Posts

Showing posts from 2020
కరోనా కొమ్ముల్ని వంచామని సంబరపడేలోగా.. మరో రూపంలో కోరలు చాస్తోంది ఈ మాయల మరాఠీ.. ఇక ఈసారి చప్పట్లతో పనయ్యేలా లేదు తప్పెట గుళ్ళు ఆడాల్సిందే..

తరాలు మారినా - తలరాతలు మారెనా?

తరాలు మారినా - తలరాతలు మారెనా? |ఫణీంద్ర కుప్పిలి తరాలు మారినా.. ఏపిపియస్సీ తీరు మారెనా?? అభ్యర్థుల తల రాతలు మారెనా?? ఒక సమున్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ఆ లక్ష్య సాధన కోసం అనుక్షణం పరితపిస్తూ కన్నవారిని కట్టుకున్న భార్యని చివరికి కన్న బిడ్డల్ని సైతం.. వారి సుఖ సంతోషాల్ని దూరం చేసినా మౌనంగా భరించారు, సహించారు ఎందుకంటే నేనేదో గొప్ప ఆఫీసర్నయి అందర్నీ ఉద్ధరిస్తానని... కోటి ఆశలతో లక్ష్యాన్నే శ్వాస గా రేయింబవల్ని ఏకం చేస్తూ పంచవర్ష ప్రణాళిక లా అడుగడుగునా అవాంతరాలను అనేకానేక వాయిదాల్ని దాటి చివరి అంకాన్ని పూర్తి చేస్కుని వెన్నెల కోసం ఎదురు చూసే చకోరం లా ఫలితాల కోసం ఎదురు చూసిన మాకు చివరికి నిరాశే మిగిలింది.. ఎవరో చేసిన పాపాపాలకు నిర్దాక్షిణ్యం గా బలిచేస్తూ మమ్మల్ని అథపాతాళం లోకి నెట్టేశారు నిర్దయగా.. లెక్కలేన్ని తప్పులు చేసినోళ్లు దర్జా వెలగబెడుతూంటే ఏ తప్పు లేని వారు బలి పశువులవుతున్నారు.. విలువైన ధనాన్ని, కాలాన్ని అన్నిటికీ మించి ఆత్మ గౌరవాన్ని కోల్పోయి జీవచ్చవాల్లా తిరుగుతున్నా పలుకరించే నాధుడే లేడు.. ఇది కేవలం మా వ్యధ మాత్రమే కాదు ఉద్యోగాల కోస...

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి

మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి తినటానికి నలుగురుండి.. ముగ్గురికి మాత్రమే సరిపోయేంత ఉన్నపుడు.. నాకు ఆకలిగా లేదని.. మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటుంది.. మనం లొట్టలేసుకుంటూ  తింటుంటే.. తన కడుపు నిండినట్లు సంతోష పడుతుంది.. మనందరం సెలవుల్ని ఆస్వాదిస్తుంటే.. తను మాత్రం ఓవర్ టైం చేస్తుంది.. తనకు సుస్తీ చేసిన పూట కూడా మనం ఎక్కడ పస్తులుంటామోనని.. తనకేమీ కాలేదని లేని శక్తిని కూడదీసుకుంటుంది.. గడియారంలో ముల్లులా నిరంతరం సమయంతో పోటీపడి పరుగుపెడుతుంది.. అయినా తన చేస్తున్న పనికి గుర్తింపులేదు.. ఆ మాటకొస్తే ఆశించదు కూడా.. మనకంటే తక్కువ చదువుకోవచ్చు.. మనకున్నంత లోకజ్ఞానం లేకపోవచ్చు.. మనకు తెలిసిన ఎన్నో విషయాలు తనకు తెలియకపోవచ్చు.. కానీ తనకు తెలిసిందల్లా ఒక్కటే.. మనం ద్వేషించినా కూడా.. తిరిగి అంతులేని ప్రేమని పంచడమే.. ఇపుడు కొత్తగా వైఫై లు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లు వచ్చాయి గానీ.. జీవి ఊపిరి పోసుకున్న నాటి నుండి. అమ్మ మనతో నిరంతరం కనెక్ట్ అయ్యే ఉంది.. మన చుట్టూ తన మమకారాన్ని.. అనుక్షణం వైఫై లా ప్రసరిస్తూనే ఉంది.. తన ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు త...

జీవిత పరమార్థం

జీవిత పరమార్థం | ఫణీంద్ర కుప్పిలి గతం చేసిన గాయాలకు.. పరిణితి అనే మలాము పూసి భౌతికవాద విజయాల మాటున అను నిత్యం కృత్రిమత్వాన్ని చిందిస్తూ.. నలుగురిలో.. గుండె లోతుల్లోని బాధల్ని మునిపంటితో బిగువబట్టి.. లేని చిరునవ్వుని ముఖాన్ని పులుముకుని.. ఏడ్వలేక నవ్వుతూ..నవ్విస్తూ.. ఏకాంతంలో.. గుండెలు అవిసేలా రోధిస్తూ.. మరింతగా కుచించుకుపోతూ.. ఆలోచనల్లో అంతర్ముఖంగా.. జీవిత పరమార్థాన్ని దర్శిస్తూ.. జీవన యానంలో భిన్న పార్శ్వాల మధ్య.. సమతా స్థితిని సాధించడం కోసం అనునిత్యం చేసే పోరాటం లోనే మానవ మనుగడ నిలిచి ఉంది.. 24, డిసెంబరు 2016

