Posts

కలిసి జీవించాల్సిందే..

కలిసి జీవించాల్సిందే.. | ఫణీంద్ర కుప్పిలి ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తున్నా.. సంక్షేమంపై లక్షలకోట్లు కుమ్మరిస్తున్నా.. ఘనమైన లక్ష్యాలను ఆవిష్కరిస్తున్నా.. కేవలం త్రాగడనికి గుక్కెడు మంచినీళ్లు లేక లక్షలాది మంది కడతేరిపోతున్నారు.. పీల్చడానికి స్వచ్చమైన గాలి కరువై కోట్లాది మంది అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.. సరైన పోషణ లేక భావి భారత పౌరులు సర్వ రోగాలతో కున్నారిల్లిపోతున్నారు. విద్య, ప్రజారోగ్యాలపై సవతి తల్లి ప్రేమ కురిపించినంత కాలం.. మానవ ప్రాథమ్యాలు మారనంత కాలం.. శాస్త్ర విజ్ఞానాన్ని, హేతుబద్ధ ఆలోచనల్ని అటకెక్కించి.. చింతకాయలు రాలే సమయంలోనే మంత్రాలను చదివే బాబాల చుట్టూ.. మూఢభక్తితో ప్రదక్షిణలు చేసినంత కాలం.. మనం కరోనాతో కాకపోతే.. మరో ప్రాణాంతక పరాన్నజీవితో కలిసి జీవించాల్సిందే.. మలేరియా డెంగ్యూ సార్స్ ఎబోలా.. అనాదిగా ఏదో ఒక మహమ్మారితో కలిసి జీవిస్తూనే ఉన్నాం. సకల రుగ్మతలతో అనునిత్యం జీవిస్తూ మరణిస్తూనే ఉన్నాం.. 30 ఏప్రిల్, 2020.

అన్ సంగ్ హీరోస్..

అన్ సంగ్ హీరోస్.. | ఫణీంద్ర కుప్పిలి ఆలయాలు మూసుకున్నాయి బాబాలు అజ్ఞాతంలోకెళ్లారు.. దేవుళ్ళు మనిషి రూపమెత్తారు.. పూజలు లేవు..పునస్కారాలు లేవు భజనలు లేవు..భక్తిగీతాలు లేవు క్యూలు లేవు..కుమ్ములాటలు లేవు.. మనం మోజుతో పరిగెత్తే కార్పొరేట్ ఆసుపత్రులు మొఖం చాటేశాయి.. మనం చీదరించుకునే సర్కారీ దవాఖానాలే మనకు దేవాలయాలు అయ్యాయి.. ప్రభుత్వ వైద్యులే మనకు దేవుళ్ళయ్యారు.. మనం ప్రతినాయకుల్లా చిత్రించే పోలీసులే రాత్రనక పగలనక మనకు కాపు కాస్తూ.. నిజజీవిత కథానాయకులయ్యారు.. మనిషిగా సైతం గుర్తింపుకు నోచుకోని ముఖం లేని పారిశుధ్య కార్మికులు.. సలుపెడుతున్న చేతుల పుండ్ల బాధని నిర్దయగా వారి మాస్కుల వెనుక దాచేసి నిష్ఠగా తమ పనిని చేసుకుపోతున్నారు.. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా తన కడుపుని మాడ్చుకుని మరీ మనకింత తిండి పెడుతున్న అన్నదాత ఆరుగాలం శ్రమిస్తూనే ఉన్నాడు/ గొప్ప గొప్పోళ్ళు, చేసిన సాయానికి 'సెల్ఫీ'ల డప్పులు కొట్టుకుంటుంటే.. లేనోడు నిశ్శబ్దంగా పక్కోడికి సాయపడుతూ సాయం సంధ్యలో కలిసిపోతున్నాడు.. నిన్నటి వరకు భౌతికంగా కలిసి ఉండి మానసికంగా గోడలు కట్టుకున్నాం.. నేటి న...

వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి

వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి కడువు చేత పట్టుకొని.. బాధ్యతల్ని భుజాన వేసుకుని.. రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. కన్నోళ్లని,ఉన్న ఊరిని వదిలి.. బతుకు బాటలో, మెతుకు వేటలో జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిపోతూనే ఉంటాం.. మాకు కులం లేదు.. మతం లేదు భాష లేదు.. ప్రాంతీయ భేదం లేదు ప్రతి పనిలో మేము.. ప్రతి పనికీ మేమే.. పంట పండక.. చేసిన అప్పుతీరక ఉన్న ఊళ్లో పనుల్లేక, వలస వెళ్లే ఓపిక లేక.. పస్తులున్న ముసలి ప్రాణాలకు.. కాస్త గంజి నీళ్లు పోసేందుకు.. డొక్క మాడ్చుకుని నాలుగు రూకలు మిగుల్చుకుంటాం.. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు.. కరోనా మహమ్మారి పంజా విసిరి.. ఎక్కడోళ్లనక్కడే లాక్ డౌన్ చేసేస్తే.. కూలి లేదు.. కూడు లేదు.. ఉండేందుకు గూడు లేదు.. ఊరెళ్లడానికి చేతిలో రూక లేదు.. ఖరీదైన బాబులంతా విమానాల్లో దిలాసాగా సొంత ఇళ్ళకి చేరుకుంటే.. పిల్లా పాపలతో.. నెత్తి మీద మూటలతో నడుస్తూ..పడుతూ లేస్తూ పొలిమేర దాటేసరికి సమయమేమో మించిపోయే.. ఊరు, పేరు లేని మాబోటి కూలీలంతా పొలిమేరల్లోనే లాక్ డౌన్ అయిపోయాం.. ప్రకటనల్లోని సాయం పేపరుకే పరిమితమయితే.. ఉన్నచోట ఉండలేక.. సొంతూరుకి పోలేక....

రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి

రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి కళ్లకి కన్నీళ్ళ పువ్వులు పూచాయి.. అవి ఒక్కొక్కటిగా గుండెలోకి జారి గుండె చెరువయ్యింది... కళ్లు పొడిబారాయి... మదమెక్కి మతి తప్పిన ఉగ్రవాద మూకలు మనుషుల రక్తంతో హోలీ ఆడుతున్నాయి.. చెల్లాచెదురుగా తెగిపడిన మొండేలు.. తుఫాను తాకిడికి నేలకొరిగిన అరటి బోదెల్ని తలపిస్తున్నాయి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ గారాల పట్టీ.. హఠాత్తుగా మాయమై... మనుషుల సంతలో వేలానికి నిలబడింది... అంతర్యుద్ధం కొలిమిలో నిత్యం రగులుతున్న రావణ కాష్ఠం... వసివాడని పాలబుగ్గలపై నెత్తుటి చారలు గడ్డకట్టిస్తోంది... వేయి తూటాలకి సమానమైన ఒమ్రాన్ దక్నీష్ అమాయక చూపులు.. అంతర్యుద్ధపు పాపాలను చేష్టలుడిగి చూస్తున్న.. యావత్తు ప్రపంచపటాన్ని ఛిద్రం చేసేలా ఉన్నాయి.. సిరియా అంతర్యుద్ధం.. భూమాత శరీరంపై నిత్యం రసికారుతున్న రాచపుండు అయితే, వెంటాడుతున్న ఉగ్రభూతం.. యావత్తు భూగోళాన్ని కబళిస్తోన్న క్యాన్సరు కణం వంటిది... 19.08.2016

రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి

రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి శ్మశానం అంచున ప్రాణంతో పడున్న శవం లా.. నిస్తేజంగా, నిర్లిప్తం గా అనంత శూన్యం లోకి చూస్తూ.. గతం కళ్లల్లో సినిమా రీల్ లా పరుగులు తీస్తోంది.. నాదైన నిరంకుశ ప్రపంచం.. ఎన్నో ఆర్తనాదాలు, మరెన్నో ఆత్మ ఘోషలూ శరీరం లో సత్తువ ఉన్నంత కాలం అంగ,అర్థ బలం తో నేను జరిపిన దమనకాండ నేను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన మూగ వేదనలూ.. నేనూ నాకుటుంబం అనే మత్తులో అందరి స్వప్న సౌధాలను కూల్చివేస్తూ ఆడదాన్ని ఒక బానిసలా చూస్తూ అందరి కష్టాన్ని దోచుకుని.. నేను నిర్మించుకున్న నా కుటుంబం.. నేడు నన్ను కేవలం.. ఒక ప్రాణమున్న వస్తువు గానే చూస్తోంది.. రోజంతా కూర్చున్నా నా భారాన్ని నెత్తికెత్తుకుందని ఎవరూ ప్రేమతో తల నిమరరు సోఫాని.. సమస్తాన్ని శాసించిన నీ బుల్లెట్ ని ఎవరూ ముద్దుపెట్టుకోరు కృతజ్ఞతతో.. ఇందుకోసమేనా నా జీవితాన్ని ధారపోశాను?? ప్రాణముండగా నాలుగు మంచి మాటలు ప్రాణం పోయాక మోయడానికి నలుగురు ఆత్మీయులు లేనప్పుడు ఎంత కూడగట్టుకున్నా.. ఎన్ని మేడలు కట్టుకున్నా ఏమి ప్రయోజనం?? నాలో రగులుతున్న ఆవేదననూ పశ్చాత్తాప భావననూ నా ఆత్మ ఘోషనూ వినిపించాలని ఎంత గొంతుచించుకు...
వలవుల్ని విడిచి వగచేది వెళయాలి.. విలువల్ని విడిచి నడిచేది (అ)రాచకీయవాది..
ఆదర్శం..అద్దంలోని చందమామలా అందంగా కనిపిస్తే.. ఆచరణ..రాళ్ళు రప్పలతో నిండిన నిస్సారమైన చంద్రుడిలా కనిపిస్తుంది..