ ఒక్కరూ ఆలోచించరే... మనం అభివృద్ధి పేరుతో కనబడిన ప్రతి చెట్టుని తెగ నరికేసి..అంగుళం ఖాళీ లేకుండా కాంక్రిటుతో  పరిచేసి.. కనుచూపు మేరలో కనీసం పచ్చ గడ్డిని మొలవనివ్వకుండా చేసేయడమే కాకుండా.. కారుల్లో..బైకుల్లో తెగ తిరిగేసి.. రోజంతా ఏ.సిలు ఫ్రిజ్ లు..మోటార్లు.. హీటర్లు.. ఒకటేంటి నానా రకాలుగా వాడేసి.. వాతావరణాన్ని వోల్ మొత్తంగా బొగ్గు పులుసుతో నింపేసి.. మన నెత్తిన మనమే కుంపటిని రాజేసుకుని.. ఇపుడు ఏ.సి రూంలో తీరిగ్గా కూర్చుని.. ”అబ్బ..ఈ వేడిని భరింలేకపోతున్నాం..” అంటూ దీర్ఘాలు పోవడం మరీ విడ్డూరం.. వెనకటికొకడు..” పచ్చదనం-ప్రాముఖ్యత పై మీటింగ్ ని..పదెకరాల తోటని నరికైనా సరే..భారీగా పెడతానని మంగమ్మ శపదం చేసాడంట..” ఇలా మనం కోట్ల టన్నుల కొలది భూవాతావరణాన్ని బొగ్గ...