ఓ దేవదేవా.. | ఫణీంద్ర కుప్పిలి
ఓ దేవదేవా.. | ఫణీంద్ర కుప్పిలి
అనుక్షణం వెన్నంటి ఉంటూ..
అడుగడునా కాపుకాస్తూ..
నిరంతరం రక్షణ ఛత్రమై..
అమ్మలా అనునయిస్తూ..
నాన్నలా వేలుపట్టుకుని..
నడిపించే ఓ దేవ దేవా..
నీ ప్రేమ..
నీ కరుణ..
నీ ఉనికి..
నీ మహిమ..
మాటల్లో కొలవలేని...
అమూర్త తత్వం..
నిర్మలమైన మనసుతో..
అనుభవైక్యమైనదే..
అద్భుతమైన మానవ మేధస్సుకీ..
విజ్ఞాన శాస్త్ర విశ్లేషణలకీ..
హేతుబద్ధమైన తర్కానికీ..
అణుమాత్రం అంతుచిక్కని..
నీ అనంత తత్వానికీ..
నిగూఢమైన శక్తికీ..
ఒక రూపమిచ్చి..
ప్రతిమని చేసి కొలవాలనుకోవడం..
అజ్ఞానంధకారంలో మగ్గిపోతున్న..
సగటుజీవికి దివిటీ పట్టి
దారిచూపేందుకేనయ్యా..
ఓ దేవ దేవా..