Posts

Showing posts from 2018

(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి

(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి          మా స్కూల్ కి చాలా దూర గ్రామాల నుండి పిల్లలు వస్తుండటంతో..  నేను హాజరు మరియు టైం విషయం లో మరీ అంత కఠినంగా వ్యవరించే వాడిని కాను.. అదీ కాక ఆ ఊళ్లో చాలామంది తమ పిల్లల్ని ముసలి తల్లిదండ్రులు లేదా అత్తమామలు వద్ద వదిలి..పనికోసం దేశం వెళ్ళేవాళ్ళు.. దాంతో పిల్లల ఆలనా పాలనా సరిగా చూసే వారుండకపోవడంతో.. క్రమశిక్షణ విషయంలో కొంత ఇబ్బంది ఉండేది.. నేను క్లాస్ టీచర్ గా ఉన్న తరగతిలో ఒకమ్మాయి రోజూ లేట్ గా వస్తుండేది.. మాములుగా అయితే నేను పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు గానీ.. ఆ అమ్మాయి హోమ్ వర్క్స్ కూడా సరిగా చేయకపోవడంతో.. ఒకసారి ఆ అమ్మాయిని నిల్చోబెట్టి.. ఎందుకు రోజూ క్లాస్ కి లేట్ గా వస్తున్నావ్? పైగా హోమ్ వర్క్ కూడా చేయటం లేదు  అని గట్టిగా అడిగా.. దానికి ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకుండా కామ్ గా నిల్చుని ఉంది.. నేను సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు గురించి వాకబు చేయటం అలవాటు.. అందువల్ల ఆ అమ్మాయిని  మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? అని అడిగా.. దానికి సమాధానంగా ఆ అమ్మాయి.. 'మా నాన్న.. లేడండీ..' ...

...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి

...ఆరు రోడ్లు | ఫణీంద్ర కుప్పిలి సాధారణంగా నేను ఎపుడూ మన ప్రగతి రథ చక్రాన్నే😳 నమ్ముకుంటాను..అదేనండీ మన ఎర్రబస్సుని🚌.. ఇపుడు బస్సు రంగుల్ని మార్చి.. మనకు రంగు పడేలా చేస్తున్నారు కదాండీ😠..ఆరోజు అనుకోకుండా ఒక తుఫాను🚐..( ఏ హుద్హుదో..తిత్లి యో అనుకునేరు..☺️) దూసుకుపోయె బండి .. మళ్లీ ఎక్కడకని.. అడక్కండేం🤣.. మా బుడ్డోడితో సహా ఎక్కాం.. అందులోనూ ముందు సీటు.. మావాడు హీరో రామ్ లాగా కాస్త అల్ట్రా హైపర్😷..  మావాడు ఆ రోజు కాస్తా నా మీద దయతలచి.. పడుకోడంతో.. ధైర్యం చేసి ముందు సీటులో ఎక్కే సాహసం చేశా.. లేదంటే.. బండి గమ్యం స్ధానం చేరే లోపు.. ఏ గేర్ రాడ్డునో.. లేదా స్టీరింగ్ చక్రాన్నో తీసి జాగ్రత్తగా.. డ్రైవర్ చేతిలో పెట్టే రకం😂.. ఇక మా ఆవిడ.. ఏదన్నా వాహనం ఎక్కడం ఆలస్యం.. శివుని మెడలో పాములా.. మాంత్రికుని టోపిలాంటి👜(..అందులో దొరకని వస్తువు ఉండదు.. పిన్నీసు నుండి పిస్తా దాకా) హ్యాండ్ బ్యాగు నుండి.. ఇయర్ మిషన్లు(..అదే లెండి..ఇయర్ ఫోన్స్) తీసి తగిలించేస్తుంది.. ఇక అంతే.. మన లోకంతో సంబంధాలు కట్.. ఇయర్స్ బద్ధలయ్యేదాకా.. లేదా.. ఇయర్ ఫోన్స్ తెగేదాకా (..విచ్ ఎవర్ ఈజ్ ఆర్లియర్) వింటుంది.....

...బతుకు బండి

                          ...బతుకు బండి | ఫణీంద్ర కుప్పిలి                        అది మంచి వేసవి మధ్యాహ్నం.. సూర్యుడు ప్రకోపానికి పిట్ట కూడా లేని రోడ్డు.. నల్లటి తాచుపాములా మెరుస్తోంది..అభివృద్ధి దెబ్బకు.. మహా వృక్షాలన్నీ నేలకొరిగాయి.. వాటి స్థానంలో కోట్లు ఖర్చు పెట్టి నాటిన క్రోటన్స్.. గుక్కెడు నీళ్ళకి నోచుకోక.. తడారిపోయి..బిక్క మొహం వేసాయి.. అలాంటి ఎడారిని తలపిస్తున్న రోడ్డు పై ఒక పాత టాటా మ్యాజిక్..కబేలాకి తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులా.. మెల్లగా సాగుతోంది.. ఆ బండిలో వెనకాల ఒక కుటుంబం కూర్చుంది..బహుశా ఎక్కడికో వలస వెళ్తున్నట్లుగా ఉన్నారు.. దేశంలోని పేదరికమంతా ఆ కుటుంబంలోని ఆడమనిషిలో కనిపిస్తోంది.. ఆమె ఒంటిపై కాణీ ఎత్తు బంగారం కాదు కదా..కనీసం గురివింద గింజంత  వెండి కూడా లేదు.. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి.. ఆ ఎండ వేడిని తట్టుకోలేక నెత్తిన కొంగు వేసుకుని..ఓ మూలగా కూర్చ...

ఫీల్డ్ ట్రిప్..

ఫీల్డ్ ట్రిప్..| ఫణీంద్ర కుప్పిలి                     రేపు పొద్దున్నే షార్ప్ గా🙄ఎనిమిదింటికి ఫీల్డ్ ట్రిప్ కి బయలుదేరాలని.. మా హైకమాండ్ ఆదేశించడంతో.. మేమంతా యాజ్ యూజువల్ గానే.. యకాయకిన తొమ్మిదిన్నరకు రెఢీ😂😀అయిపోయాం.. సమరసింహారెడ్డి సినిమాలోని టాటా సుమోల కాన్వాయ్ లా.. అదెక్కడ దొరికాయో గానీ.. బిచాణా ఎత్తేసిన చావర్లే కంపెనీ.. ట్రవేరాల కాన్వాయ్ లో పోలోమని బయలుదేరాం.. బళ్లు బయటకి చూడాటానికి బానే ఉన్నాయి గానీ.. ఒక్క డోర్స్ మాత్రం.. కాస్తా గాఠ్ఠిగా లాగితే.. ఊడొచ్చి డోర్ తో సహా క్రిందపడేలా ఉన్నాయి అంతే😀.. ఇక ఎప్పటిలానే.. మా గ్యాంగ్ లీడర్😂 ఆఙ్ఞ మేరకు.. మా బ్యాచ్ అంతా ఒకే బండిలో కూర్చున్నాం.. ముందు దగ్గర్లోని గుడికి తీసుకుని వెళతాం అని చెప్పడంతో.. కాసేపు భక్తి భావంతో ఉండాలనే మా ప్రయత్నానికి గండికొడుతూ.. డ్రైవర్ మాంచి మాస్ మసాలా సాంగ్ వేయడంతో😳..అదేదో సినీమాలో హీరో అన్నట్లు..బయటికి ఆఫీసర్లు లాగా టకప్ లేసి బిల్డప్ కాస్త గాఠ్ఠిగానే ఇచ్చినప్పటికీ.. లోపల మాత్రం ఒరిజినాలిటీ అలాగే ఉండటంతో.. ఎంతో సేపు ఆగలేకపోయాం.. ఇహ అంతే.. మా సింగర్ కం మ్...
భర్త :  ఏమేవ్.. నేనలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా.. భార్య : మీరు బ్యూటీ పార్లర్ కి ఎందుకండీ? భర్త : రేపు శ్రావణ శుక్రవారం కదా.. భార్య : అయితే.. మీరు ఏమన్నా పేరంటానికి వెళతారా?😲😲 భర్త : అదేం లేదే.. రేపు నువ్ కాళ్ళకి దణ్ణం పెట్టేటపుడు ఎలాగూ ఫోటో తీస్తావుగా.. నీ సెల్ఫీ లో కాళ్ళు బాగా పడొద్దూ.. 😀😂

నా స్వప్నం..

నా స్వప్నం | ఫణీంద్ర కుప్పిలి నేనొక కలగంటున్నాను.. ఒక మాజీ మంత్రి తనకి  రావాల్సిన పింఛను డబ్బు కోసం ఆఫీసు ముందు నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక మంత్రి గారి కారు రోడ్డు దాటుతున్న ఒక ముసలి అవ్వ కోసం సిగ్నల్స్ వద్ద ఠక్కున ఆగినట్లు.. నేనొక కలగంటున్నాను.. తనకు పుట్టబోయే బిడ్డ సీటు కోసం ఒక గవర్నమెంట్ బడి ముందర బారుతీరిన లైన్లో నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సర్కారీ దవాఖానాలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అర్ధరాత్రి దాటే వరకూ డ్యూటీ చేస్తున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపకుండానే చకా చకా ఫైల్స్ కదులుతున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సోదరి అర్థరాత్రి నిర్భయంగా తన ఇంటికి చేరుకున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. దేశం లో రాజకీయపార్టీలు నోట్లు పంచకుండానే ఓట్లడిగి గెల్చినట్లు... నేనొక కలగంటున్నాను.. కుల మత వర్గ భేదాలు లేని భారతావని నా జీవిత కాలం లోనే సాకారమయినట్లు...

అనగనగా ఆదివారం..

అనగనగా ఆదివారం..                         ఎపుడో అర్థ పుష్కర కాలం కిందట రావాల్సిన మా రిజల్ట్స్..అన్ని పురిటి నొప్పుల్ని దాటుకుని .. మా చేతికి పోస్టింగ్ ఆర్దర్లు వచ్చేసరికి..సగం మంది మగాళ్ళకి నూనె ఖర్చు తగ్గి..రంగు ఖర్చు పెరిగిపోయింది😂😂 మొత్తానికి బ్రహ్మచారులుగా ఉన్నపుడు పొందాల్సిన ట్రైనింగు..అంకుల్స్ (..ఆంటీ)😀😀గా మారాక మొదలైంది.. దాంతో బాధ్యతలు పెరిగి.. ఎపుడెపుడు ఇంటికి వెళదామా అని.. పేరోల్ కోసం ఎదురు చూసే జీవిత ఖైదీ లా..రెండో శనివారం కోసం ఎదురుచూడ సాగాం.. ఆదివారం నాడు మాంఛి నాటు కోడి పలావు ని సిద్ధం చేసుకుని.. భోజనానికి కూర్చునే సరికి.. ఉరుము లేని వర్షం లా వచ్చిన అతిథులు..ముక్క కూడా మిగల్చకుండా.. తినేసినట్లుగా.. మా రెండో శనివారం కాస్తా.. అస్సలు వినలేని క్లాసుతో కొట్టుకుపోయింది😢😢..దాంతో.. చేతిలోని లాలీపాప్ లాక్కుంటే.. చిన్న పిల్లోడికి కలిగిన ఫీలింగ్ తో ఉసురుమంటూ.. శనివారం గడిపాము.. ఆదివారం నాడు ఉదయం.. ఫ్యాక్టరీ సైరన్ లాంటి..మా వార్డెన్ వాయిస్ కి తుళ్ళిపడి ల...

ధనం మూలం ఇదం జగత్..

ధనం మూలం ఇదం జగత్.. | ఫణీంద్ర కుప్పిలి                          '..ఆ..డబ్బుదేముంది..'  '..మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం కానీ..డబ్బే ప్రధానం కాదు..' 'ఆ..డబ్బున్నోడు కూడా తినేది పిడికెడు మెతుకులే కదా..పోయేది ఆరడుగుల జాగాలోనే కదా ..' అంటూ దీర్ఘాలు పోయే వారిని చాలా మందిని రోజూ చూస్తుంటాం.. కానీ నిజ జీవితంలో మాత్రం మనలో చాలా మంది ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటాం.. కారణం ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా..ఎన్ని సుద్దులు చెప్పినా..   '..చేతిలో కాసు లేకపోతే..దమ్మిడీ కి కూడా కొరగాము..' అందుకే ఒక పెద్దాయన అన్నాడు...'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..డబ్బున్నోడి చుట్టూ తిరుగుతోంది..' అని.. అదేదో సినిమాలో హీరో గారు..అనామకుడి సమాధి ఆరడగుల మట్టి దిబ్బ అయితే.. ఒక పెద్దమ్మది అరవై ఎకరాల్లో ఉందని..గుక్క తిప్పుకోకుండా చెప్పినట్లు.. ఎన్ని అనుకున్నా..'పైసా మె పరమాత్మా హై..' రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అంటే.. అన్నదమ్ముల్ని విడదీయగలను..చివరికి కన్నవారిని సైతం మట్టుబెట్టగలను అనేది...రోజూ పత్రిక పతాక శీర్షికలే సాక్షి...

తలకో మొక్క..ఊరికో వనం

తలకో మొక్క..ఊరికో వనం | ఫణీంద్ర కుప్పిలి గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా .. “నిప్పులు కక్కుతున్న సూరీడు..భానుడి ప్రతాపానికి విలవిల లాడుతున్న జనాలు..” లాంటి మంచి టైమింగ్, రైమింగ్ ఉన్న క్యాప్షన్లతో జనాల్ని ఊదరగొదుతున్నారు.. అయినా ఎంతసేపూ..సూరన్నని ఆడిపోసుకునే బదులు..అసలు భానుడి ఈ ప్రతాపానికి కారణం ఎవరని? ఏ ఒక్కరూ ఆలోచించరే... మనం అభివృద్ధి పేరుతో కనబడిన ప్రతి చెట్టుని తెగ నరికేసి..అంగుళం ఖాళీ లేకుండా కాంక్రిటుతో  పరిచేసి.. కనుచూపు మేరలో కనీసం పచ్చ గడ్డిని మొలవనివ్వకుండా చేసేయడమే కాకుండా.. కారుల్లో..బైకుల్లో తెగ తిరిగేసి.. రోజంతా ఏ.సిలు ఫ్రిజ్ లు..మోటార్లు.. హీటర్లు.. ఒకటేంటి నానా రకాలుగా వాడేసి.. వాతావరణాన్ని వోల్ మొత్తంగా బొగ్గు పులుసుతో నింపేసి.. మన నెత్తిన మనమే కుంపటిని రాజేసుకుని.. ఇపుడు ఏ.సి రూంలో తీరిగ్గా కూర్చుని.. ”అబ్బ..ఈ వేడిని భరింలేకపోతున్నాం..” అంటూ దీర్ఘాలు పోవడం మరీ విడ్డూరం.. వెనకటికొకడు..” పచ్చదనం-ప్రాముఖ్యత పై మీటింగ్ ని..పదెకరాల తోటని నరికైనా సరే..భారీగా పెడతానని మంగమ్మ శపదం చేసాడంట..” ఇలా మనం కోట్ల టన్నుల కొలది భూవాతావరణాన్ని బొగ్గ...
ప్రతీ నీటి చుక్కని గౌరవించాల్సిందే.. అది ఆకాశం నుండి కురిసినదైనా.. ఎదుటి వారి కంటి నుండి జాలువారినదైనా.. ఒకటి ప్రాణాల్ని రక్షిస్తే.. మరొకటి బంధాల్ని కాపాడుతుంది..

నాన్న..

నాన్న..| ఫణీంద్ర కుప్పిలి. మన కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి.. సుఖంలో పొంగిపోడు.. దుఃఖంలో కుంగిపోడు.. గుండెలో పిండేసిన బాధలున్నా.. కనీసం కన్నీళ్లు తిప్పుకోడు.. మరొకరితో పంచుకోడు.. స్థితప్రజ్ఞతకు ప్రతిరూపంలా.. మనసున్న మరబొమ్మలా.. నిరంతరం సాగిపోతుంటాడు.. సంతోషాన్ని పంచుతూ.. బాధని మింగుతూ.. ప్రతీ బిడ్డకీ ఒక నిజమైన హీరోగా.. తనవారికి ఒక కంచెగా.. అనుక్షణం పహారాకాస్తూ.. మన భవిష్యత్ గురించిన బెంగ అర్థరహితంగా కొట్టిపారేసినా.. వయసులోని కోరికల గుర్రాలకు కళ్ళాలు వేయాలని చూసినా.. అనణ్యమైన అతని ప్రేమ బంధనం మనం సంకెళ్లుగా తెగనాడినా.. ప్రతిఫలాన్ని ఆశించని అవ్యాజమైన అనురాగాన్ని.. అంతులేని వాత్సల్యాన్ని.. అనునిత్యం కురిపించే నాన్న.. నీపాత్రని అర్థాంతరంగా ముగించి.. నీవు అనంతలోకాలకేగిసినా. నీ రూపం నిరంతరం నా కళ్ళల్లో ప్రతిబింబస్తునే ఉంటుంది.. క్షణకాలం కూడా మరువని నీ జ్ఞాపకాలను.. మరోమారు తలచుకుంటుంటే.. తెలియకుండానే నాగుండె తడిబారుతోంది.. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి..               ...

నేనో పెద్ద హిపోక్రాట్ ని

నేనో పెద్ద హిపోక్రాట్ ని | ఫణీంద్ర కుప్పిలి జీవితం సాఫీగా సాగినంత కాలం నేనొక నాస్తికవాదిని.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు అన్నింటిలోనూ శ్రీహరిని దర్శించే అపర ప్రహ్లాదుడిని.. సమస్య వేరొకరిది అయితే నేనొక అభ్యుదయ వాదిని.. అదే సమస్య నా నట్టింట్లోనిదయితే నేనొక కరడుగట్టిన సంప్రదాయవాదిని... స్టేజీ మీద ప్రసంగించేటపుడు నేనొక స్త్రీవాదిని.. నాభార్య బిడ్డల దగ్గర నేనొక పురుషహంకారిని.. ఇతరులకి నీతులు చెప్పేటపుడు నేనొక మానవతావాదిని.. నా తల్లిదండ్రుల్ని వదిలించుకోడానికి కుంటి సాకులజెప్పే దుర్మార్గుడిని.. ముఖపుస్తకంలో కులరహిత సమాజం కోసం తెగ పోస్టులు పెట్టే అంబేద్కర్ వాదిని.. ఎన్నికలపుడు తన కులపువాడికి మాత్రమే ఓటేసే సగటు ఓటర్ని.. ఫొటోలకి ఫోజులిచ్చేటప్పుడు నేనొక పర్యావరణవాదిని.. ఇంటి ఎలివేషన్ కి ఓ చెట్టు అడ్డొచ్చినపుడు నేనొక అరాచకవాదిని.. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవితంలో అనుక్షణం విరుద్ధ భావాల ఒరిపిడిలో... హాయిగా బ్రతికేస్తున్న ఓ పెద్ద హిపోక్రాట్ ని...   
చిరుజల్లు పలకరింపుకు ఒళ్ళు పులకరించేలోగా.. ఫీజుల దబిడి దిబిడితో పర్సు పులిసిపోనుంది..

...పిల్లలు కాదు

...పిల్లలు కాదు | ఫణీంద్ర కుప్పిలి             బాగా చదువుకున్న పెద్దవాళ్ళు సైతం నేడు టెక్నాలజీ వాడకం విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు.. కానీ ఈతరం పిల్లలు మాత్రం.. ఎంతో సునాయాసంగా..ఒక సహజాతంగా వాడేస్తున్నారు.. ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన నన్నెంతో సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది..            మొన్న ఆమధ్య ఓసారి నా మిత్రుడి ఇంటికి వెళ్ళాను.. వాళ్ళ బాబు నాతో ఎంతో చనువుగా ఉంటాడు.. ఆరోజు వెళ్లటంతోనే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా సెల్ అడిగాడు.. మాములుగా అయితే వెంటనే ఇచ్చేసేవాడినే..కానీ ఎందుకో ఆరోజు ' నీకు మొబైల్ ఎందుకురా? వీడియోస్ చూస్కుంటావా? ' అని క్యాజువల్ గా అడిగా..దానికి వాడు ' లేదు అంకుల్.. గేమ్ అడుకుంటా' అని చెప్పాడు..        నేను సరదాగా..' నా మొబైల్ లో గేమ్స్ లేవురా..'అని అన్నాను..వాడు దానికి ఏమంటాడో అని..కానీ నిండా మూడేళ్లు కూడా లేని వాడు..' గేమ్స్ లేకపోతే..గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి అంకుల్..' అని అనడంతో ఆశ్చర్య పోవడం నా...
అంతులేని విషాదాన్ని అనుభవించిన వాడే.. తన బాధని, దుఃఖాన్ని.. హృదయాంతరాళంలో పాతరేసి.. తాను నవ్వుతూ.. నలుగురిని నవ్వించగలడు..
బండబారిన గుండె అడుగున కన్నీటి చెలములెన్నో.. నవ్వు పులుముకున్న ముఖం చాటున విషాదాలెన్నో..

'వాసు'తో "కాసేపు"

'వాసు'తో  "కాసేపు" ***************                               ఫేస్బుక్కు సంభాషణలలో అనుకోకుండా ఒకసారి ’వాసు’ అనే కవి గురించి చదవటం జరిగింది.ఆ తర్వాత నేను అతని కవిత్వం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నంలో  "న్యాయపతి శ్రీనివాస రావు గారు ’వాసు’ అనే కలం పేరుతో సుమారు ఒక దశాబ్ధం క్రితం "కాసేపు" పేరుతో ఒక కవితా సంకలనాన్ని వెలువరించినట్లు తెలుసుకుని ’వాసు’ గారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.  ఎలాగైనా "కాసేపు" ని చదవాలనే నాకోరికను ఒకానొక సంభాషణల సందర్భములో వెలిబుచ్చడం, ఆయన వెనువెంటనే నాకు ఒక కాపీని ఎంతో అభిమానంతో పంపించడం జరిగింది..ఆ పుస్తకం ఎపుడెపుడు చదువుదామా అనే ఆత్రంలో ఉన్న నేను మా ఇంటికి వచ్చాక కూడా ఒక నాలుగు రోజులవరకు కనీసం పుస్తకాన్ని చూడలేకపోవడం నాలో ఆసక్తిని మరింత పెంచింది...ఇక ’కాసేపు" నాచేతికొచ్చాక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా అక్షరంమక్షరం ఆబగా చదువుకున్నా.                  గురుతుల్యులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడి గారి ...

జై భ్రమరావతి

జై భ్రమరావతి... శివరాఖరు వరకూ తెలుగు మాట్లాడేవాళ్ళంతా కలిసే ఉండాలని..చేసిన అన్ని యత్నాలూ.. దానికి ఇచ్చుకున్న పబ్లిసిటీ కలరింగు అంతా.. వర్మా సినిమాల లాగా.. అట్టర్ ఫ్లాప్ అవడంతో.. రాష్ట్రం ఇడిపోక తప్పలేదు.. ప్రత్యేక  రాష్ట్రాన్ని తెచ్చేది మేమె..ఇచ్చేది మేమె అంటూ ఓపక్క ర్యాంప్ వాక్కులు చేస్తూ.. మరోవైపు..పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలు.. పాత సినిమా ఫైటలూ అన్నీ అయ్యాక.. మిగిలిన ఆవశేష ఆంధ్రప్రదేశ్ లో..ఆ పార్టీ ఒక శిలాజంగా మిగలక తప్పలేదు.. ఇన్నింటినీ దాటుకుని ఏదో గుట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే.. వార్డు మెంబర్ నుండి..అమెరికా ప్రెసిడెంట్ దాకా..అందరినీ తనే గెలిపించిన బాబు గోరి చేతికి రాష్ట్రం హ్యాండిల్ ని అప్పగించారు జనాలు.. పదేళ్ల పాటు..మూల నుండడంతో కాస్త తుప్పు పట్టినా.. బాగా కొబ్బరి నూనె పెట్టి ఓవర్ హాలింగ్ చేయడంతో.. పాలనా రోడ్డుపై ' మేఘాలలో తేలిపొమ్మన్నది..' అంటూ సైకిలుపై జోరుగా సాగిపోతుండగా..నేను మఖుటం లేని మహారాజుని కావచ్చేమో గానీ..రాజధాని లేని రాష్ట్రం కాకూడదని..అర్జంట్ గా ప్రపంచంలో నే గొప్ప రాజధానిని నిర్మిస్తానని భీష్మ ప్రతిఙ్ఞ చేసేయడం జరిగిపోయింది.. ...
ఒక్కో రాష్ట్రాన్నీ.. చేజిక్కించుకుంటున్న తీరు చూస్తుంటే.. తన శవపేటికకు ఒక్కో మేకుని కొట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది..
ఓటమి మంచిదే.. తన వారెవరో.. తెలుసుకునేలా చేస్తుంది..
మనిషి భౌతికంగా సంఘజీవి.. మానసికంగా మాత్రం ఒంటరే..
యవ్వనంలో విప్లవ భావజాలం.. వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చింతన.. సుఖాలలో నాస్తికత్వం.. కష్టాలలో ఆస్తికత్వంతో.. సగటు మనిషి తరిస్తున్నాడు...
మనిషి మెదడు ఒక సారవంతమైన నేల వంటిది.. అందులో తులసివనాన్ని పెంచడమా? గంజాయిని సాగు చేయడమా? అనేది మన పైనే ఆధారపడి ఉంటుంది..
మురికి పట్టిన శరీరాల్ని తోముకున్నట్లుగా.. మాసిన మనసులనీ ఉతుక్కోవాలి..

తొలకరి ఆశ

తొలకరి ఆశ | ఫణీంద్ర కుప్పిలి నిర్జలీకరణతో..జీవం కోల్పోయి.. దేహమంతా నెర్రెలు బారి నిస్సహాయంగా.. నీటి చుక్కకై అంగలారుస్తున్న నేల తల్లికి.. తొలకరి తొలి వర్షపు చిరుజల్లులు పారవశ్యంతో ఒళ్ళు పులకరింపు జేస్తుంటే.. దశాబ్దాల నిరాదరణతో.. గిట్టుబాటు కాని సేద్యంతో.. శోకించి శుష్కించిన రైతు.. తొలకరి తొలి వర్షపు చిరుజల్లులు తన నేలని తాకగానే.. చేదు గతాన్ని మైమరచి.. ఏరువాకతో సాగిపోతున్నాడు.. 11.06.2017

నా మనసు

నా మనసు | ఫణీంద్ర కుప్పిలి నైరాశ్యం కమ్ముకున్న నా మనసులోని ఆలోచనలు.. దారం తెగిన గాలిపటంలా.. ఒక గమ్యమంటూ లేకుండా సంచరిస్తున్నాయి.. అనుకోకుండా రేపటి ఆశల పచ్చని చిగురు కొమ్మకి తగుల్కొని.. సగమాకాశంలో కొట్టుమిట్టాడుతున్నాయి.. ఇంతలో.. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ వచ్చి పలకరించిన ఉదయ భానుడి లేత తొలి కిరణాన్ని ఆలంబనగా చేసుకుని అనంతమైన విశ్వ వీధిలో మునుముందుకు దూసుకుపోవాలని.. ఇపుడు ఆత్రంగా ఎదురు చూస్తోంది నా మనసు.. 27.05.2017

అభివృద్ధి పొరలు

అభివృద్ధి పొరలు| ఫణీంద్ర కుప్పిలి నాలుగు మెతుకులు కోసం రెండు అక్షరం ముక్కల కోసం అలమటిస్తున్న అభాగ్యుల ఆక్రందనలు.. హోరెత్తిస్తున్న అభివృద్ధి మంత్రోచ్చారణలో అరణ్య రోదనలుగా మిగులుతున్నాయి.. నేలని నమ్ముకుని బతికే అన్నదాత.. ఆ నేలలోనే నిశ్శబ్దంగా కలిసిపోతుంటే.. అభం శుభం ఎరుగని చిన్నారులు కళ్ళు తెరవక ముందే కన్ను మూస్తుంటే.. వెలిగిపోతోందన్న భారతావని అంకెల అభివృద్ధి తళుకు బెళుకులు నాకు కనిపించడం లేదు.. బహుశా నాకంటికి ఇంకా.. అభివృద్ధి భ్రమల పొరలు కమ్ముకోలేదేమో..

అంతులేని వ్యధ-7

అంతులేని వ్యధ-7 || ఫణీంద్ర కుప్పిలి             నేను అక్కడ జరుగుతున్న హడావుడిని చూడటంతో..ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది..రొప్పుతూ రూంలోకి వెళ్ళా..అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా నన్ను చుట్టి ముట్టారు..' సర్..మీకోసమే చూస్తున్నాం..ఎక్కడికి వెళ్లిపోయారు మీరు?? పేషంట్ పరిస్థితి అస్సలు బాలేదు..అర్జెంట్ గా ఐ.సి.యూ కి షిఫ్ట్ చేయాలి..లేదంటే ప్రమాదం..' అని గుక్క తిప్పకుండా విషయాన్ని చెప్పేసింది ఒక సిస్టర్..నేను అసలేం జరిగింది అని అడిగేలోపే...' మీరు అర్జెంట్ గా ఈ పేపర్స్ పైన సంతకం చేయండి..పేషంట్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది' అంటూ..ఒక కన్సెంట్ లెటర్.. పెన్నూ..నా చేతిలో పెట్టారు..' స్టాఫ్.. నేను అమ్మ వైపు ఒకసారి చూశాను.. నిజంగానే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది.. నేను మారు మాట్లాడకుండా సంతకం పెట్టి ఇచ్చేశా..వెంటనే అమ్మని ఐ.సి.యూ కి షిఫ్ట్ చేసేశారు..                      ఐ.సి.యూ లోకి నన్ను అనుమతించక పోవడంతో..అక్కడే బయట ఉన్న ఒక బెంచీపై కూలబడ్డా..నాకంతా అయోమయంగా ఉంది..అసలు నేను డిశ్చార్జి పనుల కోసం అమ్మకి చెప్పి ఇ...

ఆత్మశోధన

ఆత్మశోధన | ఫణీంద్ర కుప్పిలి గుదిగుచ్చుకున్న భావాలు.. గువ్వల్లా ఎగిరిపోతుంటే.. గిరిగీసుకున్న జోనర్లు.. నీటి మీద వృత్తాల్లా చెరిగిపోతుంటే.. నమ్మకాల పునాదులపై నిర్మించుకున్న ఇజాలు.. పేక మేడల్లా కూలిపోతుంటే.. పెనవేసుకున్న బంధాలు పీలికలుగా మిగులుతుంటే.. స్వప్నంలో వాస్తవంలా.. వాస్తవంలో స్వప్నంలా.. అనుక్షణం వాదిస్తూ..శోధిస్తూ.. నిజాల్ని పోస్ట్ మార్టం చేస్తూ.. అనుమానాల ముసుగుల్ని తుంచేస్తూ... నిరంతరం ఆలోచనల కొలిమిలో బూజు పట్టిన భావాల్ని దహించి వేస్తూ.. వైరుధ్యాల పెనుగులాటలో.. కరడుగట్టిన భావజాలాలు తునా తునకులైపోగా.. హృదయాంతరాళాల్లో గూడు కట్టుకున్న అజ్ఞానమనే గాడాంధకారాన్ని ఆత్మశోధన అనే కరవాలాన్ని ఝుళిపించి ఛేదించగా.. రేగిన అగ్గి రవ్వల వెలుతురులో.. మనో నేత్రానికి కమ్మిన పొరలు తొలగిపోగా.. కడిగిన ముత్యంలా ఆత్మ సాక్షాత్కరిస్తుంది.. మొగ్గ తొడిగిన నూతనోత్సాహంతో.. ఎల్లలు లేని ఆత్మ విశ్వాసంతో.. నిత్య సత్యాన్వేషకునిగా జ్వలిస్తూ..చలిస్తూ.. పరమ పదాన్ని చేరుకోవాలి ఈశ్వరా..

ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్

...ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్ | ఫణీంద్ర కుప్పిలి             మొదటిసారిగా మా ఇంటికి ల్యాండ్ లైన్ ఫోను వేయిపించినపుడు.. ఆ సంబరమే వేరప్పా.. ఏదో కొత్త పెళ్లికూతురుని ఇంటికి మొదటి సారి ఇంటికి తీసుకొస్తున్నట్లుగా.. బాజా భజంత్రీలతో (..ఏదో ఫ్లో లో వాడేసాను లెండి😊😊..) తీసుకొచ్చాము.. ఇక ఆ ఫోన్ ని బిగించిన టెక్నీషియన్ ని చూసి ..సాక్షాత్తూ 'గ్రాహెం బెల్లు 'ని  చూసినంత ఆరాధనగా చూసామనుకోండి( ..మా స్కూల్ లో తెగ క్విజ్ పోటీలు జరిగేవి.. దానికోసం.. ఇలాంటివి చాంతాడు అంత బారు లిస్టుల్ని రుక్కేసే వాళ్లం😂😂😂..) ఆ పారవశ్యములో నా మిత్రుడు ఒకడు.. పెద్దయినాక చేస్తే..గీస్తే.. టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ లొనే ఉద్యోగం చేస్తానని..మా ఫ్రెండ్స్ దగ్గర సీక్రెట్ గా మంగమ్మ శపథం కూడా చేశాడంట..(మనోడు ఇపుడు ఏంటి చేస్తున్నాడని మాత్రం అడగకండేం😙😙😙).. రోజంతా ఆ ఫోన్ ఎపుడు మొగుతుందా? ఎపుడెపుడు ఫోన్ ఎత్తి మాట్లాడుదామా అని..ఇండిపెండెన్స్ డే రోజున..అన్ని దంపుడులు అయ్యాక.. శివరాఖర్లో ఇచ్చే ' ఆశా చాకిలెట్..' కోసం  పాపం అమాయకంగా తెగఎదురు చూసే పిల్లల్లాగా.. ఫోన్ కి దగ్గర్లోనే కాసుకుని కూర్చ...

బస్సాయణం

బస్సాయణం | ఫణీంద్ర కుప్పిలి                             ముందు రోజు తెల్లవారుజాము వరకూ.. ఆఫీసు పని చేయడంతో.. ఉదయాన్నే హడావుడిగా వెళ్లే అవసరం లేకుండా.. కొంచెం లేటుగా వెళ్లే వెసులుబాటు లభించింది.. దాంతో నిదానంగా తయారయి ఆఫీసుకి బయలుదేరాను.. బండి పార్కింగ్ లో పెట్టి వస్తుండగా.. ఒక ఎక్స్ ప్రెస్ బస్సు వెళ్ళిపోతోంది.. కొంచెం పరిగెట్టుంటే.. బస్సు అందుండేది.. కానీ ఆ బస్సు వెళ్ళిపోతే వెళ్లిపోనీ.. ఎలాగూ అర్జంట్ గా వెళ్లాల్సిన పనిలేదు కదా అని.. ఏదో మొక్కుబడిగా చేయి ఎత్తి ఆపాను.. కానీ వాడు కూడా బ్రేకు వేయడానికి బద్ధకంగా ఫీలయినట్లున్నాడు.. స్లో కూడా చేయకుండానే వెళ్ళిపోయాడు😂 ఓ పది నిముషాలు.. చాలా హుషారుగా ఓ పక్క ఆర్.టి.సి బస్సుల్ని చూస్తూనే.. మరో వైపు ఏదన్నా క్యాబ్ దొరక్కపోదా అని కొంచెం మోహమాటంగానే.. ఖాళీగా వెళ్తున్న కార్లను ఆపుతున్నాను.. అదేంటో..నేను వెళ్లాల్సిన చోటుకి తప్ప మిగతా అన్ని చోట్లకీ.. ట్యాక్సీ లు దొరుకుతాయి.. నా అదృష్టం అలా తగలబడుతుంది..☺️ అలా చూస్తుండ గానే సుమారు ఓ పావు గంట.. ఇరవై నిమిషాలు గడిచిపోయాయి.. ఈలోగా ఒకటి ...

Vegetarians only

Vegetarians only..| ఫణీంద్ర కుప్పిలి గత నాలుగు రోజులుగా అద్దె ఇల్లు కోసం వైజాగ్ పట్టణంలో గల్లీ గల్లీ తిరుగుతున్నా.. నిజంగా ఒక పోస్ట్ మెన్ కూడా నేను తిరిగినంతగా తిరగదేమో.. ఫ్లాట్ సంగతి దేవుడెరుగు కానీ.. నేటికీ..అదీ సిటీలో బాగా చదువుకుని..పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్న వారు సైతం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో బాగా తలకెక్కింది.. టు-లెట్ బోర్డ్ చూసి..అద్దెకిస్తారేమో అని ఫోన్ చేస్తే..ఒకడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ? మీ అమ్మా నాన్నల మీతో ఉంటారా? అని ఒకడు అడిగితే..ఇంకొకడు మీరు ఏ ఉద్యోగం చేస్తారు? ప్రయివేటా? గవర్నమెంటా? అని వాకబు చేస్తాడు.. మరికొంతమంది..తెగ మోహమాటాన్ని నటిస్తూ.. నాపేరుని అడగటం ద్వారా..నేను ముస్లిం కాదని నిర్ధారించుకుంటాడు.. ( మనం ఎపుడూ గెడ్డంతో 👹 దర్శనం ఇవ్వటం వలన కాబోలు).. మరొకడు.. నా ఇంటి పేరు బట్టి ఏ కులంలో తెలుసుకునే ప్రయత్నంలో పడతాడు..నిజానికి పెళ్లి సంబంధానికి కూడా అన్ని డిటయల్స్ ఆడగరేమో.. అసలుకే ఇల్లు వెతకలేక చస్తుంటే.. మధ్యలో ఈ వాస్తు గోడవొకటి..ఏ పేసింగ్? ఎన్ని కిటికీలున్నాయి? ఎన్ని ద్వారాలున్నాయి? ఎలెక్కలు గోలకి తెగపడినవి కొన్ని..అప్పటికే బాగా విసిగి వేస...