2050 లో... | ఫణీంద్ర కుప్పిలి

2050 లో... | ఫణీంద్ర కుప్పిలి.                నేను హడావుడిగా నా పాత టూవీలర్ ని తీయబోతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి పలకరించాడు. నేనసలే మతిమరుపు మనిషిని అవ్వడం వలన కొంత మొహమాటంగానే ఒక ప్లాస్టిక్ నవ్వు విసిరి పలకరించా గానీ లోలోపల ఎవరా అన తెగ గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా..               నా మతిమరుపు గురించి బాగా తెలిసిన మనిషి అవ్వడం వలన నా ఇబ్బంది ని గమనించి తనే మా మధ్య గల మిత్రత్వాన్ని గుర్తుచేశాడు..అప్పటికి నేను తేరుకుని  పూర్తిగా ఈలోకం లోకి వచ్చాను. సుమారు పాతిక ముప్పై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ లోని ఇషయాలన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ల ముందు కనపడసాగాయి.              మేము ఆ రోజుల్లో గ్రూప్స్ కోసం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్లం. అలాగే 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూ వరకూ వెళ్ళి కోర్ట్ గొడవల వలన రిజల్ట్స్ లేక తిరిగి పరీక్షలు లేక ఏళ్లు పూళ్లు గడిచిపోయాయి. ఇపుడు మళ్లీ ఒక మూడు దశాబ్ధాల తర్వాత మా మిత్రుడు కలవడం తో మేము వాట్సాప్ లూ, ఫేసు బుక్కులూ కొత్తగా వచ్చిన ఆ రోజుల్లో...
నా జీవితంలో ప్రతీ ఉదయం ఎంతో స్వచ్ఛంగా, సంతోషంగా అనిపిస్తుంది.. నేను చేసే ప్రతీ పనినీ ఎంతో బాధ్యతగా, ఆనందంగా చేస్తాను.. నా జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఆమెకి.. నేను ప్రతీ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు మనస్ఫూర్తిగా అభినందిస్తాను.. వీటన్నింటి వెనుక ఉన్న 'ఆమె' ఎవరో కాదు.. ఇందులో ఎటువంటి రహస్యం లేదు.. అనుక్షణం నన్ను ఓపిగ్గా భరిస్తూ, సహిస్తూ చిరునవ్వుతో నట్టింట నడియాడే నా 'మహాలక్ష్మి'కి పెళ్లిరోజు శుభాకాంక్షలు..
ఇప్పుడు కొత్తగా 'సామాజిక దూరం' పాటించడమేంటి? మనం తరతరాలుగా 'సామాజిక' దూరాన్ని పాటిస్తూనే ఉన్నాం.

వలస జీవులు..| ఫణీంద్ర కుప్పిలి

వలస జీవులు..| ఫణీంద్ర కుప్పిలి కులం లేదు మతం లేదు ప్రాంతీయ భాషాభేదం లేదు.. బ్రతుకు బాటలో మెతుకు వేటలో ఏటా కొన్ని కోట్ల మంది నిశ్శబ్దంగా సాగిపోతూ ఉంటారు.. మహనగరాల నిర్మాణానికి రక్తమాంసాలని ధారపోసే నగర శివారులోని మురికి కూపాలోలు.. ఆధునిక నగరాల ప్రగతిలో అలుపెరగక పనిచేసే మర జీవులు.. తమ గుర్తింపును పల్లెల్లో విడిచి వచ్చే వలస జీవులు.. ఆధునికతను తమ వెంట మోసుకెళ్లే సాంస్కృతిక రాయబారులు.. 11 మే, 2020.

కలిసి జీవించాల్సిందే..

కలిసి జీవించాల్సిందే.. | ఫణీంద్ర కుప్పిలి ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తున్నా.. సంక్షేమంపై లక్షలకోట్లు కుమ్మరిస్తున్నా.. ఘనమైన లక్ష్యాలను ఆవిష్కరిస్తున్నా.. కేవలం త్రాగడనికి గుక్కెడు మంచినీళ్లు లేక లక్షలాది మంది కడతేరిపోతున్నారు.. పీల్చడానికి స్వచ్చమైన గాలి కరువై కోట్లాది మంది అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.. సరైన పోషణ లేక భావి భారత పౌరులు సర్వ రోగాలతో కున్నారిల్లిపోతున్నారు. విద్య, ప్రజారోగ్యాలపై సవతి తల్లి ప్రేమ కురిపించినంత కాలం.. మానవ ప్రాథమ్యాలు మారనంత కాలం.. శాస్త్ర విజ్ఞానాన్ని, హేతుబద్ధ ఆలోచనల్ని అటకెక్కించి.. చింతకాయలు రాలే సమయంలోనే మంత్రాలను చదివే బాబాల చుట్టూ.. మూఢభక్తితో ప్రదక్షిణలు చేసినంత కాలం.. మనం కరోనాతో కాకపోతే.. మరో ప్రాణాంతక పరాన్నజీవితో కలిసి జీవించాల్సిందే.. మలేరియా డెంగ్యూ సార్స్ ఎబోలా.. అనాదిగా ఏదో ఒక మహమ్మారితో కలిసి జీవిస్తూనే ఉన్నాం. సకల రుగ్మతలతో అనునిత్యం జీవిస్తూ మరణిస్తూనే ఉన్నాం.. 30 ఏప్రిల్, 2020.

అన్ సంగ్ హీరోస్..

అన్ సంగ్ హీరోస్.. | ఫణీంద్ర కుప్పిలి ఆలయాలు మూసుకున్నాయి బాబాలు అజ్ఞాతంలోకెళ్లారు.. దేవుళ్ళు మనిషి రూపమెత్తారు.. పూజలు లేవు..పునస్కారాలు లేవు భజనలు లేవు..భక్తిగీతాలు లేవు క్యూలు లేవు..కుమ్ములాటలు లేవు.. మనం మోజుతో పరిగెత్తే కార్పొరేట్ ఆసుపత్రులు మొఖం చాటేశాయి.. మనం చీదరించుకునే సర్కారీ దవాఖానాలే మనకు దేవాలయాలు అయ్యాయి.. ప్రభుత్వ వైద్యులే మనకు దేవుళ్ళయ్యారు.. మనం ప్రతినాయకుల్లా చిత్రించే పోలీసులే రాత్రనక పగలనక మనకు కాపు కాస్తూ.. నిజజీవిత కథానాయకులయ్యారు.. మనిషిగా సైతం గుర్తింపుకు నోచుకోని ముఖం లేని పారిశుధ్య కార్మికులు.. సలుపెడుతున్న చేతుల పుండ్ల బాధని నిర్దయగా వారి మాస్కుల వెనుక దాచేసి నిష్ఠగా తమ పనిని చేసుకుపోతున్నారు.. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా తన కడుపుని మాడ్చుకుని మరీ మనకింత తిండి పెడుతున్న అన్నదాత ఆరుగాలం శ్రమిస్తూనే ఉన్నాడు/ గొప్ప గొప్పోళ్ళు, చేసిన సాయానికి 'సెల్ఫీ'ల డప్పులు కొట్టుకుంటుంటే.. లేనోడు నిశ్శబ్దంగా పక్కోడికి సాయపడుతూ సాయం సంధ్యలో కలిసిపోతున్నాడు.. నిన్నటి వరకు భౌతికంగా కలిసి ఉండి మానసికంగా గోడలు కట్టుకున్నాం.. నేటి న...

వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి

వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి కడువు చేత పట్టుకొని.. బాధ్యతల్ని భుజాన వేసుకుని.. రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. కన్నోళ్లని,ఉన్న ఊరిని వదిలి.. బతుకు బాటలో, మెతుకు వేటలో జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిపోతూనే ఉంటాం.. మాకు కులం లేదు.. మతం లేదు భాష లేదు.. ప్రాంతీయ భేదం లేదు ప్రతి పనిలో మేము.. ప్రతి పనికీ మేమే.. పంట పండక.. చేసిన అప్పుతీరక ఉన్న ఊళ్లో పనుల్లేక, వలస వెళ్లే ఓపిక లేక.. పస్తులున్న ముసలి ప్రాణాలకు.. కాస్త గంజి నీళ్లు పోసేందుకు.. డొక్క మాడ్చుకుని నాలుగు రూకలు మిగుల్చుకుంటాం.. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు.. కరోనా మహమ్మారి పంజా విసిరి.. ఎక్కడోళ్లనక్కడే లాక్ డౌన్ చేసేస్తే.. కూలి లేదు.. కూడు లేదు.. ఉండేందుకు గూడు లేదు.. ఊరెళ్లడానికి చేతిలో రూక లేదు.. ఖరీదైన బాబులంతా విమానాల్లో దిలాసాగా సొంత ఇళ్ళకి చేరుకుంటే.. పిల్లా పాపలతో.. నెత్తి మీద మూటలతో నడుస్తూ..పడుతూ లేస్తూ పొలిమేర దాటేసరికి సమయమేమో మించిపోయే.. ఊరు, పేరు లేని మాబోటి కూలీలంతా పొలిమేరల్లోనే లాక్ డౌన్ అయిపోయాం.. ప్రకటనల్లోని సాయం పేపరుకే పరిమితమయితే.. ఉన్నచోట ఉండలేక.. సొంతూరుకి పోలేక....

రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి

రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి కళ్లకి కన్నీళ్ళ పువ్వులు పూచాయి.. అవి ఒక్కొక్కటిగా గుండెలోకి జారి గుండె చెరువయ్యింది... కళ్లు పొడిబారాయి... మదమెక్కి మతి తప్పిన ఉగ్రవాద మూకలు మనుషుల రక్తంతో హోలీ ఆడుతున్నాయి.. చెల్లాచెదురుగా తెగిపడిన మొండేలు.. తుఫాను తాకిడికి నేలకొరిగిన అరటి బోదెల్ని తలపిస్తున్నాయి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ గారాల పట్టీ.. హఠాత్తుగా మాయమై... మనుషుల సంతలో వేలానికి నిలబడింది... అంతర్యుద్ధం కొలిమిలో నిత్యం రగులుతున్న రావణ కాష్ఠం... వసివాడని పాలబుగ్గలపై నెత్తుటి చారలు గడ్డకట్టిస్తోంది... వేయి తూటాలకి సమానమైన ఒమ్రాన్ దక్నీష్ అమాయక చూపులు.. అంతర్యుద్ధపు పాపాలను చేష్టలుడిగి చూస్తున్న.. యావత్తు ప్రపంచపటాన్ని ఛిద్రం చేసేలా ఉన్నాయి.. సిరియా అంతర్యుద్ధం.. భూమాత శరీరంపై నిత్యం రసికారుతున్న రాచపుండు అయితే, వెంటాడుతున్న ఉగ్రభూతం.. యావత్తు భూగోళాన్ని కబళిస్తోన్న క్యాన్సరు కణం వంటిది... 19.08.2016

రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి

రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి శ్మశానం అంచున ప్రాణంతో పడున్న శవం లా.. నిస్తేజంగా, నిర్లిప్తం గా అనంత శూన్యం లోకి చూస్తూ.. గతం కళ్లల్లో సినిమా రీల్ లా పరుగులు తీస్తోంది.. నాదైన నిరంకుశ ప్రపంచం.. ఎన్నో ఆర్తనాదాలు, మరెన్నో ఆత్మ ఘోషలూ శరీరం లో సత్తువ ఉన్నంత కాలం అంగ,అర్థ బలం తో నేను జరిపిన దమనకాండ నేను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన మూగ వేదనలూ.. నేనూ నాకుటుంబం అనే మత్తులో అందరి స్వప్న సౌధాలను కూల్చివేస్తూ ఆడదాన్ని ఒక బానిసలా చూస్తూ అందరి కష్టాన్ని దోచుకుని.. నేను నిర్మించుకున్న నా కుటుంబం.. నేడు నన్ను కేవలం.. ఒక ప్రాణమున్న వస్తువు గానే చూస్తోంది.. రోజంతా కూర్చున్నా నా భారాన్ని నెత్తికెత్తుకుందని ఎవరూ ప్రేమతో తల నిమరరు సోఫాని.. సమస్తాన్ని శాసించిన నీ బుల్లెట్ ని ఎవరూ ముద్దుపెట్టుకోరు కృతజ్ఞతతో.. ఇందుకోసమేనా నా జీవితాన్ని ధారపోశాను?? ప్రాణముండగా నాలుగు మంచి మాటలు ప్రాణం పోయాక మోయడానికి నలుగురు ఆత్మీయులు లేనప్పుడు ఎంత కూడగట్టుకున్నా.. ఎన్ని మేడలు కట్టుకున్నా ఏమి ప్రయోజనం?? నాలో రగులుతున్న ఆవేదననూ పశ్చాత్తాప భావననూ నా ఆత్మ ఘోషనూ వినిపించాలని ఎంత గొంతుచించుకు...
వలవుల్ని విడిచి వగచేది వెళయాలి.. విలువల్ని విడిచి నడిచేది (అ)రాచకీయవాది..
ఆదర్శం..అద్దంలోని చందమామలా అందంగా కనిపిస్తే.. ఆచరణ..రాళ్ళు రప్పలతో నిండిన నిస్సారమైన చంద్రుడిలా కనిపిస్తుంది..

ఓ దేవదేవా.. | ఫణీంద్ర కుప్పిలి

ఓ దేవదేవా.. | ఫణీంద్ర కుప్పిలి అనుక్షణం వెన్నంటి ఉంటూ.. అడుగడునా కాపుకాస్తూ.. నిరంతరం రక్షణ ఛత్రమై.. అమ్మలా అనునయిస్తూ.. నాన్నలా వేలుపట్టుకుని.. నడిపించే ఓ దేవ దేవా.. నీ ప్రేమ.. నీ కరుణ.. నీ ఉనికి.. నీ మహిమ.. మాటల్లో కొలవలేని... అమూర్త తత్వం.. నిర్మలమైన మనసుతో.. అనుభవైక్యమైనదే.. అద్భుతమైన మానవ మేధస్సుకీ.. విజ్ఞాన శాస్త్ర విశ్లేషణలకీ.. హేతుబద్ధమైన తర్కానికీ.. అణుమాత్రం అంతుచిక్కని.. నీ  అనంత తత్వానికీ.. నిగూఢమైన శక్తికీ.. ఒక రూపమిచ్చి.. ప్రతిమని చేసి కొలవాలనుకోవడం.. అజ్ఞానంధకారంలో మగ్గిపోతున్న.. సగటుజీవికి దివిటీ పట్టి దారిచూపేందుకేనయ్యా.. ఓ దేవ దేవా..
పెట్టుబడి బారెడు..రాబడి మూరెడు..రైతు పెట్టుబడి మూరెడు..రాబడి బారెడు..దళారి
పశ్చాత్తాపానికి మించిన   ప్రాయశ్చిత్తము లేదు.. ఆత్మ పరిశీలనకి మించిన   జ్ఞానం లేదు..
మనదేశంలో వ్యవసాయం చేయడం.. రైతుకి ఒక వృత్తి కాదు.. వ్యసనం..

ఆ రెండు క్షణాలు.. | ఫణీంద్ర కుప్పిలి

ఆ రెండు క్షణాలు.. | ఫణీంద్ర కుప్పిలి అన్ని అనర్థాలకు మూల హేతువు ఆ రెండు క్షణాలు మాత్రమే.. అగ్నిపర్వతం బద్దలై.. క్షణకాలంలో సమస్తాన్ని నేలమట్టం చేసినట్లు.. ఒక్కమాటున సునామీలా వచ్చి విలయతాండవం చేసినట్లు.. కట్టలు తెంచుకున్న కోపంతో.. సర్వం మన కళ్ళ ముందే క్షణ కాలంలో బీటలు వారుతాయి.. మన కోపం చల్లారే సరికి బంధాలు..బంధుత్వాలు.. స్నేహాలు..వ్యవహారాలు..అన్నీ.. పగిలిన గాజుముక్కల్లా.. విరిగి పడిన మొండిగోడల్లా.. మనల్ని వెక్కిరిస్తాయి.. ఎన్ని ఉద్గ్రంథాలను చదివినా.. ఎన్ని గురుబోధలను విన్నా.. ఎన్ని ఉపదేశాలను పొందినా.. ఆరెండు క్షణాలు.. మనపై మనం నియంత్రణ కొల్పోతే.. మన జీవితానికి అర్థం..పరమార్థం.. ముక్తి..మోక్షం.. సర్వం కోల్పోయినట్లే.. మన జీవిత నావ కల్లోల సంద్రంలో చిక్కుకున్నట్లే.. ఆరెండు క్షణాలు.. అన్ని అనర్థాలకు మూల హేతువుగా మిగిలిపోతోంది... 20జూన్, 2017.
ఒంటరితనం మనసుని మెలిపెడితే.. ఏకాంతం సాంత్వన చేకూర్చుతుంది..
మితిమీరిన ఆంక్షలు బానిసత్వానికి దారితీస్తే.. పరిమితులు లేని స్వేచ్ఛ విశృంఖలత్వానికి దారితీస్తుంది..
యవ్వనంలో విప్లవ భావజాలం.. వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చింతన.. సుఖాలలో నాస్తికత్వం.. కష్టాలలో ఆస్తికత్వంతో.. సగటు మనిషి తరిస్తున్నాడు..
మనిషి ఉథ్థాన పతనాలను నిర్ణయించేది, ప్రాధాన్యాల ఎంపికే..

..మనిషి కదా | ఫణీంద్ర కుప్పిలి

..మనిషి కదా | ఫణీంద్ర కుప్పిలి బూజు పట్టిన భావాల్ని భుజాన వేసుకుని తిరుగుతాడు.. ఇంటికి మాత్రం మిల మిల మెరిసే రంగుని వేయిస్తాడు.. వేషంలో ఆధునికతకు వెంపర్లాడుతూ.. కాలం చెల్లిన కాకమ్మ కథల్ని వల్లిస్తాడు.. బంధాల్ని..బాంధవ్యాలనీ.. కాసులతో తూకం వేసి.. విశ్వ మానవ ప్రేమకై.. ఎలుగెత్తి చాటుతాడు.. ఎందుకంటే.. తను ఎంతైనా మనిషి కదా.. 7 ఆగష్టు, 2017
శ్వాస ఆడకపోయినా బ్రతకగలడేమో గానీ.. కాసు ఆడకపోతే బ్రతకలేడు మనిషి..
తమ బైకుకో..కారుకో ఒక చిన్న గీత పడితే సర్వస్వం కోల్పోయిన వాళ్ళలా విలవిల లాడే వాళ్ళు.. తమ సాటి మనిషి మనసుని మాత్రం.. అనుక్షణం రంపపు కోతకి గురిచేస్తూనే ఉంటారు..
మానసిక ఒంటరితనాన్ని దూరం చేసుకోడానికి ఆస్తికులు దేవుడిని ఆశ్రయిస్తే.. నాస్తికులు ఆ దేవుడి ఉనికిని ప్రశ్నించడంలో గడిపేస్తున్నారు..
పంచభూతలకు తోడుగా వచ్చిన ఆరో భూతమే, కులం..
మనం వాగితే భావప్రకటనా స్వేచ్ఛ.. ఎదుటివారు మాట్లాడితే దురహంకారం..
మాటలు మూగబోయినపుడు.. మౌనమే భావాల్ని పలికిస్తుంది..
దేశ పర్సగతి ముఖచిత్రం.. ఆధార్ కార్డులోని ఫోటోలా ఉందని వామపక్షీయులు అంటే.. పెళ్లిళ్ల పెరయ్య చూపే ఫోటోలా ఉందని పాలక పక్షం బుకాయిస్తోంది..
ఆచరణలో పెట్టని ఆదర్శం.. దప్పిక తీర్చని సముద్రం వంటిదే
కులంతో పుట్టి.. కులంతో పెరిగి.. కులంతోనే ఛస్తున్నాం..
అహంకారానికీ.. ఆత్మన్యూనతకీ మధ్య సన్నని రేఖ.. ఆత్మాభిమానం..
పేదరికం గురించి రాసినోడు.. గీసినోడు.. తీసినోడు.. చూసినోడు.. అందరూ హ్యాపీయే.. ఒక్క పేదవాడు తప్ప..
భగవంతుణ్ణి నమ్మినోడు మూర్ఖుడు కాదు.. విమర్శించువాడు మేధావి కాదు..

