జై భ్రమరావతి


జై భ్రమరావతి...

శివరాఖరు వరకూ తెలుగు మాట్లాడేవాళ్ళంతా కలిసే ఉండాలని..చేసిన అన్ని యత్నాలూ.. దానికి ఇచ్చుకున్న పబ్లిసిటీ కలరింగు అంతా.. వర్మా సినిమాల లాగా.. అట్టర్ ఫ్లాప్ అవడంతో.. రాష్ట్రం ఇడిపోక తప్పలేదు.. ప్రత్యేక  రాష్ట్రాన్ని తెచ్చేది మేమె..ఇచ్చేది మేమె అంటూ ఓపక్క ర్యాంప్ వాక్కులు చేస్తూ.. మరోవైపు..పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలు.. పాత సినిమా ఫైటలూ అన్నీ అయ్యాక.. మిగిలిన ఆవశేష ఆంధ్రప్రదేశ్ లో..ఆ పార్టీ ఒక శిలాజంగా మిగలక తప్పలేదు..

ఇన్నింటినీ దాటుకుని ఏదో గుట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే.. వార్డు మెంబర్ నుండి..అమెరికా ప్రెసిడెంట్ దాకా..అందరినీ తనే గెలిపించిన బాబు గోరి చేతికి రాష్ట్రం హ్యాండిల్ ని అప్పగించారు జనాలు.. పదేళ్ల పాటు..మూల నుండడంతో కాస్త తుప్పు పట్టినా.. బాగా కొబ్బరి నూనె పెట్టి ఓవర్ హాలింగ్ చేయడంతో.. పాలనా రోడ్డుపై ' మేఘాలలో తేలిపొమ్మన్నది..' అంటూ సైకిలుపై జోరుగా సాగిపోతుండగా..నేను మఖుటం లేని మహారాజుని కావచ్చేమో గానీ..రాజధాని లేని రాష్ట్రం కాకూడదని..అర్జంట్ గా ప్రపంచంలో నే గొప్ప రాజధానిని నిర్మిస్తానని భీష్మ ప్రతిఙ్ఞ చేసేయడం జరిగిపోయింది..

అప్పటి వరకూ ఏదోలా సైకిలు సవారీలా సాగుతున్న పాలనా ప్రయాణం..భ్రమరావతి దెబ్బకి.. స్టాండ్ వేసి సైకిలు తొక్కినట్లయింది పరిస్థితి.. ఇక భ్రమరావతి విషయానికొస్తే.. శాశ్వత సచివాలయానికి రెట్టింపు ఖర్చుతో(.. గుస గుసలు)  తాత్కాలిక సచివాలయాన్ని 108 ప్రాతిపదికన పూర్తి చేసేసి శభాష్ అనిపించుకున్నారు.. అయితే మొదటి వర్షానికే..కలువకొలను యువరాజు (...గదే లోటస్ పాండ్☺☺హీరో).. ప్రతి(పక్ష)నాయకుడి చాంబర్ నీరుతో నిండి పోవడం( బహుశా లోటస్ పాండ్ లా ఉండాలనేమో..😊😊).. ఆ వెనువెంటనే.. మీడియా గొట్టాలు సి.ఐ.డి లాగా రంగంలోకి దిగి.. ఇది కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రతిపచ్చమోళ్ళు పన్నిన కుట్రగా తేల్చిపారేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు (..లోగుట్టు పెరుమాళ్ళ కెఱుక..)

ఇక రెండో వర్షానికి.. ఆ వరుణుడు ఏకంగా నీటిపారుదల మంత్రికే ఎసరు పెట్టాడు.. శ్రీశైలం లో నీటి సంగతి పక్కన పెడితే.. చాంబరు మాత్రం పూర్తి నీటి మట్టంతో నిండుకుండలా  కలకళలాడింది.. ఎలాగూ నీళ్లు చేరాయి కదా.. వేస్టుగా ఎందుకు పోనియ్యడం అని.. నాలుగు కాగితపు పడవులు తయారు చేయిపించి..ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్ స్పోర్ట్ పై ఒక పవర్ పాయింటని ప్రెజెంట్ చేసేసారు..

ఇక భ్రమరావతి నిర్మాణానికి వస్తే...కోడిగుడ్డు ఆకారం ఒకసారి.. కొబ్బరి చిప్ప ఆకారం మరోసారి..ధర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్స్ లా ఇంకోసారి.. ఇలా చేతిలో పెన్సిల అరిగిపోయేలా.. ల్యాప్ టాపులు విరిగిపోయేలా.. డిజైన్ల మీద డిజైన్లు గీసిపారేస్తున్నారు.. ఇంకా దీనికి తోడు ఆకృతులపై సలహా కోసం మన జక్కన్న(..??☺☺☺..) సంప్రదించడం.. ఇంకా ఆ బ్రిడ్జ్ ఆకృతులైతే సరే సరి..కూచిపూడి భంగిమ ఒకసారి..మైకేల్ జాక్సన్..ప్యాంటు మీద చేయి వేసి..'క్యావ్.' అని అరిచి భంగిమలో మరోసారి.. ఇలా 'జల్సా' సినిమాలో 'అలీ..ది యోగా గురు😁😁😁..' వేయించిన యోగాసనాలు లాంటి ఆకృతులతో కడుపుబ్బా నవ్విస్తున్నారు..

ఇలా బాహుబలిలోని సి.జి ని మించిన గ్రాఫిక్స్ తోరోజూ మనల్ని అలరిస్తున్నారు..  ఆకృతులకే పుణ్యకాలం కాస్తా కరిగిపాయే.. కారులో షికారులా కాకపోయినా..కనీసం సైకిలుపై నైనా మెల్లగా సాగుదామనుకునే సగటు బక్క ప్రాణి.. తీవ్ర నిరాశకు లోను కాక తప్పటం లేదు..అయితే.. ఒక విశ్వ నగరాన్ని నిర్మించడం అంటే..అంత వీజీ కాదు.. దశాబ్దాలు పడుతుంది.. ' Rome was not built in a day..' వంటి కొటేషన్లతో శివాలెత్తే భక్తులకు..ఇది రాజరికమూ కాదు..రోమన్ సామ్రాజ్యం అంతకన్నా కాదు అన్న విషయం గుర్తుచేసుకోవాలి..ఇవన్నీ ఇలా ఉంటే..'  కనీసం తన జీవిత కాలంలోనైనా చూసి తరించగలుగుతానా లేదా భ్రమరావతి గానే మిగిలిపోనుందా..' అని తీవ్ర వేదనకు గురవుతున్నాడు..

..సగటు అమాయక ఆంధ్రుడు

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం