స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా చేసుకుందాం...

స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా చేసుకుందాం.. | ఫణీంద్ర కుప్పిలి

అర్థరాత్రి కాకపోయినా కనీసం పట్ట పగలైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా...
మన సాటి సోదరుల్ని మనుషులుగా గుర్తించేలా...
నా భావి భారత పౌరుల్ని ఇంద్రియ స్పృహ కలిగుండేవారిగా...

కర్తవ్య నిర్వహణ లో అవినీతిని, లంచగొండితనం ను అరికట్టేలా...
ఎన్నికలలో అవినీతిపరులూ, నేరస్తులూ ఎన్నిక కాకుండా ఉండేలా..
వెయ్యి నోటుకీ, లిక్కర్ బాటిల్ కి ఓటుని అమ్ముకునే దౌర్భాగ్యానికి లోనుకాకుండా ఉండేలా..

సంక్షేమపధకాలు అర్హులకి మాత్రమే దక్కేలా..

ముక్కుపచ్చలారని బాలలంతా బళ్ళోకి వెళ్ళేలా...
ర్యాంకుల కోసం వెంపర్లాడని చదువులు చెప్పేలా...
ఎటువంటి లీకులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా...

ఒకపక్క గోదాముల్లో ఆహారధాన్యాలు మూలుగుతూ ఉంటే ఇంకో వైపు ఒక పూట తిండిలేక అలమటించే అభాగ్యులికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళేలా...
ఆరుగాలం శ్రమించే రైతన్న,నేతన్నల శ్రమకి తగిన మూల్యం దక్కేలా...

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పిల్లలు కళ్లలో పెట్టుకుని చూసేలా...
ఒలింపిక్స్ లో ఒక్క పతకం కోసం అర్రులు చాచే పరిస్థితి లేకుండా...
నేరస్థులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా...

ప్రజలంతా నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అనుభవించే..
ఘణమైన స్వతంత్ర భారతావని
కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..


పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం