జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి

 జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి


చదువుకునే చిన్నారులకు అమ్మ ఒడిని చేరుస్తూ

రెక్కలు ముక్కలు చేసుకునే అక్క చెల్లెమ్మలు చేయుతనిస్తూ..

ఆరుగాలం శ్రమించే రైతన్నకు భరోసా నిస్తూ

మహిళా లోకానికి ఆసరాగా నిలుస్తూ..

కులవృత్తుల వారికి చేదోడుగా ఉంటూ..

చిరు వ్యాపారులకు తోడుగా నిలుస్తూ..


క్యూలు లేవు..నిరీక్షణలు లేవు..

కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి మరీ

అవ్వా తాతలకు ఠంచనుగా పింఛను కానుకనందిస్తూ..


కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన వేళ

నేనున్నానంటూ ముందు నిలిచి పోరాడి

మానవత్వం చూపిన కరోనా యోధుడిగా..


ఇలా ప్రతి కుటుంబంలో ఒక అన్నగా.. ఒక అక్కగా

ఒక కొడుకుగా..ఒక కూతురుగా నిలుస్తూ..

అన్నింటా నువ్వే..అన్నిటికి నువ్వే..

ప్రతి పనిలో నువ్వే..ప్రతి పనికి నువ్వే..


అనుక్షణం.. అహర్నిహశలు.. ప్రజా క్షేమమే ధ్యేయంగా

ప్రజా సంక్షేమమే ఊపిరిగా సాగుతున్న

మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్నకు

బలం మీరే..బలగం మీరే..

జనం మెచ్చిన జగనన్న సైన్యం మీరే..


జయహో వాలంటీర్ వ్యవస్థ..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం