జీవితం ఒక పరుగు పందెం వంటిది.. ఇందులో గెలుపు ఓటములు ఉండవు.. పక్కోడితో పోల్చుకోకుండా ఎవడి పరుగు వాడు పరిగెత్తడమే.. - ఫణీంద్ర కుప్పిలి
Posts
Showing posts from 2022
- Get link
- X
- Other Apps
చీకటి తర్వాత వెలుగు వస్తుంది.. కానీ కొన్ని జీవితాలు చీకట్లోనే ముగుస్తాయి.. ఓటమి గెలుపుకు మొదటి మెట్టు.. కానీ ఎన్నో జీవితాలు గెలుపు మెట్టు ఎక్కకుండనే అంతమవుతాయి.. ఏదో సాధించాలన్న తపన అవసరమే కానీ సాధించాక మాత్రమే జీవిస్తామనుకుంటే.. కాల చక్రం ఏ ఒక్కరి కోసం ఆగిపోదు.. చివరికి అంతులేని నిరాశా నిస్పృహలతో కాలగర్భంలో కలిసిపోక తప్పదు.. అంతమవ్వని జ్ఞానమార్గాన్ని వదిలి.. సంతృప్తి ఇవ్వని ఐహిక సుఖాల కోసం వెంపర్లాడటం.. దోసిళ్ల లోని నీటిని జార విడిచి ఎండమావుల వెంట పరుగులు తీయడమే.. సాగిపోవుటే జీవితం.. ఆగిపోవుటే మరణం.. ఫణీంద్ర కుప్పిలి 18.12.2022
- Get link
- X
- Other Apps
జీవితం | ఫణీంద్ర కుప్పిలి మనం వృధా చేసే ప్రతీ అన్నపు మెతుకు ఎందరికో ఆకలి మంట తీర్చే అమృతం.. మనం చిన్న చూపు చూసే ఉద్యోగం.. ఎందరికో జీవితకాల స్వప్నం.. మనకు ఉన్నది ఆనందం కలిగించదు.. మనకు లేనిది సంతోషంగా ఉండనివ్వదు.. అందరూ ఆనందంగా ఉన్నారనే భావం. అందంగా కనిపించే చందమామ వంటిది.. తరచి చుడాలే గానీ ఇంటికో కథ.. మనిషికో వ్యధ.. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నిరంతరం సాగిపోవటమే జీవితం.. గడిచిన కాలాన్ని, చేజారిన అవకాశాన్ని తలచుకుని ఆగిపోవటం మరణం.. 27.11.2022
- Get link
- X
- Other Apps
సంతోషం నా దరి చేరనంటోంది.. బాధ నన్ను విడిచి పోనంటోంది.. నా సంతోషానికి ఆత్రమెక్కువ.. నా కష్టాలకు ఓపికెక్కువ.. నా జీవితంలో సంతోషం.. శ్రీవారి దర్శనంలా ఊరిస్తోంది.. ఆమడ దూరంలోనే ఉన్నా.. అనుభవైకవేద్యం కానంటోంది.. ఆశల ఎదురు చూపులతోనే ముడొంతుల కాలం కరిగిపోతోంది.. అను నిత్యం ఊభిలో దున్నలా మనసు పెనుగులాడతోంది.. అయినా మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపిస్తునే ఉన్నా ఈశ్వరా..
యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
యుధ్ధం| ఫణీంద్ర కుప్పిలి తుపాకులతో, బాంబులతో.. అంతులేని హింసతో.. చేసేది మాత్రమే యుద్ధం కాదు.. అన్యాయాలను, అక్రమాలను.. మాసిపోని వివక్షతను ఎదిరించి నిలబడటం యుద్ధమే.. పెత్తనం దారుల దౌర్జన్యాలతో అభాగ్యుని గొంతుక పూడుకపోయినపుడు గళమెత్తి పోరాడటం యుద్ధమే.. యుద్ధం చేయటం నేరం కాదు, ఘోరం కాదు.. యుద్ధానికి యుద్ధానికి మధ్య సంధి కాలమే శాంతి అయితే.. ఆ శాంతి కోసమే యుద్ధం చేద్దాం.. మనిషి పుట్టుక ఒక యుద్ధం.. మనిషి చావు ఒక యుధ్ధం.. అనుక్షణం పోరాటం.. మనిషి మనుగడకై ఆరాటం.. 06.11.2022
పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి పొద్దున్నే తొందరగా ఎలా లేవాలా అని ప్లానులు మీద ప్లానులు ఏస్కుని పడుకునే సరికి తెల్లవారు జాము అవడంతో ఉదయం యధావిధిగా లేటుగా లేవడమయింది..👻 దాంతో లేస్తానే అన్ని ఆఫీసు వాట్సాప్ గ్రూపుల్లో ఓసారి కలియతిరిగి.. అందరికీ అన్ని అప్పగింతలు చేసేసరికి.. మిట్ట మధ్యాహ్నం🌞 అయిపోయింది.. అప్పటివరకు పని హడావుడిలో ఉండటం తో ఉదయం నుండి ఏమీ తినలేదన్న విషయమే మర్చిపోయాను.. నేను మర్చిపోయినా కూడా..నా 'గ్యాస్ట్రిక్'🔥 మిత్రుడు మాత్రం మధ్య మధ్యలో గుర్తుచేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. సరే ఓ నాలుగు మెతుకులు ఎంగిలిపడి బయలేదరదామనుకుంటే.. ఆరోజు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన పెళ్లి ఫంక్షన్ ఒకటి ఉందనే విషయాన్ని మావాళ్ళు గుర్తు చేసేరు.. మనకు ఈ పెళ్ళిభోజనాలు సెక్షన్ అంటేనే ఇబ్బంది.. ఎందుకంటే అక్కడ వాళ్ళు నోరు తిరగని నానా రకాల వంటకాల్ని ప్లేట్లో కుమ్మరించేసి.. కలగాపులగం చేసేస్తే.. ఏది తినాలో ...
జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
జయహో వాలంటీర్ | ఫణీంద్ర కుప్పిలి చదువుకునే చిన్నారులకు అమ్మ ఒడిని చేరుస్తూ రెక్కలు ముక్కలు చేసుకునే అక్క చెల్లెమ్మలు చేయుతనిస్తూ.. ఆరుగాలం శ్రమించే రైతన్నకు భరోసా నిస్తూ మహిళా లోకానికి ఆసరాగా నిలుస్తూ.. కులవృత్తుల వారికి చేదోడుగా ఉంటూ.. చిరు వ్యాపారులకు తోడుగా నిలుస్తూ.. క్యూలు లేవు..నిరీక్షణలు లేవు.. కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి మరీ అవ్వా తాతలకు ఠంచనుగా పింఛను కానుకనందిస్తూ.. కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన వేళ నేనున్నానంటూ ముందు నిలిచి పోరాడి మానవత్వం చూపిన కరోనా యోధుడిగా.. ఇలా ప్రతి కుటుంబంలో ఒక అన్నగా.. ఒక అక్కగా ఒక కొడుకుగా..ఒక కూతురుగా నిలుస్తూ.. అన్నింటా నువ్వే..అన్నిటికి నువ్వే.. ప్రతి పనిలో నువ్వే..ప్రతి పనికి నువ్వే.. అనుక్షణం.. అహర్నిహశలు.. ప్రజా క్షేమమే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ఊపిరిగా సాగుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్నకు బలం మీరే..బలగం మీరే.. జనం మెచ్చిన జగనన్న సైన్యం మీరే.. జయహో వాలంటీర్ వ్యవస్థ..