స్వల్ప విరామం | ఫణీంద్ర కుప్పిలి

స్వల్ప విరామం | ఫణీంద్ర కుప్పిలి మానవుడు పరుగెడుతూనే ఉన్నాడు పుట్టిన నుండీ గిట్టిన దాకా.. అరక్షణం కూడా విరామం ఎరుగక.. అలుపు సొలుపు లేకుండా.. అనుక్షం పరుగెడుతూనే ఉన్నాడు. ఆకలి, దప్పికలతో ఆదిమ మానవుడు.. ఆకలి, దప్పికలని మరచి ఆధునిక మానవుడు.. అభివృద్ధి పేరిట పరుగులెడుతూనే ఉన్నాడు.. అనితర సాధ్యమైన మేధోశక్తితో.. భూగర్భాన్ని తొలిచాడు.. అనంత సాగరాల్ని మధించాడు.. అణువుల నుండి అంతరిక్షం దాకా.. ప్రకృతిలో ప్రతిదాన్ని చెరపట్టి.. పంచభూతాల్ని పాదాక్రాంతం చేసుకున్నాడు.. విరామం ఎరుగని నిత్యాన్వేషణతో సంపదపై అంతులేని ఆశతో.. నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాడు.. అడపాదడపా మానవుని శక్తి సామర్ధ్యాలకు సవాళ్లు విసురుతున్న ప్రకృతి.. ఈసారి.. కంటికి కనిపించని.. సూక్ష్మాతి సూక్ష్మమైన శత్రువు రూపంలో అతిపెద్ద సవాలు విసిరింది.. అనుక్షణం కాలంతో పోటీపడుతూ.. విరామ మెరుగక పరుగెడుతున్న ఆధునిక మానవుడుకి.. హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించింది.. ఇది మానవ మేధ ఓటమి ఎంత మాత్రమూ కాదు.. ప్రకృతి ప్రసాదించిన స్వల్ప విరామం మాత్రమే.. విరామం లేనిదే..ఏకాంతం లేదు.. ఏకాంతం లేనిదే..ఆత్మ పరిశీలన లేదు.. ఆ...
అద్దాల మేడలో నివసించేవాడికి.. పూరి గుడిసెలోని పేదరికమెపుడూ.. అందమైన కాన్వాసు లానే కనబడుతుంది..
నరరూప రాక్షషుల మానవ హక్కుల కోసం.. పరితపించిపోయే కుహనా మేధావుల్లారా.. మరోసారి మన వీర సైనికుల నెత్తుటి మరకలపై.. తెల్లని పరదాలు పరచి..శాంతి సందేశాలిద్దాం..

స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా చేసుకుందాం...

స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా చేసుకుందాం.. | ఫణీంద్ర కుప్పిలి అర్థరాత్రి కాకపోయినా కనీసం పట్ట పగలైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా... మన సాటి సోదరుల్ని మనుషులుగా గుర్తించేలా... నా భావి భారత పౌరుల్ని ఇంద్రియ స్పృహ కలిగుండేవారిగా... కర్తవ్య నిర్వహణ లో అవినీతిని, లంచగొండితనం ను అరికట్టేలా... ఎన్నికలలో అవినీతిపరులూ, నేరస్తులూ ఎన్నిక కాకుండా ఉండేలా.. వెయ్యి నోటుకీ, లిక్కర్ బాటిల్ కి ఓటుని అమ్ముకునే దౌర్భాగ్యానికి లోనుకాకుండా ఉండేలా.. సంక్షేమపధకాలు అర్హులకి మాత్రమే దక్కేలా.. ముక్కుపచ్చలారని బాలలంతా బళ్ళోకి వెళ్ళేలా... ర్యాంకుల కోసం వెంపర్లాడని చదువులు చెప్పేలా... ఎటువంటి లీకులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా... ఒకపక్క గోదాముల్లో ఆహారధాన్యాలు మూలుగుతూ ఉంటే ఇంకో వైపు ఒక పూట తిండిలేక అలమటించే అభాగ్యులికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళేలా... ఆరుగాలం శ్రమించే రైతన్న,నేతన్నల శ్రమకి తగిన మూల్యం దక్కేలా... వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పిల్లలు కళ్లలో పెట్టుకుని చూసేలా... ఒలింపిక్స్ లో ఒక్క పతకం కోసం అర్రులు చాచే పరిస్థితి లేకుండా... నేరస్థులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా... ప్రజలం...

అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి

అలిగిన నేస్తం || ఫణీంద్ర కుప్పిలి నిత్యం ఘోర కలి తాండవిస్తున్నా.. నీటి చుక్క కోసం నేల అర్రులు చాస్తున్నా.. అవినీతి పంకిలమైన వ్యవస్థని చూసి.. రాజకీయనాయకుల రాక్షస క్రీడల్ని చూసి.. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాల చేతకానితనాన్ని చూసి.. మైనంలా కరగాల్సిన మేఘుడి గుండె బండబారిపోయింది.. భూసారాన్ని పెంచాల్సిన ఎరువులు రైతుల సారాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే.. చీడపీడల్ని పారద్రోలాల్సిన పురుగుమందులు రైతన్నల ఉసురు తీస్తుంటే.. చినుకు పడితే విత్తువేసి మరోమారు.. ఆశల వలలో పడి చిత్తు కాకూడదని.. ఉరుములు మెరుపులతో ఘర్జించాల్సిన మేఘం మౌనవ్రతం దాల్చింది.. తరాలు మారినా.. రైతు తలరాత మారకపోవడం చూసి అన్నదాత ఆకలితో అలమటించడం చూసి.. అనాధ శవంగా మారుతున్న వైనాన్ని చూసి.. తన  పునరాగమనంతో.. నెర్రెలు వారిన పుడమితల్లిని పులకరింపజేయాల్సిన చినుకు.. అలిగి ఆకాశం వెనుక దాక్కుంది.. 19 జనవరి, 2017