జీవచ్ఛవం

జీవచ్ఛవం| ఫణీంద్ర కుప్పిలి శరీరం నిండా గాయాలతో మాంసపు ముద్దలా కూలబడిన ఆ జీవచ్ఛవం... కంటిబాయిల నుండి ఉబికి వస్తున్న కన్నీళ్ళు. మనసు ముక్కలై ఏరులుపారుతున్న బాధ... ఏడ్వడానికి సైతం ఓపికలేని దైన్యం... సహజ న్యాయానికి విరుద్ధంగా... తప్పొకడిది శిక్ష ఒకరికి... భరతమాత,గోమాత.. ప్రకృతిలో ప్రతిదాంట్లో మాతృత్వాన్ని మాటల్లో కీర్తించే మన సంస్కృతి... పేరు గొప్ప..ఊరు దిబ్బ అని... పువ్వులాంటి సుకుమారమైన స్త్రీల మనసుల్ని మానభంగం చేసి శరీరాల్ని ఛిద్రం చేసి స్త్రీలని గొప్పగా కీర్తించగలిగే... నయవంచక పురుషాధిక్య సమాజం.. అడుగు బయట పెడితే చాలు... నిరంతరం వెంబడించి వేధించే... అణువణువూ శోధించే మానవ నిఘానేత్రాలు.. అడుగడుగునా అడ్డుతగిలే మానవ మృగాళ్ళు... అర్ధ రాత్రి కాదుకదా... పట్టపగలు సైతం స్వేఛ్చగా తిరగలేని ఏడుదశాబ్ధాల అర్థరాత్రి స్వాతంత్ర్యం... మహిళల వస్త్రధారణపై విరుచుకుపడే మగమహారాజులకి.. ఆరేళ్ళ పసిపాపలో చూసే అశ్లీలత ఏమిటో?? ఏదైన ఒక సంఘటన జరిగినపుడు.. హోరెత్తించే టివిల లైవ్ షోలు కొవ్వొత్తు ర్యాలీలు... మరలా.. యధేచ్చగా కొనసాగుతున్న.. మదమెక్కిన పశువికట్టహాసం...

స్వాతంత్ర్య గీతిక

...స్వాతంత్ర్య గీతిక | ఫణీంద్ర కుప్పిలి మా స్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయన్న ఆనందంలో..ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాత  పెడుతున్నట్లుగా ఉన్న ఎండని సైతం లెక్క చేయకుండా.. యమా స్పీడుగా యమహా బైకుపై ఇంటికొచ్చి పడ్డా.. ఇంటికొచ్చాక గానీ శ్రీమతి వూరికి వెళ్లిందన్న విషయం గుర్తుకు రాలేదు..అప్పటికే కడుపులో ఏనుగులు పరిగెత్తుతుండంతో..ఇగ వండుకుని తినే ఓపిక లేక..ఎపుడూ వెళ్లే మెస్ కి పరిగెత్తా.. బాగా వండితే.. జనాలు ఎక్కడ ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తారా అన్నట్లు..తినాలని ఉన్నా.. తినలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తాడు..ఆ మెస్ యజమాని.. మొత్తానికి '..నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచి ఎరుగదు..' అన్నట్లు..ఏవో నాలుగు మెతుకులు కడుపులోకి కుక్కి.. బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డా.. బయట బైకు తీసేముందు..అక్కడ ఆరుబయట ఎర్రటి ఎండలో..కాలుతున్న కడుపుతో..అంతకు మించి..గుండెని మండిస్తున్న బాధతో..ఓ ముసలాయన గార్డు డ్రెస్సులో అత్యంత దీనంగా కనిపించాడు..అపుడు గుర్తొచ్చింది..నేను ఆకలి మీద ఉండటంతో నా కళ్ళకి అతను మెస్ లోకి వెళ్ళేటప్పుడు కనిపించలేదని..ఈ వయసులో నేనె ఒక్కపూట ఆకలి తట్టుకోలేకప...

ముక్కుపిండి వసూలు

ముక్కుపిండి వసూలు | ఫణీంద్ర కుప్పిలి ఒక ప్రముఖ బార్ & రెస్టారెంట్ లో ఒక ఇద్దరు వస్తాదులు పని చేస్తుంటారు.. ఆ బార్ యజమాని అక్కడికొచ్చే కస్టమర్లకు ఒక ఛాలెంజ్ పెడతాడు.. దానిలో గెలిచిన వారికి పెద్ద మొత్తంలో బహుమతిని అనౌన్స్ చేస్తాడు.. ఆ ఛాలెంజ్ ఏంటంటే..తన దగ్గరున్న ఆ ఇద్దరు వస్తాదులు..ఒక నిమ్మకాయని కోసి..దాని రసాన్ని పూర్తిగా పిండేస్తారు..ఆ తర్వాత అక్కడున్న కస్టమర్లు లో ఎవరైనా సరే.. ఆ రసం పిండేసిన తొక్కల నుండి..కనీసం ఒక్క చుక్క నిమ్మ రసాన్ని పిండగలిగినా..వాళ్లు ఆ ఛాలెంజ్ లో గెలిచినట్లే.. అలా గెలిచిన వారికి సన్మానంతో పాటు..ఆ బహుమతిని ప్రదానం చేస్తారు.. నిత్యం అనేక మంది..ఆ ఛాలెంజ్ లో గెలవాలని ప్రయత్నించి..విఫలమవుతుంటారు..కేవలం అందులో పాల్గొనడాని కోసమే..ఆ బార్ ని సందర్శించే వారు కోకొల్లలు..ఇలా చాన్నాళ్ళు..ఆ ఛాలెంజ్ ని ఎవరూ సాధించలేక వెనుదిరిగారు.. ఒక రోజు సాయంత్రం..ఆ ఛాలెంజ్ లో పాల్గొనడానికి ఒక ముసలాయన వస్తాడు.. అందరూ..అతన్ని చూసి విపరీతంగా గేలి చేస్తారు..ఎంతోమంది మహామహులు.. గెలవలేకపోయారు.. ఈ పెద్దాయనేంటి సాధించగలడు అని..కానీ అతను ఇవేమీ పట్టించుకోకుండా.. పోటీలో పాల్గొనడా...

