Posts

ఆరని చితి

ఆరని చితి | ఫణీంద్ర కుప్పిలి భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీరం.. నేడు భూతాల దుర్గంగా మారిన వేళ.. దాయాది దేశం దమన నీతితో.. పెట్రేగిపోతున్న ఉగ్రమూకలు.. ఉగ్రవాద బిగి కౌగిలిలో చిక్కుకుని ఉన్మాదులుగా మారుతున్న యువకులు ఒకవైవు.. భరతమాత రక్షణకై కడుపులో చిచ్చుని రగుల్చుకుంటున్న మాతృమూర్తులు. దేశ సౌభాగ్యం కోసం తమ సౌభాగ్యాన్ని పణంగా పెదడుతున్న స్త్రీ మూర్తులు.. మరోవైపు.. దశాబ్దాలుగా సలపరం పెడుతున్న సమస్య ములాల్ని చిత్తశుద్ధితో పరికించకని.. సంతాప సభలు..కొవ్వొత్తుల ర్యాలీలు.. భావోద్వేగ ప్రకటనలు..ప్రతీకార చర్యలు.. మరోమారు కవితా వస్తువులుగా మిగిలిపోతాయి.. అమంగళం ప్రతిహతమగు గాక.. 16.02.2019

వలస పక్షులు

వలస పక్షులు || ఫణీంద్ర కుప్పిలి కూటికోసం గూటినొదిలి వలసపోయిన పక్షులన్నీ.. సొంత గూటిని చేరుకుంటే.. పోటెత్తిన పల్లెసీమలు.. బోసిపోయిన నగరాలు.. సంక్రాంతి ముగిసింది.. సంబరాలు ముగిసాయి.. మరోమారు మెతుకు వేటకై.. బతుకు బాటలో.. ఎగిరిపోతున్న వలస పక్షుల్ని చూసి.. పల్లె తల్లి పేగు కాలుతోంది.. 17 జనవరి, 2019

చివరికి మిగిలేది

చివరికి మిగిలేది || ఫణీంద్ర కుప్పిలి ఒంటరితనం అంటే.. చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు.. వంద మంది మధ్యలో ఉన్నా.. నా అనుకునే వాళ్ళు లేకపోవడం.. మన ఉనికిని గుర్తించే వారు కరువు అవడం.. మన జీవితాలలోకి వచ్చే అందరూ.. ప్రయాణంలో తోటి ప్రయాణికులు లాంటి వారే.. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మజిలీలో విడిచి పోవాల్సిందే.. కొందరు మనలో సంతోషాన్ని నింపి వెళితే.. మరికొందరు బాధను మిగిల్చి వెళతారు.. చివరకు మిగిలేది మాత్రం.. అనంతమైన నిశ్శబ్ధం.. భరించ లేని ఏకాకితనమే..
పేదలకు సేవచేసే అవకాశం వచ్చినప్పుడు.. నీ తల్లిదండ్రులను తలచుకుని చేయి.. ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేసినపుడు.. ప్రతిఫలాన్ని ఆశించని కన్నతల్లి మనసుతో చేయి..

(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి

(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి          మా స్కూల్ కి చాలా దూర గ్రామాల నుండి పిల్లలు వస్తుండటంతో..  నేను హాజరు మరియు టైం విషయం లో మరీ అంత కఠినంగా వ్యవరించే వాడిని కాను.. అదీ కాక ఆ ఊళ్లో చాలామంది తమ పిల్లల్ని ముసలి తల్లిదండ్రులు లేదా అత్తమామలు వద్ద వదిలి..పనికోసం దేశం వెళ్ళేవాళ్ళు.. దాంతో పిల్లల ఆలనా పాలనా సరిగా చూసే వారుండకపోవడంతో.. క్రమశిక్షణ విషయంలో కొంత ఇబ్బంది ఉండేది.. నేను క్లాస్ టీచర్ గా ఉన్న తరగతిలో ఒకమ్మాయి రోజూ లేట్ గా వస్తుండేది.. మాములుగా అయితే నేను పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు గానీ.. ఆ అమ్మాయి హోమ్ వర్క్స్ కూడా సరిగా చేయకపోవడంతో.. ఒకసారి ఆ అమ్మాయిని నిల్చోబెట్టి.. ఎందుకు రోజూ క్లాస్ కి లేట్ గా వస్తున్నావ్? పైగా హోమ్ వర్క్ కూడా చేయటం లేదు  అని గట్టిగా అడిగా.. దానికి ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకుండా కామ్ గా నిల్చుని ఉంది.. నేను సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు గురించి వాకబు చేయటం అలవాటు.. అందువల్ల ఆ అమ్మాయిని  మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? అని అడిగా.. దానికి సమాధానంగా ఆ అమ్మాయి.. 'మా నాన్న.. లేడండీ..' ...

