మనిషి
అవసరాలు అవకాశాలు
ఆశ నిరాశలు
జయాపజయాలతో రాజీ పడి..
మనిషి లోపల బయట
వెలుగు చీకట్లను మార్చి మార్చి..
అనుక్షణం తనలోని తనని
అంతులేని అనుభూతుల ఒరిపిడికి గురిచేస్తూ..
నటిస్తూ జీవిస్తూ..
జీవిస్తూ నటిస్తూ..
తనకు సాంత్వన చేకూర్చే
తనలోని తనని విదిల్చుకుని..
ఎక్కడెక్కడి ఎడారుల్లో
రంగుల ప్రపంచాన్ని వెతుక్కుంటూ..
తన అస్తిత్వాత్వాన్ని మరిచి
ఇజాల ఎండమావుల వెంట పరుగులు తీస్తూ..
అలసి సొలసి చివరికి
అంతులేని నిరాశా నిస్పృహలతో..
అనంత నిశ్శబ్దంలోకి
శాశ్వతంగా నెట్టివేయ్యబడతాడు..
-ఫణీంద్ర కుప్పిలి
18.04.2022