చిత్తు చేసిన మత్తు

చిత్తు చేసిన మత్తు | ఫణీంద్ర కుప్పిలి       ఎటు చూసినా నైరాశ్యపు చీకట్లు కమ్ముకుని ఉన్న ఆ చిన్న గదిలో..ఒక మూలగా ఉన్న కుక్కి మంచం పై ఒక శవంలా పడున్న మనిషి మెల్లగా మూలుగుతున్నాడు.. కనీసం ఏడవడానికి సైతం శక్తి లేక దీనంగా ఆ మంచం వైపు నిస్తేజంగా చూస్తున్నాయి ఓ జత నడి వయసు కళ్ళు.. బాగా మాసిపోయిన ఆ గోడలపై కొన్ని వస్తువులు గత వైభవానికి మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. అతను బాధతో మూలుగుతున్నప్పటికీ.. తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి..ఇలా ఎడ తెరిపిలేకుండా కొనసాగుతున్న నిశ్శబ్ధాన్ని చేదిస్తూ..' అమ్మా..' అన్న అరుపు లాంటి పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిడిన ఆమె..తన శక్తినంతా  కూడదీసుకుని బలవంతంగా లేచి..పెరటి వైపు పరిగెత్తింది.. చినిగిన బట్టలతో.. సరైన తిండిలేక వయసుకు తగిన ఎదుగుదల లేక.. బలహీనంగా..మొత్తం ఒళ్ళంతా దుమ్ము పేరుకుపోయి..ఎంతో దయనీయంగా కనిపిస్తోన్న..ఓ పన్నెండేళ్ల పిల్ల..ఒక ఆవుని గుంజకి కట్టే ప్రయత్నంలో.. దాన్ని ఆపలేక క్రిందపడి..బాధతో కేకలేస్తోంది..ఆమె పరుగెత్తికెళ్లి తొక్కేయబోతున్న కూతుర్ని పక్కకునేట్టే ప్రయత్నం చేసింది..దెబ్బ తగిలిన ఆ పిల్లని తన గుండెలకు హత్తు...

స్వర్గం-నరకం

స్వర్గం-నరకం | ఫణీంద్ర కుప్పిలి               తాను ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి గరిష్టంగా లాభం పొందాలని.. ప్రతీ చిన్నదానికీ విపరీతంగా క్యాలిక్యులేషన్లు వేసి.. డిస్కౌంట్ కోసం ఆషాఢంలో బట్టలు కొనుక్కునే ఒక మధ్య తరగతి సుబ్బారావు.. హఠాత్తుగా ఓరోజు మంచాన పడ్డాడు..తాను పోతానని తెలిసీ.. చివరి క్షణంలో 'హరీ' అంటూ చచ్చాడు.. సాధారణంగా తన జీవితకాలంలో.. పుణ్యాన్ని కొనుక్కునే స్థోమత లేక పోవడంతో పాటు..తన ఎదుగు బొదుగూ లేని జీవితంతో విరక్తి చెంది..చాలా సార్లు దేవుడిని చెడ మడా తిట్టడం వలన..ఇటీవల కాలంలో స్విస్ బ్యాంకులో గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన నల్ల కట్టలు మాదిరి, సుబ్బారావు పాపం కూడా కొండలా పెరిగిపోయింది.. దాంతో పాపుల చిట్టాపద్దు చూసే చిత్ర గుప్తుడు..ఈమధ్య తరగతి మహా పాపి.. పాపాల చిట్టా విప్పేసరికి.. అప్పటికే అదిరిపోయే బాహుబలి కలెక్షన్లలా పెరిగిపోతున్న పాపుల రికార్డ్ కి ఒకింత విజయగర్వంతో మీసం మెలేసిన యముడు.. అర్జెంట్ గా ఆ పాపిని ఉన్నపళంగా తీసుకు రమ్మని ఆర్డర్ ఏసేయడంతో 'యమ కింకరులు మన సుబ్బారావు ని తీసుకెళ్లడానికి ప్రత్యక్షమయ్యారు..     ...

అంబారావం..

అంబారావం..| ఫణీంద్ర కుప్పిలి        అనగనగా ఒక రాజ్యంలో కొందరు మహా మేధావులు రాజు దగ్గరికి వెళ్లి..' ప్రభూ..మన రాజ్యంలో జీవహింస విపరీతంగా పెరిగిపోయింది.. సంస్కృతీ సంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అందువలన తమరు తక్షణం పశు వధ పై నిషేధం విధించాలని ప్రార్థించారు..' అప్పటికే విచిత్రమైన ఆజ్ఞలతో పేరు సంపాదించుకున్న ఆ రాజు వెంటనే ' తన రాజ్యంలో ఎవరు పశువుని వధించినా వారి తల తీసేయబడుతుంది ' అంటూ రాజాజ్ఞని జారీ చేశాడు.. దాంతో రాజ్యంలోని పశువులన్నీ సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.                 ఆ ప్రారంభోత్సవ సభకి రాజుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి..ఆ సభలో రాజు పశువులు హక్కుల గురించి గొప్పగా ప్రసంగించాడు.. ప్రసంగం చివర్లో రాజు ' నా రాజ్యంలో ఒక మనిషికి అన్యాయం జరిగితే.. అరగంట లేటుగా వస్తానేమో..కానీ అదే ఒక ఆవుకి అన్యాయం జరిగితే అరక్షణం లో ఉంటాను ' అని తొడగొట్టి..మీసం మెలేసి డైలాగు చెప్పడం తో అక్కడున్న పశువులన్నీ తోకలెత్తి.. '..అంబా..అంబా..' అంటూ హర్షధ్వానాలు తెలియజేశాయి..      అప్పటికే చాలా సంవత్సరాలుగా వర్షాలు...