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి గతంలో నేను టీచర్ గా పనిచేస్తున్న రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలొచ్చాయి.. ఈ ఎన్నికల డ్యూటీలు అనేవి కొందరికి మహా సరదా అయితే నాలాంటి మరికొందరికి కొంచెం బాధతో కూడుకున్నవి.. దానికి కారణం సాధారణంగా అప్పట్లో ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదు..దాంతో పాటు పట్టణాలలో అయితే భోజనానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ అదే పల్లెటూళ్లో అయితే చాలా ఇబ్బంది.. ఇంకా మన సహచరుల సహాయంలేకపోతే పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టే.. మనకు గతంలో ఇలాంటి స్వీ(హా)టు మెమోరీస్ చాలానే ఉన్నాయి😥 ఇక ఎన్నికల రోజు రానే వచ్చింది.. ఉదయాన్నే బయలుదేరి ఎన్నికల సామగ్రి అందించే ఆఫీసు వద్దకు చేరుకున్నాను..నేను కుంచెం సీనియర్ ని అయినందువల్ల.. నాకు ప్రిసైడింగ్ 'అధికారి' ( పేరు పెద్ద..ఊరు దిబ్బ లాగా..ఈ పదవులన్నీ తేడాలు రానంతవరకే 🤣)గా వేశారు.. భగవంతుడా..ఈసారైనా నాకు మంచోళ్ళు దొరికేలా చూడు స్వామి  అని అనుకుంటుండగా..'...ఒరేయ్ మామా.. ఇంతసేపు ఎక్కడున్నావ్ రా..' అనే (గావు)కేక విన్పించింది.. బాగా విన్న గొంతులా ఉందే అని వెనక్కి త...

మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి

మృత్యు కూపాలు | ఫణీంద్ర కుప్పిలి విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్నాం.. డ్రోన్లతో సరకుల్ని చేరవేస్తున్నాం.. హృదయాంతరాళాల్ని శోధిస్తున్నాం.. డిజైనర్ బేబీల్నీ సృష్టిస్తున్నాం.. కానీ నేటికీ.. కుళ్ళిన కంపు కొట్టే చెత్తనీ.. ముట్టుకోవటానికే భయపడే వ్యర్ధాల్నీ.. తలచుకోడానికి కూడా అసహ్యించుకునే మానవ మాల మూత్రాల్నీ... మనలాగే.. రక్తమాంసాలతో.. కోటి ఆశలతో.. భావోద్వేగాలతో.. ఓ తల్లి కడుపున పుట్టిన.. మనతోటి సోదరులు.. తమ మాన ప్రాణాల్ని.. తమ భవిష్యత్తుని పణంగా పెట్టి.. మనకు గౌరవ మర్యాదల్ని.. ఆరోగ్యకరమైన జీవితాన్ని.. మన జీవితాల్లో వెలుగుల్ని నింపుతూ.. వాళ్ళు మాత్రం నాలుగు మెతుకులు కోసం.. చీకటి కూపాల్లో చిక్కుకుంటున్నారు..                 *      *      * సిరియాలో కుర్దుల హక్కుల కోసం పోరాడతాం.. రోహింగ్యాల అణచివేతపై ఉద్యమిస్తాం.. తీవ్రవాదుల మరణాలపై సంతాపం తెలియజేస్తాం.. చివరికి రేపిస్టుల హక్కుల కోసం గళమెత్తుతామ్.. కానీ.. చట్టాలు చట్టు బండలై.. చేసిన బాసలు నీటిపై రాతలై.. మన అభివృద్ధిని.. మన నాగరికతను.. ప్...
సకల సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణం.. విలువలు లోపించిన విద్యా వ్యవస్థ.. విలువలు నేర్పని కుటుంబ వ్యవస్థ.. సమస్య ములాల్ని స్పృశించకుండా.. కథలు..కవితలు.. కొవ్వొత్తుల ర్యాలీలకే పరిమితమైతే.. మరో 'రిప్' మెసేజ్ తో గోడల్ని పులమడానికి.. బాధాతప్త హృదయాలలో సిద్ధపడాల్సిందే..
మనసు లేని మనిషి , జీవన్మృతుడే..

చిన్నారుల దినోత్సవం | ఫణీంద్ర కుప్పిలి

చిన్నారుల దినోత్సవం |ఫణీంద్ర కుప్పిలి ఎత్తైన విగ్రహాలు.. ఘనమైన దినోత్సవాలు. జాతి భవిష్యత్తును తీర్చిదిద్దజాలవు.. ఏ రోజైతే పిడికెడు మెతుకులు కోసం.. నాలుగు అక్షరం ముక్కల కోసం.. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే చేతుల కోసం.. పెద్దరికం మాటున చిట్టి దేహాల్ని కబళించని ప్రేమకోసం.. ఆబగా ఈదేశ రేపటి పౌరులు.. అర్రులు చాచని రోజు.. అసలైన చిన్నారుల దినోత్సవం జరుపుకుందాం.. 14.11.2018

రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి

రక్తక్షేత్రం | ఫణీంద్ర కుప్పిలి ఆకలిగొన్న తోడేళ్ళ  వేటలో ఖండ ఖండాలుగా చీల్చబడిన శరీరాల మాంసపు ముద్దల్ని గోతాల్లో కుక్కి ఈడ్చుకెల్తుంటే బొట్లు బొట్లుగా కారిన రక్తపు చుక్కలు ఏరులై పారి తుంగభద్ర కాలువలో కలుస్తుంటే.. ఆ ప్రదేశమంతా.. పాప ప్రక్షాళనకై తన రక్తాన్ని చిందించిన క్రీస్తు శిలువని తలపిస్తోంది.. కారంచేడు కత్తి గాట్లు ఇంకా పచ్చి పచ్చిగా సలపరమెడుతుంటే ఇంతలోనే రక్తసిక్తమైన.. రక్తక్షేత్రం.. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన దళితోద్యమ జ్వాల అనతికాలంలోనే.. నిట్టనిలువునా చీలిపోయింది... పాతికేళ్ళుగా ఆరని... చుండూరు చితిమంటలు.. మన ప్రజాస్వామ్యాన్ని నిరంతరం మసిబారుస్తున్నాయి..   07.08.2016

