Posts

జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి

 జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి చదువుకునే చిన్నారులకు అమ్మ ఒడిని చేరుస్తూ రెక్కలు ముక్కలు చేసుకునే అక్క చెల్లెమ్మలు చేయుతనిస్తూ.. ఆరుగాలం శ్రమించే రైతన్నకు భరోసా నిస్తూ మహిళా లోకానికి ఆసరాగా నిలుస్తూ.. కులవృత్తుల వారికి చేదోడుగా ఉంటూ.. చిరు వ్యాపారులకు తోడుగా నిలుస్తూ.. క్యూలు లేవు..నిరీక్షణలు లేవు.. కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి మరీ అవ్వా తాతలకు ఠంచనుగా పింఛను కానుకనందిస్తూ.. కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన వేళ నేనున్నానంటూ ముందు నిలిచి పోరాడి మానవత్వం చూపిన కరోనా యోధుడిగా.. ఇలా ప్రతి కుటుంబంలో ఒక అన్నగా.. ఒక అక్కగా ఒక కొడుకుగా..ఒక కూతురుగా నిలుస్తూ.. అన్నింటా నువ్వే..అన్నిటికి నువ్వే.. ప్రతి పనిలో నువ్వే..ప్రతి పనికి నువ్వే.. అనుక్షణం.. అహర్నిహశలు.. ప్రజా క్షేమమే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ఊపిరిగా సాగుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్నకు బలం మీరే..బలగం మీరే.. జనం మెచ్చిన జగనన్న సైన్యం మీరే.. జయహో వాలంటీర్ వ్యవస్థ..
  మనిషి అవసరాలు అవకాశాలు ఆశ నిరాశలు జయాపజయాలతో రాజీ పడి.. మనిషి లోపల బయట వెలుగు చీకట్లను మార్చి మార్చి.. అనుక్షణం తనలోని తనని అంతులేని అనుభూతుల ఒరిపిడికి గురిచేస్తూ.. నటిస్తూ జీవిస్తూ.. జీవిస్తూ నటిస్తూ.. తనకు సాంత్వన చేకూర్చే తనలోని తనని విదిల్చుకుని.. ఎక్కడెక్కడి ఎడారుల్లో రంగుల ప్రపంచాన్ని వెతుక్కుంటూ.. తన అస్తిత్వాత్వాన్ని మరిచి ఇజాల ఎండమావుల వెంట పరుగులు తీస్తూ.. అలసి సొలసి చివరికి అంతులేని నిరాశా నిస్పృహలతో.. అనంత నిశ్శబ్దంలోకి శాశ్వతంగా నెట్టివేయ్యబడతాడు.. -ఫణీంద్ర కుప్పిలి 18.04.2022
  వాళ్ళు నాపై మాటల తూటాలు పేల్చారు.. నేను వారిపై మౌనాన్ని ఎక్కుపెట్టాను.. వాళ్ల తూటాలు తుస్సుమన్నాయి.. -ఫణీంద్ర కుప్పిలి
      మనిషికి వయసు మీద పడుతున్న కొలదీ జుట్టు నెరుస్తుంది.. పళ్ళు ఊడిపోతాయి.. చూపు మందగిస్తుంది.. కాస్త అజ్ఞానం కూడా నశిస్తే బాగుణ్ణు..  -ఫణీంద్ర కుప్పిలి 15.04.2022