...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి

...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి సాధారణంగా నేను ఎపుడూ మన ప్రగతి రథ చక్రాన్నే😳 నమ్ముకుంటాను..అదేనండీ మన ఎర్రబస్సుని🚌.. ఇపుడు బస్సు రంగుల్ని మార్చి.. మనకు రంగు పడేలా చేస్తున్నారు కదాండీ😠..ఆరోజు అనుకోకుండా ఒక తుఫాను🚐..( ఏ హుద్హుదో..తిత్లి యో అనుకునేరు..☺️) దూసుకుపోయె బండి .. మళ్లీ ఎక్కడకని.. అడక్కండేం🤣.. మా బుడ్డోడితో సహా ఎక్కాం.. అందులోనూ ముందు సీటు.. మావాడు హీరో రామ్ లాగా కాస్త అల్ట్రా హైపర్😷..  మావాడు ఆ రోజు కాస్తా నా మీద దయతలచి.. పడుకోడంతో.. ధైర్యం చేసి ముందు సీటులో ఎక్కే సాహసం చేశా.. లేదంటే.. బండి గమ్యం స్ధానం చేరే లోపు.. ఏ గేర్ రాడ్డునో.. లేదా స్టీరింగ్ చక్రాన్నో తీసి జాగ్రత్తగా.. డ్రైవర్ చేతిలో పెట్టే రకం😂.. ఇక మా ఆవిడ.. ఏదన్నా వాహనం ఎక్కడం ఆలస్యం.. శివుని మెడలో పాములా.. మాంత్రికుని టోపిలాంటి👜(..అందులో దొరకని వస్తువు ఉండదు.. పిన్నీసు నుండి పిస్తా దాకా) హ్యాండ్ బ్యాగు నుండి.. ఇయర్ మిషన్లు(..అదే లెండి..ఇయర్ ఫోన్స్) తీసి తగిలించేస్తుంది.. ఇక అంతే.. మన లోకంతో సంబంధాలు కట్.. ఇయర్స్ బద్ధలయ్యేదాకా.. లేదా.. ఇయర్ ఫోన్స్ తెగేదాకా (..విచ్ ఎవర్ ఈజ్ ఆర్లియర్) వింటుంది.....

...బతుకు బండి

                          ...బతుకు బండి | ఫణీంద్ర కుప్పిలి                        అది మంచి వేసవి మధ్యాహ్నం.. సూర్యుడు ప్రకోపానికి పిట్ట కూడా లేని రోడ్డు.. నల్లటి తాచుపాములా మెరుస్తోంది..అభివృద్ధి దెబ్బకు.. మహా వృక్షాలన్నీ నేలకొరిగాయి.. వాటి స్థానంలో కోట్లు ఖర్చు పెట్టి నాటిన క్రోటన్స్.. గుక్కెడు నీళ్ళకి నోచుకోక.. తడారిపోయి..బిక్క మొహం వేసాయి.. అలాంటి ఎడారిని తలపిస్తున్న రోడ్డు పై ఒక పాత టాటా మ్యాజిక్..కబేలాకి తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులా.. మెల్లగా సాగుతోంది.. ఆ బండిలో వెనకాల ఒక కుటుంబం కూర్చుంది..బహుశా ఎక్కడికో వలస వెళ్తున్నట్లుగా ఉన్నారు.. దేశంలోని పేదరికమంతా ఆ కుటుంబంలోని ఆడమనిషిలో కనిపిస్తోంది.. ఆమె ఒంటిపై కాణీ ఎత్తు బంగారం కాదు కదా..కనీసం గురివింద గింజంత  వెండి కూడా లేదు.. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి.. ఆ ఎండ వేడిని తట్టుకోలేక నెత్తిన కొంగు వేసుకుని..ఓ మూలగా కూర్చ...