రుధిర ఘోష | ఫణీంద్ర కుప్పిలి

రుధిర ఘోష  | ఫణీంద్ర కుప్పిలి ఇదేంటి? ఇక్కడంతా నెత్తురు మడుగులా ఉంది? అన్ని వైపులా పచ్చి నెత్తురు కంపుకొడుతోంది?? రాత్రి చిమ్మ చీకట్లో ఏ గజంపోతునన్నా బలేశారా?? మరిదేంటి? మదమెక్కిన ఆబోతుల రంకెలు ఒకవైపు, నేలకొరిగిన వీరుల హాహాకారాలు ఒకవైపు?? ఎవరు? ఎవర్ని బలేశారు?? మనిషి వధ నిషేధం కాదా మన దేశంలో.. అంటే... ఇంకా దళితులు మనుషులుగా గుర్తింపు పొందలేదా నా అధునిక భారతంలో?? మరి మనవతావాదులంతా ఏరి?? చీమ చిటుక్కుమన్నా వచ్చివాలిపోయే మన ఖాకీచొక్కాలేరీ?? ఓట్లప్పుడు ఊరూ వాడా తిరిగే మన ఖద్దరుబాబులేరీ?? అయినదానికీ,కానిదానికీ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే మన కుహానా మేధావులేరీ?? ఓహో.. వీళ్ళు అగ్రకులాల హక్కులకి మాత్రమే కాపలాదారులా?? మూడు దశాబ్దాలు గడిచినా రగులుతోంది కారంచేడు చితిమంట.. నేటికీ నాజాతికి నిలువ నీడ లేదా అని ప్రశ్నిస్తోంది 'రుధిర క్షేత్రం' సాక్షిగా..

ప్రేమికుల రోజు v2.0 || ఫణీంద్ర కుప్పిలి

ప్రేమికుల రోజు v2.0 || ఫణీంద్ర కుప్పిలి               ఈ ' వేలంటైన్స్ డే' ని జరుపుకోడం అనేది మన సంస్కృతికి విరుద్ధమా? కాదా? అనే సిధ్ధాంత రాద్ధాంతాలని పక్కన పెడితే.. ప్రేమికులు తమ ప్రేమని వ్యక్తపరచుకోడానికి ఒక రోజుని పండగలా జరుపుకోడంలో మన సంస్కృతికి భంగం కలిగేదేముంది? అయితే హృదయం నిండా ప్రేమని  వాళ్ళకి ఈ ప్రత్యేక సంబరాలు అవసరమా?? అనే మెట్ట వేదాంతాలన్నింటినీ కాసేపు పక్కన పెడితే..               కొంతమందికి మాత్రం ఇదో గొప్ప పర్వదినం.. మరీ ముఖ్యంగా మా ' పెళ్ళి ' కాని ప్రసాదు లాంటోడికి.. అదేమి ఖర్మోగానీ.. ఉద్యోగం.. హోదా..అందం అన్నీ ఉన్న మావాడికి.. ఎన్ని సంబంధాలు వెతికినా.. శివారాఖరుకి ఏదోలా బెడిసికొట్టేస్తున్నాయి.. మా ప్రసాదుకి పెళ్ళి కాలేదన్న బాధ కన్నా.. ఎక్కడ ఏ శుభకార్యానికి వెళ్ళినా మనోడి పెళ్ళే..ఓ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది..  '..మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందా?లేదా?.. శాసన మండలి ఎప్పటిలోగా రద్దవుతుంది?.. లక్ష కోట్ల అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితిమవుతుందా??..' అంటూ క్షణం తీరిక లేకుండా మ...
మనిషి జీవితం ఒక లోలకం వంటిది.. అది ఆశ..నిరాశ ల మధ్య నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది.. ఆశ చావనివ్వదు.. నిరాశ బ్రతకనివ్వదు..

తను లేకపోతే మనం లేము..| ఫణీంద్ర కుప్పిలి

తను లేకపోతే మనం లేము..| ఫణీంద్ర కుప్పిలి ముద్ద పెట్టి ముద్దు చేసే అమ్మగా.. వెనకుండి నడిపించే ఇల్లాలిగా.. అంతులేని ప్రేమని కురిపించే సోదరిగా.. అల్లరితో మురిపించే అమ్మాయిగా.. మన జీవితంతో తన జీవితాన్ని.. అణువణువు పెనవేసుకున్న ఆమె.. మననుండి కోరుకునేది మాత్రం.. కాసింత ప్రేమ.. కూసింత స్వేచ్ఛ.. తగిన గుర్తింపు.. మనమిపుడు పాటుపడాల్సింది.. స్త్రీల అభివృద్ధి కోసం కాదు.. స్త్రీలు నడిపించే అభివృద్ధి కోసం.. తన నుండి సృష్టించబడిన సగం మంది చేతిలో.. తాను అనుక్షణం నగుబాటుకి గురౌతున్నా.. తనెంతో సహనంతో.. అంతులేని ఓరిమితో.. నిరంతరం ప్రేమను కురిపిస్తూనే ఉంది.. ఎందుకంటే.. తను లేకపోతే మనం లేము..