కర్మయోగం | ఫణీంద్ర కుప్పిలి

  కర్మయోగం | ఫణీంద్ర కుప్పిలి ఆరు బయట దట్టమైన చీకటి దుప్పటి కప్పి ఉంది.. అర్థ రాత్రి దాటినా కంటిపై కునుకు రావడం లేదు. చేస్తున్న ప్రయత్నాలన్నీ కొడిగడుతున్నాయి.. రేపటి భవిష్యత్తు పై ఆశ సన్నగిల్లుతోంది.. నిరాశ నిస్పృహలతో కూడిన నిస్సత్తువ నన్ను ఆవరిస్తోంది.. ఎటు చూసినా నిర్మానుష్యం.. ఎటు చూసినా నైరాశ్యం.. మనసులోని ఆలోచనలు దారం తెగిన గాలి పటంలా దారి తెన్ను లేకుండా పరుగులెడుతున్నాయి.. గడియారంలో ముల్లు భారంగా కదుల్తోంది.. నాలో అసహనం పెరిగిపోతోంది.. ఇంతలో ఆ చిమ్మ చీకటిని చీల్చుకుంటూ ఉదయ భానుడి నును వెచ్చని వెలుగు రేఖలు మెల్లగా నా నుదిటిని తాకుతున్నాయి.. ఆ అప్రయత్నంగా నా దృష్టి ఎదురుగా ఉన్న ఓ అల్ప జీవిపై పడింది.. ఓ సాలీడు తెగిన తన గూడును అవిశ్రాంతంగా నిర్మించుకుంటోంది.. ఓ తేనెటీగ  చుక్క మకరందం కోసం అలుపెరగక శ్రమిస్తోంది.. ఓ గొంగళి పురుగు అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతోంది. ఓ పక్షి తన పిల్లల్ని సముదాయించి ఆహార వేటలో పడింది.. ఓ పుష్పం ఈశ్వరుని పాదాల చెంతకు చేరడానికి ముగ్ధ మనోహరంగా విచ్చుకుంటోంది.. వాటికి గెలుపు తలంపు లేదు.. ఓటమి భయం లేదు.. ప్రకృతి...

యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి

  యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి అర్ధరాత్రి వేళ.. హాయిగా అమ్మ ఒడిలో  నిద్రిస్తున్న చిన్నారి తల హఠాత్తుగా తెగి పడి మొండెం మిగిలింది.. తన భవిష్యత్తు కోసం కలలు కంటూ పడుకున్న ఒక యువకుని రేపటి కల చెదిరింది.. మరో చిన్నారి తన కళ్ళముందే కన్న వాళ్ళని కోల్పోయి దిక్కులేనిదయింది.. తన అవశాన దశలో అక్కరకొస్తాడనుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండటం చూసి.. ఓ తల్లి మౌనంగా కుమిలిపోతోంది.. ఎటు చూసినా శవాల గుట్టలు.. తెగిపడిన శరీర అవయవాలు.. కూలిన భవనాలు.. వెక్కిరిస్తున్న మొండి గోడలు.. చెవులు చిల్లులు పడేలా మోగుతున్న ఫిరంగి గుళ్ళు.. బాంబుల వర్షం కురిపిస్తున్న శత్రు దేశ లోహ విహంగాలు. పరాయి దేశ రాబందులు రెక్కల చప్పుళ్ళు.. ఎటు చూసినా భీభత్సం.. ఎటు చూసినా భయానకం.. ఎటు చూసినా అంతులేని మారణ హోమం.. యుద్ధోన్మాదుల వికృత వికట్టహాసం.. పొరుగు దేశ దాష్టీకాలు.. అగ్ర నాయకుల అభిజాత్యాలు.. చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచ దేశాలు.. అమాయక ప్రజల రేపటి ఆశల పీక నులిమేస్తూ నూతన సహస్రాబ్దిలో మరో రక్త పద చిత్రం.. యుద్ధంలో విజేతలుండరు.. మానవత్వాన్ని మంటగలిపిన చరిత్ర హీనులు మాత్రమే ఉంటారు.. మరోమారు రక...

క 'రోనా' | ఫణీంద్ర కుప్పిలి

  క 'రోనా'  | ఫణీంద్ర కుప్పిలి కులం లేదు.. మతం లేదు.. భాషా ప్రాంతీయ భేదం లేదు.. కొంచెం ఏమరుపాటుగా ఉంటే చాలు.. నిర్దయగా ప్రతీ ఒక్కరినీ కబళిస్తోంది.. నిన్నటి వరకూ నాకేమి కాదంటూ.. కాలరెగరేసుకుని నిర్లక్ష్యంగా తిరిగినోళ్లు.. మాస్కుతో పోయేదాన్ని.. మరణశయ్య వరకు వెంట తెచ్చుకుని.. అయిన వారందరినీ శోకసంద్రంలో ముంచి.. హఠాత్తుగా మాయమయిపోతున్నారు.. పబ్బులూ.. క్లబ్బులూ.. పండగలూ..పబ్బాలూ.. విందులూ.. వినోదాలూ.. కరోనా రక్కసిని ఎర్రతివాచితో ఆహ్వానం పలుకుతుంటే.. నాలుగు కాలాలు పాటు నవ్వుతూ బతకాల్సిన వాళ్ళు.. నాలుగు రోజుల్లోనే అర్థాంతరంగా కాలం చేస్తున్నారు.. 10.05.2021