...పిల్లలు కాదు
...పిల్లలు కాదు | ఫణీంద్ర కుప్పిలి బాగా చదువుకున్న పెద్దవాళ్ళు సైతం నేడు టెక్నాలజీ వాడకం విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు.. కానీ ఈతరం పిల్లలు మాత్రం.. ఎంతో సునాయాసంగా..ఒక సహజాతంగా వాడేస్తున్నారు.. ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన నన్నెంతో సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.. మొన్న ఆమధ్య ఓసారి నా మిత్రుడి ఇంటికి వెళ్ళాను.. వాళ్ళ బాబు నాతో ఎంతో చనువుగా ఉంటాడు.. ఆరోజు వెళ్లటంతోనే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా సెల్ అడిగాడు.. మాములుగా అయితే వెంటనే ఇచ్చేసేవాడినే..కానీ ఎందుకో ఆరోజు ' నీకు మొబైల్ ఎందుకురా? వీడియోస్ చూస్కుంటావా? ' అని క్యాజువల్ గా అడిగా..దానికి వాడు ' లేదు అంకుల్.. గేమ్ అడుకుంటా' అని చెప్పాడు.. నేను సరదాగా..' నా మొబైల్ లో గేమ్స్ లేవురా..'అని అన్నాను..వాడు దానికి ఏమంటాడో అని..కానీ నిండా మూడేళ్లు కూడా లేని వాడు..' గేమ్స్ లేకపోతే..గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి అంకుల్..' అని అనడంతో ఆశ్చర్య పోవడం నా...