అన్ సంగ్ హీరోస్..
అన్ సంగ్ హీరోస్.. | ఫణీంద్ర కుప్పిలి
ఆలయాలు మూసుకున్నాయి
బాబాలు అజ్ఞాతంలోకెళ్లారు..
దేవుళ్ళు మనిషి రూపమెత్తారు..
పూజలు లేవు..పునస్కారాలు లేవు
భజనలు లేవు..భక్తిగీతాలు లేవు
క్యూలు లేవు..కుమ్ములాటలు లేవు..
మనం మోజుతో పరిగెత్తే
కార్పొరేట్ ఆసుపత్రులు మొఖం చాటేశాయి..
మనం చీదరించుకునే సర్కారీ దవాఖానాలే
మనకు దేవాలయాలు అయ్యాయి..
ప్రభుత్వ వైద్యులే మనకు దేవుళ్ళయ్యారు..
మనం ప్రతినాయకుల్లా చిత్రించే పోలీసులే
రాత్రనక పగలనక మనకు కాపు కాస్తూ..
నిజజీవిత కథానాయకులయ్యారు..
మనిషిగా సైతం గుర్తింపుకు నోచుకోని
ముఖం లేని పారిశుధ్య కార్మికులు..
సలుపెడుతున్న చేతుల పుండ్ల బాధని
నిర్దయగా వారి మాస్కుల వెనుక దాచేసి
నిష్ఠగా తమ పనిని చేసుకుపోతున్నారు..
లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా
తన కడుపుని మాడ్చుకుని మరీ
మనకింత తిండి పెడుతున్న అన్నదాత
ఆరుగాలం శ్రమిస్తూనే ఉన్నాడు/
గొప్ప గొప్పోళ్ళు, చేసిన సాయానికి
'సెల్ఫీ'ల డప్పులు కొట్టుకుంటుంటే..
లేనోడు నిశ్శబ్దంగా పక్కోడికి సాయపడుతూ
సాయం సంధ్యలో కలిసిపోతున్నాడు..
నిన్నటి వరకు భౌతికంగా కలిసి ఉండి
మానసికంగా గోడలు కట్టుకున్నాం..
నేటి నుండి భౌతికంగా విడువడి
మానసికంగా సంఘటితమవుదాం..
ప్రచారాన్ని కోరుకోని ఈ నిజమైన హీరోల్ని
మనస్ఫూర్తిగా అభినందించుదాం..
మందు మాకూ లేని కరోనా మహమ్మారిని
ఈ నేల నుండి తరిమి తరిమి కొడదాం..
28 ఏప్రిల్, 2020.
ఆలయాలు మూసుకున్నాయి
బాబాలు అజ్ఞాతంలోకెళ్లారు..
దేవుళ్ళు మనిషి రూపమెత్తారు..
పూజలు లేవు..పునస్కారాలు లేవు
భజనలు లేవు..భక్తిగీతాలు లేవు
క్యూలు లేవు..కుమ్ములాటలు లేవు..
మనం మోజుతో పరిగెత్తే
కార్పొరేట్ ఆసుపత్రులు మొఖం చాటేశాయి..
మనం చీదరించుకునే సర్కారీ దవాఖానాలే
మనకు దేవాలయాలు అయ్యాయి..
ప్రభుత్వ వైద్యులే మనకు దేవుళ్ళయ్యారు..
మనం ప్రతినాయకుల్లా చిత్రించే పోలీసులే
రాత్రనక పగలనక మనకు కాపు కాస్తూ..
నిజజీవిత కథానాయకులయ్యారు..
మనిషిగా సైతం గుర్తింపుకు నోచుకోని
ముఖం లేని పారిశుధ్య కార్మికులు..
సలుపెడుతున్న చేతుల పుండ్ల బాధని
నిర్దయగా వారి మాస్కుల వెనుక దాచేసి
నిష్ఠగా తమ పనిని చేసుకుపోతున్నారు..
లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా
తన కడుపుని మాడ్చుకుని మరీ
మనకింత తిండి పెడుతున్న అన్నదాత
ఆరుగాలం శ్రమిస్తూనే ఉన్నాడు/
గొప్ప గొప్పోళ్ళు, చేసిన సాయానికి
'సెల్ఫీ'ల డప్పులు కొట్టుకుంటుంటే..
లేనోడు నిశ్శబ్దంగా పక్కోడికి సాయపడుతూ
సాయం సంధ్యలో కలిసిపోతున్నాడు..
నిన్నటి వరకు భౌతికంగా కలిసి ఉండి
మానసికంగా గోడలు కట్టుకున్నాం..
నేటి నుండి భౌతికంగా విడువడి
మానసికంగా సంఘటితమవుదాం..
ప్రచారాన్ని కోరుకోని ఈ నిజమైన హీరోల్ని
మనస్ఫూర్తిగా అభినందించుదాం..
మందు మాకూ లేని కరోనా మహమ్మారిని
ఈ నేల నుండి తరిమి తరిమి కొడదాం..
28 ఏప్రిల్, 2020.