- Get link
- X
- Other Apps
మనిషి అవసరాలు అవకాశాలు ఆశ నిరాశలు జయాపజయాలతో రాజీ పడి.. మనిషి లోపల బయట వెలుగు చీకట్లను మార్చి మార్చి.. అనుక్షణం తనలోని తనని అంతులేని అనుభూతుల ఒరిపిడికి గురిచేస్తూ.. నటిస్తూ జీవిస్తూ.. జీవిస్తూ నటిస్తూ.. తనకు సాంత్వన చేకూర్చే తనలోని తనని విదిల్చుకుని.. ఎక్కడెక్కడి ఎడారుల్లో రంగుల ప్రపంచాన్ని వెతుక్కుంటూ.. తన అస్తిత్వాత్వాన్ని మరిచి ఇజాల ఎండమావుల వెంట పరుగులు తీస్తూ.. అలసి సొలసి చివరికి అంతులేని నిరాశా నిస్పృహలతో.. అనంత నిశ్శబ్దంలోకి శాశ్వతంగా నెట్టివేయ్యబడతాడు.. -ఫణీంద్ర కుప్పిలి 18.04.2022
కర్మయోగం | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
కర్మయోగం | ఫణీంద్ర కుప్పిలి ఆరు బయట దట్టమైన చీకటి దుప్పటి కప్పి ఉంది.. అర్థ రాత్రి దాటినా కంటిపై కునుకు రావడం లేదు. చేస్తున్న ప్రయత్నాలన్నీ కొడిగడుతున్నాయి.. రేపటి భవిష్యత్తు పై ఆశ సన్నగిల్లుతోంది.. నిరాశ నిస్పృహలతో కూడిన నిస్సత్తువ నన్ను ఆవరిస్తోంది.. ఎటు చూసినా నిర్మానుష్యం.. ఎటు చూసినా నైరాశ్యం.. మనసులోని ఆలోచనలు దారం తెగిన గాలి పటంలా దారి తెన్ను లేకుండా పరుగులెడుతున్నాయి.. గడియారంలో ముల్లు భారంగా కదుల్తోంది.. నాలో అసహనం పెరిగిపోతోంది.. ఇంతలో ఆ చిమ్మ చీకటిని చీల్చుకుంటూ ఉదయ భానుడి నును వెచ్చని వెలుగు రేఖలు మెల్లగా నా నుదిటిని తాకుతున్నాయి.. ఆ అప్రయత్నంగా నా దృష్టి ఎదురుగా ఉన్న ఓ అల్ప జీవిపై పడింది.. ఓ సాలీడు తెగిన తన గూడును అవిశ్రాంతంగా నిర్మించుకుంటోంది.. ఓ తేనెటీగ చుక్క మకరందం కోసం అలుపెరగక శ్రమిస్తోంది.. ఓ గొంగళి పురుగు అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతోంది. ఓ పక్షి తన పిల్లల్ని సముదాయించి ఆహార వేటలో పడింది.. ఓ పుష్పం ఈశ్వరుని పాదాల చెంతకు చేరడానికి ముగ్ధ మనోహరంగా విచ్చుకుంటోంది.. వాటికి గెలుపు తలంపు లేదు.. ఓటమి భయం లేదు.. ప్రకృతి...
యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి అర్ధరాత్రి వేళ.. హాయిగా అమ్మ ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి తల హఠాత్తుగా తెగి పడి మొండెం మిగిలింది.. తన భవిష్యత్తు కోసం కలలు కంటూ పడుకున్న ఒక యువకుని రేపటి కల చెదిరింది.. మరో చిన్నారి తన కళ్ళముందే కన్న వాళ్ళని కోల్పోయి దిక్కులేనిదయింది.. తన అవశాన దశలో అక్కరకొస్తాడనుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండటం చూసి.. ఓ తల్లి మౌనంగా కుమిలిపోతోంది.. ఎటు చూసినా శవాల గుట్టలు.. తెగిపడిన శరీర అవయవాలు.. కూలిన భవనాలు.. వెక్కిరిస్తున్న మొండి గోడలు.. చెవులు చిల్లులు పడేలా మోగుతున్న ఫిరంగి గుళ్ళు.. బాంబుల వర్షం కురిపిస్తున్న శత్రు దేశ లోహ విహంగాలు. పరాయి దేశ రాబందులు రెక్కల చప్పుళ్ళు.. ఎటు చూసినా భీభత్సం.. ఎటు చూసినా భయానకం.. ఎటు చూసినా అంతులేని మారణ హోమం.. యుద్ధోన్మాదుల వికృత వికట్టహాసం.. పొరుగు దేశ దాష్టీకాలు.. అగ్ర నాయకుల అభిజాత్యాలు.. చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచ దేశాలు.. అమాయక ప్రజల రేపటి ఆశల పీక నులిమేస్తూ నూతన సహస్రాబ్దిలో మరో రక్త పద చిత్రం.. యుద్ధంలో విజేతలుండరు.. మానవత్వాన్ని మంటగలిపిన చరిత్ర హీనులు మాత్రమే ఉంటారు.. మరోమారు రక...