కలిసి జీవించాల్సిందే..
కలిసి జీవించాల్సిందే.. | ఫణీంద్ర కుప్పిలి ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తున్నా.. సంక్షేమంపై లక్షలకోట్లు కుమ్మరిస్తున్నా.. ఘనమైన లక్ష్యాలను ఆవిష్కరిస్తున్నా.. కేవలం త్రాగడనికి గుక్కెడు మంచినీళ్లు లేక లక్షలాది మంది కడతేరిపోతున్నారు.. పీల్చడానికి స్వచ్చమైన గాలి కరువై కోట్లాది మంది అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.. సరైన పోషణ లేక భావి భారత పౌరులు సర్వ రోగాలతో కున్నారిల్లిపోతున్నారు. విద్య, ప్రజారోగ్యాలపై సవతి తల్లి ప్రేమ కురిపించినంత కాలం.. మానవ ప్రాథమ్యాలు మారనంత కాలం.. శాస్త్ర విజ్ఞానాన్ని, హేతుబద్ధ ఆలోచనల్ని అటకెక్కించి.. చింతకాయలు రాలే సమయంలోనే మంత్రాలను చదివే బాబాల చుట్టూ.. మూఢభక్తితో ప్రదక్షిణలు చేసినంత కాలం.. మనం కరోనాతో కాకపోతే.. మరో ప్రాణాంతక పరాన్నజీవితో కలిసి జీవించాల్సిందే.. మలేరియా డెంగ్యూ సార్స్ ఎబోలా.. అనాదిగా ఏదో ఒక మహమ్మారితో కలిసి జీవిస్తూనే ఉన్నాం. సకల రుగ్మతలతో అనునిత్యం జీవిస్తూ మరణిస్తూనే ఉన్నాం.. 30 ఏప్రిల్, 2020.