ఆ రెండు క్షణాలు.. | ఫణీంద్ర కుప్పిలి

ఆ రెండు క్షణాలు.. | ఫణీంద్ర కుప్పిలి

అన్ని అనర్థాలకు మూల హేతువు
ఆ రెండు క్షణాలు మాత్రమే..

అగ్నిపర్వతం బద్దలై..
క్షణకాలంలో సమస్తాన్ని నేలమట్టం చేసినట్లు..
ఒక్కమాటున సునామీలా వచ్చి
విలయతాండవం చేసినట్లు..

కట్టలు తెంచుకున్న కోపంతో..
సర్వం మన కళ్ళ ముందే
క్షణ కాలంలో బీటలు వారుతాయి..

మన కోపం చల్లారే సరికి
బంధాలు..బంధుత్వాలు..
స్నేహాలు..వ్యవహారాలు..అన్నీ..

పగిలిన గాజుముక్కల్లా..
విరిగి పడిన మొండిగోడల్లా..
మనల్ని వెక్కిరిస్తాయి..

ఎన్ని ఉద్గ్రంథాలను చదివినా..
ఎన్ని గురుబోధలను విన్నా..
ఎన్ని ఉపదేశాలను పొందినా..

ఆరెండు క్షణాలు..
మనపై మనం నియంత్రణ కొల్పోతే..

మన జీవితానికి
అర్థం..పరమార్థం..
ముక్తి..మోక్షం..
సర్వం కోల్పోయినట్లే..
మన జీవిత నావ
కల్లోల సంద్రంలో చిక్కుకున్నట్లే..

ఆరెండు క్షణాలు..
అన్ని అనర్థాలకు మూల హేతువుగా
మిగిలిపోతోంది...

20జూన్, 2017.

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం